
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో ఉత్కంఠభరితమైన ట్విస్టులు, టర్న్స్ ఉన్నాయి. మీనాపై దొంగతనం ఆరోపణలు, బాలు ఇంటినుండి వెళ్ళిపోవడం, రవి అత్తింటికి వెళ్ళడం వంటి సంఘటనలు కుటుంబంలో ఉద్రిక్తతను పెంచుతాయి.
Key Points
శ్రుతి నగను మీనా దొంగిలించిందని సురేంద్ర, శోభన ఆరోపిస్తారు.
మీనా నిరపరాధి అని బాలు, సత్యం ధృవీకరిస్తారు.
బాలు ఇంటి నుండి వెళ్ళిపోతాడు, రవి అత్తింటికి వెళ్తాడు.
మీనాపై దొంగతనం ఆరోపణలు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి నగను మీనా కొట్టేయాలని చూసిందని సురేంద్ర, శోభన నిందలు వేస్తారు. ఆ మాటలు విన్న ప్రభావతి, కామాక్షి గదిలోకి వెళ్లారు. కూతురు చైను దొంగతనం చేస్తోంది. కట్టుకున్న వాడికి కష్టపడి కొనివ్వలేడని ఇలా చేసిందని సురేంద్ర అంటాడు.
ఇంకా నా కూతురు దగ్గర ఏమేం దొంగతనం చేశావో. దొంగలతో బతుకుతున్నానని తనకు తెలియదు కదా అని శోభన నానా మాటలు అంటుంది. దాంతో మీనా ఏడుస్తూ పరుగెత్తుకెళ్లి బాలుపై వాలుతుంది. ఏమైందని అంతా అడుగుతారు. ఇంతకంటే మంచి అవకాశం దొరకదు అని శోభన, సురేంద్ర అనుకుంటారు. నీ భార్య ఒక దొంగ అని సురేంద్ర అంటాడు.
నా కోడలు దొంగ ఏంటీ, తను ఎప్పటికీ చేయదు. తన చేతిలో చైన్ ఉన్నప్పుడు నేను పట్టుకున్నాను, నీ భార్య కూడా చూసిందని సురేంద్ర అంటాడు. చేతిలో చైన్ ఉంటే దొంగతనం చేసినట్లా అని కామాక్షి అంటుంది. నువ్ అనుకున్నదానికంటే గొడవ బాగా అయ్యేలా ఉందని రోహిణితో విద్య అంటుంది. మీనా దొంగతనం చేయడం ఏంటీ. వీళ్లేదో కుట్ర చేస్తున్నారు అని రోహిణి అంటుంది.
మీనా అసలు ఏం జరిగిందో చెప్పు అని బాలు అడుగుతాడు. దాంతో జరిగింది చెబుతుంది మీనా. నేనే శ్రుతిని పిలుచుకురమ్మని చెప్పానురా అని కామాక్షి అంటుంది. ఇద్దరు ఇంటి కోడళ్లు ఒకరి వస్తువును మరొకరు జాగ్రత్త చేయాలనుకోవడం తప్పేలా అవుతుందని సత్యం అంటాడు. నా మీదకు లేస్తున్నారు, కథలు అల్లుతున్నారా అని సురేంద్ర అంటాడు.
ఈ అమ్మాయికి ఇంత దొంగబుద్ధి ఉందని తెలియదు అని శోభన అంటే చాలు.. ఇక చాలు. మీరు చూసినప్పడు అలా అనిపించొచ్చు. తనకు దొంగతనం అవసరం లేదు అని బాలు అంటే.. జైలుకు వెళ్లి వచ్చిన నువ్వు చెబుతున్నావా. ఆమె తమ్ముడు కూడా దొంగే కదా. వాళ్లది దొంగతనం చేసే కుటుంబం అని సురేంద్ర అంటాడు. నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడకండని మీనా అంటుంది.
కుటుంబంలో తలెత్తిన గొడవలు
ఇప్పటివరకు ఓపిక పట్టాను. ఇక చాలు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడిన ఊరుకునేది లేదని సత్యం కోప్పడతాడు. మీనా గొప్పదనం గురించి చెబుతాడు సత్యం. మీకు కూతురు ఉంది. మా అమ్మాయిని ఎందుకు నలుగురిలో అవమానిస్తున్నారు అని కామాక్షి అంటుంది. ఇక ఇంతటితో వదిలేస్తే మంచిది అని బాలు అంటాడు. నా కొడుకు గొడవ వద్దని అంటున్నాడు. ఇక వదిలేయండని సత్యం అంటాడు.
ఏం బెదిరిస్తున్నారా తండ్రీకొడుకులు. వాడు చెబుతుంది వినాలా. నువ్ చెబితే నమ్మాలా. వాడే ఓ క్రిమినల్ అని సురేంద్ర అంటాడు. సురేంద్ర చాలా తప్పుగా మాట్లాడుతున్నావ్ అని కోపంతో ఊగిపోతాడు సత్యం. విశ్వరూపం చూపిస్తాడు. నీతో మాట్లాడి అనవసరం పదండి అని సత్యం అంటే.. మెల్లిగా జారుకుంటున్నారా. ఇదంతా నీ కొడుకు వెనుక నుండి నడిపించాడా అని సురేంద్ర అంటాడు.
ఇలాంటి బతుకు బతికే కన్నా అడుక్కుతినొచ్చుగా అని సురేంద్ర అంటాడు. దాంతో కోపం కట్టలుతెంచుకున్న బాలు సురేంద్రను కొడతాడు. ఇంతలో వచ్చి శ్రుతి బాలును ఆపుతుంది. మా నాన్నను కొడతాడా. ఇతని రౌడీయిజం చూపిస్తాడా అని శ్రుతి అంటుంది. వయసుకు గౌరవం ఇవ్వాలిగా అని శోభన అంటుంది. బర్రెలకు పందులకు కూడా వయసు వస్తుంది. మా నాన్న ఎంత ఓర్పుగా సర్దిచెబుతున్నాడు. వీడేంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడు అని బాలు అంటాడు.
అసలు ఎందుకు కొట్టావ్ అన్నయ్య రవి అడుగుతాడు. బాలు సంగతి తెలిసిందేగా. నా కళ్ల ముందే మా నాన్నను కొడతాడా అని శ్రుతి అంటుంది. అందుకే వీడిని తీసుకురావొద్దని అన్నాను. ఎక్కడికి వెళ్లిన తద్దినం పెడతాడు అని ప్రభావతి అంటుంది. చాలు ఆపు. వాడు ఎంత ఓపికగా ఉన్నాడో చూల్లేదా అని సత్యం భార్యపై అరుస్తాడు. మాట్లాడుకుంటే అయిపోయేదానికి కొట్టాలా అని ప్రభావతి అంటుంది.
బాలు, రవి నిర్ణయాలు
మనల్నీ అంత అంటుంటే ఒక్క మాట మాట్లాడని తనకు నన్ను విమర్శించే హక్కులేదను చెప్పు నాన్నా బాలు అంటాడు. రవి కూడా కొట్టాల అని అంటే.. జరిగింది తెలిస్తే నువ్వే చెప్పు తీసుకుని కొడతావ్. ఇక్కడ ఏం జరిగిందో వీళ్లందరిని అడుగు. ఇలాంటి సంస్కారం లేని వాళ్ల ఫంక్షన్‌కు ఇంకోసారి మనం రాకూడదు పదా మీనా అని చేతిలో ఉన్న చైన్ మొహాన పడేసి భార్యను బాలు తీసుకెళ్తాడు.
దాంతో సురేంద్ర, రోహిణి, శోభన సంతోషిస్తారు. ఇంత జరిగిన అలాంటి దరిద్రపు కొంపలోనే బతుకుతావా అని శ్రుతిని అంటారు తల్లిదండ్రులు. మీ నాన్నను కొట్టిన వాడి ఇంటికి వెళ్తావా. ఇదేనా మీ నాన్నకు ఇచ్చే గౌరవం. నువ్ ఆ రౌడీని సమర్థించినట్లు అవుతుంది అని శోభన అంటుంది. ప్రభావతి కూడా నచ్చజెబుతుంది. దాంతో శ్రుతి మౌనంగా వెళ్లిపోతుంది.
శ్రుతికి నచ్చజెప్పి రవితో పంపించండి అని చెప్పేసి సత్యం ఫ్యామిలీ వెళ్లిపోతుంది. ఇప్పుడు బాలు మాత్రమే నిన్ను సేవ్ చేశాడు. లేకపోతే మీ అత్తయ్య నిన్ను వదిలేది కాదు అని రోహిణితో విద్య అంటుంది. అనుకుంది సాధించినట్లుగా సురేంద్ర, శోభన చూస్తారు. మరోవైపు ప్రభావతి ఆవేశపడుతుంది. బాలు, మీనాను ఇంట్లోంచి వెళ్లిపోమంటుంది ప్రభావతి.
మీ వల్లే నా కొడుకు, కోడలు ఇంట్లోంచి వెళ్లిపోయారు. మీరు కూడా వెళ్లిపోండి అని తిష్ట వేసుకుని కూర్చొంటుంది ప్రభావతి. దాంతో బాలు, మీనా లగేజ్ బ్యాగ్‌లు పట్టుకుని కిందకు వచ్చి ఇంట్లోంచి వెళ్లిపోతారు. మరోవైపు అత్తింటికి రవి ఇల్లరికం వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈరోజు ఎపిసోడ్‌లో చోటుచేసుకున్న సంఘటనలు కుటుంబంలో విభేదాలను మరింత పెంచుతాయి. బాలు, రవి నిర్ణయాల ప్రభావం భవిష్యత్తు ఎపిసోడ్స్‌లో కనిపించనుంది.


