
స్టార్ మా లో ప్రసారమయ్యే గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం ఎపిసోడ్ లో బాలు రౌడీలను ఎదుర్కొని వారిని తరిమేస్తాడు. ఈ ఘటన ప్రభావతి మరియు ఇతర పాత్రలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.
Key Points
రౌడీలతో బాలు తలపడటం
ప్రభావతికి షాకింగ్ వార్త
మీనా, ఇంటివారి స్పందనలు
బాలు మరియు రౌడీల మధ్య ఘర్షణ
స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు గురువారం (జులై 31) 478వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రౌడీలను బాలు తరిమేయడం, అది ప్రభావతి చూడటం, ఆ తర్వాత ఇంట్లో పెద్ద గొడవ చేయడం, ఆ పెద్దాయన బాలుని కాపాడటం లాంటి సీన్లు ఈ ఎపిసోడ్లో చూడొచ్చు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (జులై 31) ఎపిసోడ్ రౌడీలను బాలు బతిమాలే సీన్ తో మొదలవుతుంది. ఆ పెద్దాయన కూతురి పెళ్లి అన్నా.. దయచేసి ఖాళీ చేయండన్నా అంటూ బతిమాలుతాడు. ఎంత చెప్పినా వాళ్లు వినరు. బాలుపై దాడికి ప్రయత్నిస్తారు.
దీంతో బాలు ఎదురు తిరుగుతాడు. ఆ రౌడీలను చితగ్గొడతాడు. ఈ క్రమంలో బాలుకు ఓ కత్తి గాయం కూడా అవుతుంది. అయినా వినకుండా రౌడీలను కాళ్ల బేరానికి తీసుకొస్తాడు. వాళ్లు భయపడి అక్కడి నుంచి పారిపోతారు.
ఆ రౌడీలు బైకులపై పారిపోతుండగా వాళ్లకు ప్రభావతి , కామాక్షి ఎదురవుతారు. వాళ్లను చూసి ప్రభావతి తిడుతుంది. ప్రతి వీధిలో ఓ రౌడీ మూక తయారైందని విసుక్కుంటుంది. పక్కనే ఉన్న కామాక్షి స్పందిస్తూ.. కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు అంతే అంటుంది.
నిన్ను ఓ విషయం అడుగుతాను అంటూ మీనా పూలకొట్టు తీయించింది నువ్వే కదా అని ప్రభావతితో అంటుంది. ఆమె కంగారు పడుతూ తాను కాదని చెబుతుంది. ఇదే విషయం బాలుకి చెప్పేవు.. ఇల్లు పీకి పూల షాపు పెడతాడని ప్రభావతి అంటుంది.
ప్రభావతి, మీనా స్పందనలు
చెప్పినట్లే రౌడీలను ఇంట్లో నుంచి తరిమేసిన బాలు కి ఆ పెద్దాయన డబ్బు ఇవ్వబోతాడు. తాను ఓ ఆడపిల్ల పెళ్లి కోసం ఇలా చేశానని, డబ్బు కోసం కాదని అంటాడు. ఓ అన్నగా ఆమె పెళ్లికి పిలిస్తే వచ్చి దీవించి వెళ్తానని బాలు చెబుతాడు. అప్పుడే అక్కడికి కామాక్షి, ప్రభావతి వస్తారు.
అదే సమయంలో బలవంతంగా బాలు చేతుల్లో అతడు డబ్బు పెడతాడు. అది చూసి డబ్బు ఎందుకు ఇస్తున్నాడని కామాక్షి అనడంతో ఆ రౌడీలను తరిమేయడానికి ఈ రౌడీని తీసుకొచ్చి డబ్బు ఇచ్చి ఉంటారని చుట్టుపక్కల వాళ్లు అనడంతో ప్రభావతికి ఒళ్లు మండిపోతుంది.
ఆ పెద్దాయన ఇచ్చిన డబ్బుతో బాలు కొత్త బండి కొనుక్కొని ఇంటికి తీసుకొస్తాడు. అందరినీ బయటకు పిలుస్తాడు. పూల బండి పోతే మొబైల్ బండిని తీసుకొచ్చానని మీనాకు చెబుతాడు. ఆ బండి చూసి సత్యంతోపాటు శృతి, రవి ఆనందిస్తే.. రోహిణి, మనోజ్ కుళ్లుకుంటారు. అమ్మ ఎక్కడ.. ఈ టైమ్ లో ఉంటే ఎంత కుళ్లుకునేదో అని బాలు అంటాడు.
ఖర్చు పెట్టి ఇప్పుడివన్నీ ఎందుకు అని మీనా అంటుంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు కారు కొనిపెట్టావు.. నేను ఇప్పుడు నీకు బండి కొనిపెట్టలేనా అని బాలు అంటాడు. నీ మనసు గొప్పదంటూ సత్యం అతన్ని అభినందిస్తూ గుండెపై తడతాడు.
ఈ క్రమంలో బాలు బాధతో విలవిల్లాడటంతో అందరూ ఆ గాయం చూసి ఆందోళన చెందుతారు. కారు రిపేర్ చేస్తుంటే ఈ గాయం తగిలిందని బాలు అబద్ధమాడతాడు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత మీనా అతనికి ఆయింట్‌మెంట్ రాస్తుంటుంది. అప్పుడే మనోజ్ ఆ గాయంపై అనుమానం వ్యక్తం చేస్తాడు. వేరే ఏదో జరిగి ఉంటుందని అంటాడు. అయినా బాలు మాత్రం ఏదో కవర్ చేస్తాడు. మనోజ్ ను దెప్పిపొడుస్తాడు.
బాలు కొత్త బండి
అప్పుడే ఇంట్లోకి వస్తుంది ప్రభావతి. ఏం జరిగిందో తాను చెబుతానని, ఆ బండి కష్టపడి సంపాదించి కొనలేదని, రౌడీయిజం చేసి సంపాదించాడని అంటుంది. తానంతా చూశానని చెబుతుంది. కానీ మీనా మాత్రం నమ్మదు. డబ్బు కోసం ఆయన అలాంటి పని చేయరని అంటుంది.
అయితే తాను కాదు కామాక్షి కూడా చూసిందని ప్రభావతి చెబుతుంది. తాను చెబుతుంది నిజం కాదని మీ ఆయన్ని చెప్పమని అంటుంది. అటు సత్యం కూడా కష్టపడి సంపాదించే నువ్వు.. ఎందుకలా మౌనంగా ఉన్నావని నిలదీస్తాడు. దీంతో అమ్మ చెప్పేది అబద్దం కాదని, అలా అని పూర్తి నిజం కూడా కాదని బాలు అంటాడు.
అటు మనోజ్, రోహిణి కూడా బాలును నిందిస్తారు. ఇలాంటి బతుకు బతికే కంటే గుడి ముందు అడుక్కోవడం మేలని రోహిణి అంటుంది. అటు సత్యం కూడా ఇలాంటి పని చేయడమేంటని షాక్ తింటాడు. ఓ మనిషికి సాయం చేయడం కోసం తాను ఈ పని చేసినట్లు బాలు చెబుతాడు. అయినా ప్రభావతి మాత్రం బాలుని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని అంటుంది.
అప్పుడే పెద్దాయన మరోసారి సీన్లోకి ఎంటరవుతాడు. తన కూతురి పెళ్లి మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలని ట్యాక్సీ స్టాండ్ కు వెళ్తే.. మీ ఇంటి అడ్రెస్ ఇచ్చారని అంటాడు. గుడిలో దేవుడికి మొదటి శుభలేఖ ఇవ్వాలన్నారని, అందుకే తాను మీ దగ్గరికి వచ్చానని అంటాడు.
ఇలాంటి కొడుకు ఉన్న మీ కుటుంబం చాలా అదృష్టవంతులని అతడు అనడంతో అందరూ షాకవుతారు. ఇతర మీ దగ్గర డబ్బు తీసుకున్న కిరాయి రౌడీ కాదా అని ప్రభావతి అడుగుతుంది. అతడు కాదమ్మ అని అంటాడు. దీంతో ఆమె బిక్క మొహం వేస్తుంది. అంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసడ్ లో కొత్త బండిపై మీనా రయ్ మని వెళ్తూ కొత్త బిజినెస్ మొదలుపెట్టినట్లుగా చూపించారు.
చివరిగా, బాలు కొత్త బండితో ఇంటికి వస్తాడు. అతని కొత్త వాహనంపై ఇంటివారు వ్యతిరేకంగానూ, అనుకూలంగానూ స్పందిస్తారు. ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.


