
📌 Key Points
- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో మీనా కిడ్నాప్!
- బాలుపై గుణ, దినేష్‌ల ప్రతీకారంతో ఉత్కంఠ!
- తల్లి ప్రభావతిని నోర్మూయ్ అని హెచ్చరించిన బాలు!
- పోలీసులకు భయపడి గుణకు ఫోన్ చేసిన రోహిణి!
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. మీనా కిడ్నాప్ కావడంతో కథనం ఊహించని మలుపు తిరిగింది. బాలు ఎలా స్పందిస్తాడో చూడటం ఆసక్తికరంగా మారింది. ఈ సీరియల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్!
మీనా కిడ్నాప్ వెనుక ఎవరు?
Gunde Ninda Gudi Gantalu Serial April 10th Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 10వ ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన బాలు మీనా గురించి అడిగితే శ్రుతి లేదని చెబుతుంది. ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయిందని రవి చెబుతాడు. తల్లి ప్రభావతిని నోర్మూయ్ అని తిడతాడు బాలు. మీనాను గుణ కిడ్నాప్ చేయిస్తాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కామాక్షి రెండు లక్షలు పోయాయని ఇంట్లో ప్రభావతి పెద్ద గొడవ చేస్తుంది. మీనానే దొంగతనం చేసిందని నానా మాటలు అంటుంది. దాంతో ప్రభావతిపై సత్యం, రవి, శ్రుతి మండిపడతారు.
రోహిణి మాటలు వింటున్నది చూసిన మీనా కావాలనే రేపు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను, వాళ్లే ఎంక్వైరీ చేసి దొంగను పట్టుకుంటారని అంటుంది. అది విన్న రోహిణి భయంతో వణికిపోతుంది. పోలీసులు వస్తే నిజం అంతా తెలిసిపోతుందని కంగారుపడుతుంది. ఏం చేయాలో తెలియక గుణకు కాల్ చేస్తుంది. అదే సమయంలో దినేష్‌తో కలిసి గుణ మందు తాగుతుంటాడు.
తల్లిపై బాలు సీరియస్ యాక్షన్!
గుణకు కాల్ చేసిన రోహిణి నీకు రెండు లక్షలు ఇచ్చేందుకు కామాక్షి ఇంట్లో దొంగతనం చేశాను. అది ఇంట్లో పెద్ద గొడవ అవుతోంది. దానివల్ల నేను ఇరుక్కుంటాను. దాంతోపాటు నువ్వు కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. ఆ రెండు లక్షలు ఇప్పుడు నాకు ఇవ్వు, నీకు మళ్లీ ఇస్తానంటుంది. అవి దినేష్ ట్రీట్‌మెంట్ కోసం ఇచ్చేశాను కదా. లేవు అని గుణ అంటాడు.
ఆ బాలు గాడి మీద నాకు కూడా కోపం ఉంది. నన్నే వాడు జైలుకు పంపించాడు. నేను కూడా నీకు హెల్ప్ చేస్తానంటాడు దినేష్. గుణ, దినేష్ కలిసి బాలుపై పగ తీర్చుకునేందుకు మీనాను కిడ్నాప్ చేసే ప్లాన్ చేస్తారు. మరోవైపు మీనా ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్తుంది. తర్వాత బాలు ఇంటికి వస్తాడు. మీనా అని పిలుస్తాడు. ఇంట్లో అంతా వస్తారు. మీనా గురించి బాలు అడిగితే.. ఇంట్లో లేదని శ్రుతి సమాధానం ఇస్తుంది.
దాంతో బాలు ఫోన్ చేస్తాడు. ఎంతకీ మీనా ఫోన్ తీయదు. వదినా ఫోన్ ఇంట్లోనే వదిలేసి పోయిందని రవి చెబుతాడు. పంపించేసిందా లేదా ఇంట్లోంచి గెంటేసిందా అని తల్లిని ఉద్దేశించి బాలు అంటాడు. నీ పెళ్లాం రెండు లక్షలు దొంగతనం చేసింది అని ప్రభావతి అంటుంది. దాంతో కోపంగా మొదటిసారి తల్లిని నోర్మూయ్ అని అంటాడు బాలు. దాంతో అంతా షాక్ అవుతారు.
గుణ, దినేష్‌ల ప్లాన్ సక్సెస్ అయ్యేనా?
ఇప్పుడు నా భార్య ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి అప్పుడు చెబుతాను అని బయటకు వెళ్లిపోతాడు బాలు. బాలు అన్నంత పని చేస్తాడు. దొంగతనం ఎవరు చేశారో కనుక్కుంటే నేను, విద్య దొరికిపోయినట్లే అని కంగారుపడుతుంది రోహిణి. గుణకు కాల్ చేసి తాను చెప్పింది ఏం చేశావ్. మీనాను ఆపావా. మీనా కోసం బాలు వెతుకుతున్నాడు అని రోహిణి చెబుతుంది.
మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా నేను ఆపుతాను. నువ్వేం కంగారుపడకు అని గుణ చెబుతాడు. మరోవైపు స్కూటీపై మీనా వెళ్తుంటే ఎదురుగా వ్యాన్ వచ్చి ఆగుతుంది. నలుగురు ముసుగు వేసుకుని వచ్చి మీనాను పట్టుకుని తీసుకెళ్తారు. అక్కడే ఉన్న వృద్ధ జంట చూస్తారు. మీనా కిడ్నాప్‌ను ఆపేందుకు ట్రై చేస్తారు. కానీ, ఆపలేకపోతారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మరింత ఉత్కంఠగా సాగుతోంది. మీనా కిడ్నాప్ మిస్టరీ వీడుతుందా? బాలు ఏం చేస్తాడో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


