
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. రోహిణి డబ్బుపై బాలుకున్న అనుమానాలు, సంజూ యొక్క అహంకారం, మరియు మీనా యొక్క సహాయం ఈ ఎపిసోడ్ లో ప్రధాన ఆకర్షణలు.
Key Points
రోహిణి తండ్రి పంపిన 25 లక్షల రూపాయలపై బాలు సందేహాలు.
సంజూ తన భార్య మౌనికను పార్టీలో అవమానించాడు.
బాలు సంజూ అంతు చూస్తానని చెప్పాడు.
రోహిణి డబ్బుపై బాలు సందేహాలు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 487వ ఎపిసోడ్ లో రోహిణి, మనోజ్ లను బాలు గట్టిగానే ఇరికిస్తాడు. అటు సంజూ బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్ ముందే భార్య మౌనికను దారుణంగా అవమానిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ రోహిణి తన తండ్రి రూ.25 లక్షలు పంపించాడని చెప్పడంతో ప్రభావతి సంబరపడే సీన్ తోనే మొదలవుతంది. అయితే ఇప్పటికే మనోజ్ రూ.40 లక్షలు తీసుకొని నాన్నను మోసం చేశాడు కాబట్టి.. వచ్చిన ఈ రూ.25 లక్షల్లో తమకూ వాటా ఇవ్వాలని బాలు అంటాడు. కానీ ఆమె తండ్రి పంపిన డబ్బులో మనకెందుకు వాటా అని అటు రవి, ఇటు మీనా అంటారు. చివరికి సత్యం కూడా అదే చెప్పడంతో బాలు సరే అంటాడు.
ఈ రూ.25 లక్షలతో బిజినెస్ చేసి లాభాలు రాగానే ఎవరి వాటా వారికి ఇచ్చేస్తాం అని రోహిణి అంటుంది. మరో రూ.15 లక్షలు కూడా పంపిస్తానని చెప్పాడనీ చెబుతుంది. దీంతో బాలులో సందేహం మొదలవుతుంది. అంటే సరిగ్గా రూ.40 లక్షలు.. మనోజ్ నాన్న దగ్గర తీసుకొని మోసం చేసిన డబ్బు కూడా అంతే..
నిజంగానే ఈ డబ్బు మీ నాన్న పంపిస్తున్నాడా లేక ఆ డబ్బు తీసుకొని పారిపోయిన ఆ అమ్మాయి దొరికిందా అని అడగడంతో వీడికి నిజం తెలిసిపోయిందా అని మనోజ్, రోహిణి భయపడిపోతారు. అదేం కాదు.. మనోజ్ ను మీరు నానా మాటలు అనడంతో రూ.40 లక్షలు పంపించామన్నానని తాను తన తండ్రిని అడిగినట్లు చెప్పి రోహిణి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ప్రభావతి, సత్యంలకు బట్టలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు మనోజ్, రోహిణి.
సంజూ మరియు మౌనిక మధ్య వివాదం
అటు బాలు లో మాత్రం సందేహం అలాగే ఉండిపోతుంది. ఇంటి డాబా మీద మీనాతో బాలు మాట్లాడుతుంటాడు. అసలు ఆ డబ్బును వాళ్ల నాన్నే పంపించాడా? ఇప్పుడెందుకు పంపించాడు? అంటూ సందేహం వ్యక్తం చేస్తాడు. మీనా మాత్రం దానికోసం ఎందుకంతగా ఆలోచిస్తారు.. వాళ్ల మామయ్యే ఇచ్చాడని అంటోంది కదా.. అప్పుడు మరిచిపోయి ఇప్పుడు పంపించి ఉంటాడని మీనా అంటుంది. కానీ బాలులో మాత్రం అనుమానం అలాగే ఉండిపోతుంది. దాని వెనుక సీక్రెట్ ఏంటో తెలుసుకొని తీరతానని అతడు అంటాడు.
అటు సంజూ బర్త్‌డే కోసం అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తారు. భార్య మౌనికతో కలిసి సంజూ వెళ్తాడు. అక్కడ వాళ్ల ఫ్రెండ్స్ అందరూ చాలా మోడ్రన్ డ్రెస్సుల్లో వస్తే.. ఆమె మాత్రం చీరలో పద్దతిగా వెళ్తుంది. అసలు ఎవరీమె? ఇంతకు ముందు ఎప్పుడూ పార్టీలకు వెళ్లలేదా అని సంజూ ఫ్రెండ్స్ అడుగుతారు. నా తలరాత.. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని సంజూ అంటాడు.
ఆ తర్వాత కేక్ కట్ చేసి సంజూ తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటుంటే మౌనిక పక్కన నిలబడుతుంది. వాళ్లంతా మందు తాగుతుండగా సంజూ ఫ్రెండ్ ఒకడు మౌనికను కూడా తాగాలని బలవంతం చేస్తాడు. అది చూసి సంజూ కూడా తాగాలని మౌనికపై ఒత్తిడి తెస్తాడు. అంతలో మరో ఫ్రెండ్ వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్తాడు.
ఇటు రోహిణి, మనోజ్ లపై ప్రభావతి ప్రేమ ఒలకపోస్తుంది. అందరూ కూర్చొని తింటుంటే.. వాళ్లు రాలేదేంటని అడుగుతుంది. ఎంతో ప్రేమగా రోహిణి, మనోజ్ లను పిలుస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఇద్దరికి మాత్రమే రెండేసి గుడ్లు పెట్టి తినండని అని అంటుంది.
బాలు సంజూపై ప్రతీకారం
దీంతో బాలు, మీనా, రవి, శృతి అందరూ కలిసి వాళ్లపై అంత ప్రేమ ఎందుకో అని అనుకుంటారు. అయినా దీక్షలో ఉన్న వాళ్లు గుడ్లు తినొద్దంటూ వాళ్ల ప్లేట్లలో ఉన్న గుడ్లను తీసి అందరూ ఇస్తాడు బాలు.
దీంతో మనోజ్ ఆవేశపడిపోతాడు. ఆ మిగిలిన రూ.15 లక్షలు కూడా నా అకౌంట్లో పడిన తర్వాత మీ సంగతి చూస్తానని అంటాడు. అదే విషయాన్ని బాలు పట్టుకుంటాడు. అసలు రోహిణి వాళ్ల నాన్న నీ అకౌంట్ కు ఎందుకు పంపిస్తాడు? మీనా వాళ్ల ఇంట్లో వాళ్లు ఆమెకే ఇస్తారు.. శృతికి వాళ్ల అమ్మ డబ్బు ఆమెకే ఇస్తుంది.. రోహిణి తండ్రి మాత్రం మనోజ్ కు ఎందుకు పంపించాడని అడగడంతో దొరికిపోయానా అని మనోజ్ టెన్షన్ పడతాడు.
దీంతో రోహిణి మరోసారి కవర్ చేస్తుంది. తానే రూ.40 లక్షలు తన తండ్రిని అడిగానని చెప్పాను కదా.. మళ్లీ ఎందుకిలా చేస్తున్నారని అడుగుతుంది. అటు మీనా కూడా గట్టిగానే మాట్లాడుతుంది. దీంతో అందరూ సైలెంట్ గా తినండి అంటూ సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ ప్రోమోలో మౌనిక చేయిని సంజూ ఫ్రెండ్ పట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తే అతని చెంప పగులగొడుతుంది. దీంతో సంజూ కూడా ఆమెపై చేయి చేసుకుంటాడు. బాధలో ఆమె రోడ్డుపై నడుస్తుండగా యాక్సిడెంట్ జరిగేలా అనిపిస్తుంది. ఇంతలో మీనా ఆమెను కాపాడుతుంది. జరిగిన విషయం తెలుసుకొని బాలుకి ఫోన్ చేస్తాను.. సంజూ అంతు చూస్తాడని చెబుతుంది.
రోహిణి మరియు మనోజ్ చేసిన మోసాన్ని బాలు కనుగొంటాడా? సంజూ యొక్క అహంకారానికి మౌనిక ఎలాంటి ప్రతిస్పందన ఇస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూద్దాం.


