|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పోలీస్ స్టేషన్‌కు మనోజ్ పంచాయితీ.. కల్పన తరఫున బాలు సాక్షి సంతకం.. రోహిణి షాక్

Published: 07-08-2025, 10:14 PM
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పోలీస్ స్టేషన్‌కు మనోజ్ పంచాయితీ.. కల్పన తరఫున బాలు సాక్షి సంతకం.. రోహిణి షాక్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ 484వ ఎపిసోడ్ లో, కల్పనను కేంద్రంగా చేసుకుని పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మనోజ్, రోహిణి, బాలు ల జీవితాల్లో కొత్త మలుపులు ఏర్పడ్డాయి. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

Key Points

1

మనోజ్, రోహిణి కల్పనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు.

2

బాలు తన వాహనం కోల్పోవడంతో ఆందోళన చెందుతుంది.

4

కల్పన తన గతం గురించి రోహిణితో వాగ్వాదం చేస్తుంది.

పోలీస్ స్టేషన్ డ్రామా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 484వ ఎపిసోడ్ లో కల్పనను తీసుకొని మనోజ్, రోహిణి.. తన బండి కోసం మీనా పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. ఈ ఎపిసోడ్ మొత్తం ఆసక్తికర మలుపులతో సాగింది. చివరికి నెక్ట్స్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి పెంచేలా ముగించారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఆగస్టు 8) ఎపిసోడ్ కల్పనను బాలు ఏకంగా రోహిణి బ్యూటీ పార్లర్ కే తీసుకొచ్చే సీన్ తో మొదలువుతుంది. తనకు తెలిసిన మంచి పార్లర్ ఉందంటూ ఆమెను రోహిణి పని చేసే పార్లర్ కు తీసుకొచ్చి దిగబెడతాడు. లోపలికి వెళ్లిన కల్పన తనకు ఫేషియల్ చేయాలని రోహిణిని అడుగుతుంది.

ఆమెను చూడగానే రోహిణి షాక్ తింటుంది. గతంలో మనోజ్ తనకు చూపించిన ఫొటోలోని అమ్మాయి ఈమెనే అని తెలుసుకుంటుంది. ఆమె పేరు కూడా కనుక్కోవడంతో కన్ఫమ్ అవుతుంది. వెంటనే మనోజ్ కు ఫోన్ చేస్తుంది. నీకు డబ్బు ఇవ్వడానికి ఓ అమ్మాయి కెనడా నుంచి వచ్చిందని చెబుతుంది. ఎవరు అని అడిగితే కల్పన, నీ మాజీ లవర్ అని చెప్పడంతో అతడు షాక్ తింటాడు.

ఏంటి నా కల్పనా అని అంటాడు. వెంటనే వస్తాను చూసి చాలా రోజులైంది అని అనడంతో ఏంటి అంటూ కోపంగా అంటుంది రోహిణి. వెంటనే వచ్చేస్తానని అతడు ఫోన్ పెట్టేస్తాడు. అటు కల్పనతో మాట్లాడుతూ.. మీరు మా పార్లర్ వెతుక్కుంటూ వచ్చారు.. నన్ను, నా పార్లర్ ను లైఫ్ లాంగ్ మరచిపోకుండా చేస్తానని అంటుంది.

అటు మీనా బాలు కొనిచ్చిన బండిపై పూలు సప్లై చేస్తూ ఉంటుంది. అలా ఓ షాపుకు వెళ్లి పూలు ఇస్తుంది. అయితే ఆ సమయంలో ఆమె నో పార్కింగ్ అని రాసి ఉన్న బోర్డు దగ్గర బండి పెడుతుంది. ఆమె షాపుకు వెళ్లి బయటకు వచ్చే లోపే బండి కనిపించకుండా పోతుంది.

బాలు యొక్క బండి నష్టం

దీంతో ఆమె టెన్షన్ పడుతుంది. తన బండిని ఎవరు తీసుకెళ్లారో అంటూ ఆందోళన చెందుతుంది. అక్కడే కూర్చొన్న బిచ్చగాడు మీ బండిని ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లారని చెబుతాడు. అయ్యో దేవుడా ఆయన కొనిచ్చిన బండి.. ఏం కాకుండా చూడు అని అనుకుంటుంది.

అటు పార్లర్ లో కల్పన కు ఫేషియల్ చేస్తున్నట్లుగా నటిస్తూ ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేసేవారు అని రోహిణి అడుగుతుంది. ఇక్కడా బిజినెస్ చేసేదాన్నని అంటుంది. ఏం బిజినెస్.. ప్రేమించడం, మోసం చేయడం, డబ్బులతో పారిపోవడమా అని రోహిణి అనడంతో కల్పన షాక్ తింటుంది. ఏం మాట్లాడుతున్నారు..

ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు అని అంటుంది. అంతలోనే మనోజ్ అక్కడికి వస్తాడు. నీ వల్ల నేను దొంగనయ్యాను.. ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను.. కెనడా వెళ్లి బిజినెస్ చేద్దాం అన్నావు.. మా నాన్న రిటైర్మెంట్ డబ్బుతో ఉడాయించావు అంటూ ఆవేశంలో ఆమె గొంతు పట్టుకుంటాడు. దీంతో రోహిణి అడ్డుకుంటుంది.

నా మీద ప్రేమ తగ్గిపోయిందా అంటూ మరోపారి కల్పన డ్రామా మొదలుపెడుతుంది. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యమని మనోజ్ కు చెబుతుంది కల్పన. చేసే వచ్చానని, వాళ్లు వచ్చేస్తున్నారని అంటాడు. అయినా నీకు నన్ను అడిగే హక్కు ఎక్కడిదని రోహిణిని అడుగుతుంది కల్పన. అన్ని హక్కులు తనకే ఉన్నాయి.. ఎందుకంటే తను నా భార్య కాబట్టి అని మనోజ్ అంటాడు. దీంతో కల్పన షాక్ తింటుంది.

మర్యాదగా రూ.40 లక్షలు ఇవ్వమని ఇద్దరూ అడుగుతారు. అయినా నువ్వు నాతో 6 నెలలుగా ఉన్నావు కదా చెల్లుకు చెల్లు అని కల్పన అంటుంది. దీంతో ఏం ఆడదానివే నువ్వు.. అది కాపురం కాదు.. దానికి ఇంకో పేరు ఉంది అని రోహిణి అంటుంది. అయినా అన్నీ తెలిసి నీతో ఉందంటే ఇది నా కంటే పెద్ద ముదురులా ఉంది అని కల్పన అనడంతో ఆమె చెంప పగలగొడుతుంది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు.

కల్పన గుర్తింపు మరియు రోహిణి ప్రతిస్పందన

ఇక నాటకం చాలని ఎస్ఐ అంటాడు. అయినా తాను డబ్బు తీసుకున్నానని ఏం ఎవిడెన్స్ ఉందని అడుగుతుంది. పోలీస్ స్టేషన్ కు వస్తే చెబుతానని ఎస్ఐ అంటాడు. తనను కిడ్నాప్ చేశారని, పోలీసులు కూడా వాళ్లకు సహకరించారని సోషల్ మీడియాలో పెడతానని కల్పన బెదిరించినా.. పోలీసులు ఆమె బలవంతంగా లాక్కెళ్తారు.

అటు తన బండిని వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది మీనా. అక్కడ కానిస్టేబుల్ ను తన బండిని ఇవ్వాలని వేడుకున్నా ఆమె కరుణించదు. ఇంతలో అక్కడికి కల్పనను తీసుకొని వస్తారు పోలీసులు, వాళ్లతోపాటు రోహిణి, మనోజ్. బయట మీనా కానిస్టేబుల్ ను బతిమాలుతుండగా వాళ్లు లోనికి వెళ్తారు. అక్కడ కల్పన కుర్చీలో కూర్చోబోతుండగా నీలాంటి దొంగలు కూర్చునే ప్లేస్ కాదిది అని రోహిణి అడ్డుకుంటుంది.

నేనేమీ దొంగను కానని కల్పన అంటుంది. మనోజ్ కూడా మాటిమాటికీ అలా దొంగ అని అనకు అనడంతో రోహిణి షాక్ తింటుంది. తాను బాగా ప్రేమించానని, బాగా నమ్మానని అని ఎస్ఐతో చెబుతుండగా.. బాగా తన్ని వెళ్లిపోయిందిగా అని రోహిణి అంటుంది. తన దగ్గర ఉన్న ఆధారం పోలీసులకు చూపిస్తుండగా.. మనోజ్ ను పక్కకు లాక్కెళ్లి అతడే తనను నమ్మించి మోసం చేశాడని, తనన పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని రివర్స్ అవుతుంది.

నన్ను అలా అనకు కల్పన నీ కోసం రెంట్ తీసుకొని మరీ ఫ్లాట్ తీసుకున్నానని మనోజ్ అనడంతో రోహిణి షాక్ తింటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ ప్రోమోలో కల్పన తరఫున బాలు సాక్షి సంతకం పెట్టడం చూసి రోహిణి, మనోజ్ షాక్ తింటారు.

ఈ ఎపిసోడ్ లో చూపించిన సంఘటనలు అన్నీ కల్పన మరియు మనోజ్ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.