|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: తలకాయ ఎక్కడ పెట్టుకుంటావంటూ ప్రభావతికి మీనా క్లాస్.. రోహిణి గతం తవ్వుతున్న బాలు

Published: 22-09-2025, 11:14 PM
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: తలకాయ ఎక్కడ పెట్టుకుంటావంటూ ప్రభావతికి మీనా క్లాస్.. రోహిణి గతం తవ్వుతున్న బాలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ 516వ ఎపిసోడ్ లో, మీనా, ప్రభావతిల మధ్య వాదనలు, బాలు కథలతో మనోజ్ ను ఏడిపించడం, రోహిణి గతంపై బాలు దర్యాప్తు చేయడం వంటి సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.

Key Points

1

మీనా, ప్రభావతిల మధ్య వంట విషయంలో మరోసారి వాదన.

2

బాలు కథలతో మనోజ్‌ను ఏడిపించే సన్నివేశం.

4

ప్రభావతికి మీనా క్లాస్ పీకడం.

మీనా, ప్రభావతి మధ్య వాదన

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 516వ ఎపిసోడ్ కాస్త సరదాగా, మరికాస్త సీరియస్ గా సాగిపోయింది. రూమ్, వంట విషయంలో మీనా, ప్రభావతి మధ్య మరోసారి వాదన.. అటు కొడుకు కోసం హాస్పిటల్ కు వెళ్లిపోయి బాలుకు అడ్డంగా దొరికిపోయిన రోహిణి సీన్లు ఆసక్తి రేపుతాయి.

కథలతో మనోజ్‌ను ఏడిపించిన బాలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ మనోజ్ ను బాలు కథలతో ఏడిపించే సీన్ తో మొదలవుతుంది. మనోజ్, బాలు, సత్యం ఒకే గదిలో పడుకుంటారు. కింద పడుకున్న బాలు.. మనోజ్ కు నిద్ర లేకుండా చేయాలని అనుకుంటాడు.

చిన్న కథ చెబుతానంటూ మొదలు పెట్టి వరుసగా కథలు చెబుతూ అతనికి నిద్ర లేకుండా చేస్తాడు. పేదరాసి పెద్దమ్మ, రూ.40 లక్షల గారె, ఓ కాకి అంటూ అతనిపైనే సెటైర్ వేసేలా కథ చెప్పడంతో మనోజ్ ఫీలవుతాడు.

హాల్లోకే చేరిన మనోజ్, రోహిణి

బాలు యొక్క కథలు మరియు మనోజ్

అటు ప్రభావతి, మీనా , రోహిణి ఒకే గదిలో పడుకుంటారు. ఆ పూలమ్మకునేది నా పక్కన ఎక్కడ పడుకుంటుందో అని భయపడ్డానని, దానికి నేలపైన పడుకోవడం అలవాటే కదా అని రోహిణితో మీనా గురించి ఏవేవో మాట్లాడుతుంది ప్రభావతి. దీంతో మీనా లేచి కూర్చొంటుంది. ఏమైందని రోహిణి అడుగుతుంది. దోమ.. ఇందాకటి నుంచి చెవి దగ్గర గుయ్ మంటూ తిరుగుతూనే ఉందని, నిద్ర పట్టడం లేదని పరోక్షంగా అత్త ప్రభావతి గురించి చెబుతుంది.

కాసేపాగితే దోమల గుంపే వస్తుంది జాగ్రత్త అంటూ రోహిణిని హెచ్చరించి పడుకుంటుంది. కాసేపటికే దానికి అర్థం ఏంటో రోహిణికి తెలుస్తుంది. ప్రభావతి గురక పెట్టడంతోపాటు తనను లేపబోయిన రోహిణిని ఓసారి చేత్తో కొట్టి, మరోసారి కాలితో తంతుంది. దీంతో చేసేది లేక రోహిణి గదిలో నుంచి హాల్లోకి వెళ్తుంది. అప్పటికే అక్కడ మనోజ్ ఉండటంతో ఏమైందని అడుగుతుంది. ఆ బాలుగాడు కథలతో చంపేస్తున్నాడని చెబుతాడు. ఇద్దరం మళ్లీ హాల్లోకి రావాల్సి వచ్చిందని బాధపడతారు.

అత్తకు క్లాస్ పీకిన మీనా.. వంట లేక..

ఉదయాన్నే మీనా లేవకపోవడంతో వంట సమయానికి కాదు. దీంతో ప్రభావతి మరోసారి రచ్చ చేస్తుంది. గది ఇవ్వకపోవడం వల్లే కావాలని ఇలా చేశావు కదూ.. ఒక్క రోజు గది లేకపోతే ఏమవుతుంది అని మీనాను నిలదీస్తుంది. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావంటూ ప్రభావతికి మీనా క్లాస్ పీకుతుంది. ఒంట్లో బాలేదని చెప్పాను.. అందుకే లేవడం ఆలస్యమైందని అంటుంది. అప్పుడే సత్యం కూడా వచ్చి ప్రభావతిని తిడతాడు.

రోహిణి గతంపై దర్యాప్తు

టిఫిన్ ఏమైందంటూ మనోజ్ వచ్చి అడుగుతాడు. మీనా వంట చేయలేదనడంతో బాలు వచ్చి ఆమె కోసం జావా కాస్తున్నానని చెబుతాడు. అందరు మాట్లాడే మాటలు వింటున్నానని అంటాడు. తర్వాత రవి, శృతి కూడా విషయం తెలుసుకొని మీనాను రెస్ట్ తీసుకోమని చెప్పి తాము రెస్టారెంట్లో తింటామని వెళ్లిపోతారు. మనోజ్, రోహిణి కూడా బయట తింటామని వెళ్లిపోవడంతో ఆ పూటకు ప్రభావతికి బాలు కాసిన జావా మాత్రమే మిగులుతుంది.

హాస్పిటల్‌కు బాలు, మీనా.. చింటూకి యాక్సిడెంట్

ఆ తర్వాత మీనాను బాలు హాస్పిటల్ కు తీసుకెళ్తాడు. అక్కడి డాక్టర్ ఆమెను చూసి మామూలు జర్వమే.. రెండు, మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెబుతుంది. తర్వాత ఇద్దరూ బయటకు వస్తుండగా.. చింటూని తీసుకొని రోహిణి వాళ్లమ్మ అక్కడికి వస్తుంది. అతనికి యాక్సిడెంట్ అయిందని చెబుతుంది. లోనికి తీసుకెళ్లిన తర్వాత అతనికి సర్జరీ చేయాలని డాక్టర్ చెబుతాడు. అది పూర్తయ్యే వరకు తాము అక్కడే ఉంటామని బాలు, మీనా చెబుతారు.

దీంతో రోహిణికి ఈ విషయం ఎలా చెప్పాలో అని వాళ్ల అమ్మ కంగారు పడుతుంది. బయటకు వచ్చి రోహిణికి ఫోన్ చేసి చింటూ యాక్సిడెంట్ గురించి చెబుతుంది. బాలు, మీనా ఇక్కడే ఉన్నారని, వాళ్లు వెళ్లిన తర్వాత రమ్మని అంటుంది. రోహిణి హాస్పిటల్ కు వెళ్లగానే అక్కడే ఉన్న బాలు, మీనా ఆమెను చూసి షాక్ తింటారు. ఎవరో తెలియకుండానే ఇంత కంగారు పడుతున్నావేంటని అడుగుతాడు. చింటూకి, రోహిణికి ఏదో సంబంధం ఉంది.. అదేంటో మనం కనిపెట్టాలని మీనాతో అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లోని ఈరోజు ఎపిసోడ్ కథానాయికల మధ్య ఘర్షణలు, బాలు యొక్క కథలు మరియు రోహిణి గతంపై ఆసక్తికరమైన సన్నివేశాలతో ముగిసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.