|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు షూటింగ్‌లో మీనాకు కన్ను కొట్టిన సత్యం- ప్రాధేయపడ్డ మామ- ఆటాడుకున్న కోడలు.. ముసలోడే గానీ అంటూ!

Published: 14-06-2025, 11:48 PM
గుండె నిండా గుడి గంటలు షూటింగ్‌లో మీనాకు కన్ను కొట్టిన సత్యం- ప్రాధేయపడ్డ మామ- ఆటాడుకున్న కోడలు.. ముసలోడే గానీ అంటూ!

స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రజాదరణ పొందిన సీరియల్ గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్ లో మీనా మరియు సత్యం పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సీరియల్ షూటింగ్ సమయంలో జరిగిన ఒక హాస్య సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Key Points

1

గుండె నిండా గుడి గంటలు సీరియల్ షూటింగ్‌లో సరదా సన్నివేశాలు.

2

మీనా(అమూల్య గౌడ) మరియు సత్యం(శ్రీకాంత్ హెబ్లికర్) మధ్య హాస్య ప్రేమ.

4

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో.

షూటింగ్ సెట్‌లో సరదా

తెలుగు బుల్లితెర టాప్ ఛానెల్స్‌లలో స్టార్ మా ఒకటి. స్టార్ మా ఛానెల్స్‌లో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. వాటిలో ఒకటే గుండె నిండా గుడి గంటలు సీరియల్. స్టార్ మా , జియో హాట్‌స్టార్ ఓటీటీ లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ స్ట్రీమింగ్ అవుతుంటుంది.

అచ్చమైన తెలుగు కుటుంబ కథా నేపథ్యంతో సాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ఆదరణను సాధించింది. సీరియల్‌లోని పాత్రలు నిజ జీవితంలో చాలా వరకు ప్రతిబింబించేలా ఉంటాయి. ఇక ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా చేసిన మీనా పాత్ర మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ పాత్ర పోషించిన కన్నడ భామ అమూల్య గౌడ మరింత పాపులర్ అయింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలు, మీనా పాత్రలు చాలా మందికి ఫేవరెట్. వీటితోపాటు మంచి వ్యక్తిత్వం, హుందాతనంతో సత్యం పాత్ర ఉంటుంది. ఈ రోల్ కూడా ప్రేక్షకుల్లో అభిమానాన్ని పొందింది. సత్యం పాత్రలో నటుడు శ్రీకాంత్ హెబ్లికర్ (Srikanth Hebligar) చక్కగా ఒదిగిపోయారు. మామగా, తండ్రిగా, భర్తగా తన పాత్రకు తగినట్లుగా అలరిస్తున్నారు.

మీనా మరియు సత్యం మధ్య ఆటపట్టింపులు

ఇక మీనా, సత్యం మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఆప్యాయంగా బాగుంటాయి. కోడలిని కూతురులా చూసుకునే తీరు బాగుంటుంది. మామపై ఎంతో గౌరవంగా అణుకువుగా నడుచుకుంటుంది మీనా . అయితే, ఇదంతా రీల్ లైఫ్‌లో సీరియల్‌లో. కానీ, నిజ జీవితంలో మాత్రం మంచి సత్యంను ఆటపట్టిస్తుంటుంది మీనా.

రీల్ లైఫ్‌లో ఆన్ స్క్రీన్‌లో మామ-కోడళ్లుగా ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో నటించే అమూల్య గౌడ, శ్రీకాంత్ హెబ్లికర్ ఆన్ స్క్రీన్‌లో మాత్రం మంచి ఫ్రెండ్స్‌లా జోకులు, కౌంటర్స్ వేసుకుంటూ సందడి చేస్తుంటారు. అందుకు ఉదాహరణే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోన్న ఈ వీడియో. ఇది గుండె నిండా గుడి గంటలు సీరియల్ మేకింగ్ వీడియో.

గుండె నిండా గుడి గంటలు షూటింగ్‌లో సత్యం ను ఏడిపించింది మీనా. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే.. “సర్ నవ్వుతున్నాడు సర్ (సత్యం). సర్ కన్ను కొడుతున్నాడు” అని మీనా చెప్పింది. “సర్ మీరే చూడండి” అని సత్యం అన్నాడు. “ఏంటీ కన్ను కొడుతున్నాడా.. ముసలోడే గానీ” అని సీరియల్ టెక్నికల్ టీమ్ నుంచి ఎవరో అన్నారు.

వైరల్ అవుతున్న వీడియో

“లేదు సర్” అని ప్రామిస్ చేసినట్లుగా చెప్పిన సత్యం (శ్రీకాంత్ హెబ్లికర్) ఏయ్ మీనా ( అమూల్య గౌడ ).. ఇలా చేయకు అన్నట్లుగా చెప్పాడు. దాంతో అమూల్య గౌడ కళ్లకు కొంగు కప్పుకుంటూ నవ్వింది. “అంటే, ఆయన చేసేది మాకు తెలియకూడదా” అని మరొకరు అంటే.. “అవును సర్” అని అమూల్య గౌడ అంది. దాంతో అంతా నవ్వారు.

తర్వాత బాలుతో సత్యం మాట్లాడుతున్న సన్నివేశం షూట్ చేస్తుంటే పక్కనే ఉన్న మీనా సత్యంను గిల్లింది. అది తెలిసి ఇలా చేయకు అని సత్యం అంటే.. శ్రీకాంత్‌నే బెదిరించింది అమూల్య గౌడ. ఇలా సత్యంను కోడలు మీనా, సీరియల్ టీమ్ ఆడుకుంటే శ్రీకాంత్ హెబ్లికర్ మాత్రం ప్రాధేయపడాల్సి వచ్చింది. ఇలా సాగిన ఈ గుండె నిండా గుడి గంటలు షూటింగ్ వీడియో వైరల్ అవుతోంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లోని మీనా మరియు సత్యంల మధ్య అద్భుతమైన నటన, వారి వ్యక్తిగత జీవితంలోని సరదా క్షణాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ జంట యొక్క కెమిస్ట్రీ సీరియల్ కు ప్రత్యేక ఆకర్షణ.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.