
📌 Key Points
- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో మీనా విశ్వరూపం: మనోజ్‌ను చితక్కొట్టిన మీనా!
- బెల్టుతో విరుచుకుపడ్డ మీనా.. భయంతో టేబుల్ కింద దాక్కున్న ప్రభావతి.
- అత్త ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంటికి వచ్చిన బంధువులు షాక్!
- శృతి పుట్టింటికి.. రవికి ఫోన్ చేసిన ప్రభావతి.. విడగొట్టే ప్రయత్నం!
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మీనా తనలోని మరో కోణాన్ని చూపించింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. మీనా నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మీనా ఉగ్రరూపం: మనోజ్‌కి చుక్కలు!
Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ లో మీనా ఉగ్రరూపం చూపించింది. మనోజ్ ను బెల్టు తీసుకొని ఎడాపెడా బాదేస్తుంది. దీంతో ప్రభావతి భయంతో టేబుల్ కింద దాక్కొంటుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ప్రభావతి, మనోజ్ తిక్క కుదుర్చుతుంది మీనా. తన ఇంటికి వచ్చిన తన బంధువులను కనీసం తినకుండా వెళ్లిపోయేలా చేసిన అత్తకు మీనా గట్టిగానే సమాధానం ఇస్తుంది. నోటికొచ్చినట్లు మాట్లాడిన మనోజ్ ను ఎడాపెడా బాదుతుంది.
పుట్టింటికి వెళ్లిపోయిన శృతి..
తర్వాత ప్రభావతి కూడా వచ్చి ఏం జరిగిందని అడగడంతో తన ఇంటికి వెళ్లిపోతున్నానని చెబుతుంది. మీనా, ప్రభావతి ఎంత చెప్పినా వినదు. కోపంతో వెళ్లిపోతుంది. బయట ఉన్న బాలు పిలుస్తున్నా కూడా వినదు.
రవికి ప్రభావతి ఫోన్.. రెచ్చగొట్టేలా మాట్లాడి..
ప్రభావతి కుట్రలు.. రవికి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే?
అవసరం లేదు.. మొగుడు అన్నాక కాస్త బెట్టు చేయాలి.. నువ్వు అక్కడికి వెళ్లకు.. నేరుగా ఇంటికి వచ్చెయ్.. నీ పెళ్లాం పద్ధతి అస్సలు బాలేదు అని చెబుతుంది. అది విని బాలు, మీనా కూడా షాక్ తింటారు. ఎవరైనా కలపాలని చూస్తారు కానీ ఇలా విడగొట్టడానికి ప్రయత్నిస్తుందేంటని అనుకుంటారు.
ఆ వెంటనే మీనా కూడా రవికి ఫోన్ చేస్తుంది. అత్తయ్య చెప్పింది తాను విన్నానని, ఆమె చెప్పింది వినొద్దని, వెంటనే వెళ్లి శృతికి నచ్చజెప్పి తీసుకురావాలని అని అంటుంది. మీనా మాటలు విన్న తర్వాత రవి కాస్త కుదుటపడి అలాగే చేస్తానని అంటాడు.
ఇంటికి మీనా బంధువులు.. పెళ్లికి ఆహ్వానం
ప్రభావతి రచ్చ.. అత్తకు మీనా క్లాస్
శృతిని వెనక్కి తీసుకురావాలని మీనా ప్లాన్!
నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. అదంతా వాళ్లు వింటారు. తినడం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతారు. అది చూసి అత్తకు మీనా క్లాస్ పీకుతుంది. అతిథులను దేవుళ్లు అంటారు.. అలాంటి వారిని కనీసం తినకుండా వెళ్లిపోయేలా చేశారంటూ ప్రభావతిని తిడుతుంది. సగంలో వదిలేసిన ప్లేట్లను కూడా తీయకుండా వెళ్లిపోతుంది.
అత్తకు ఎదురు తిరగమని మీనాకు చెప్పిన ఫ్రెండ్స్
మనోజ్‌ను ఎడాపెడా బాదేసిన మీనా
మీనా సైలెంట్ గా వెళ్లిపోతుంది. పైకి వెళ్లి చేతిలో బెల్టు తీసుకొని వస్తుంది. తమ్ముడి భార్యతో ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ మనోజ్ ను బెల్టుతో ఎడాపెడా బాదుతుంది. అతడు బాధతో విలవిలలాడిపోతున్నా మీనా కొడుతూనే ఉంటుంది. భయంతో ప్రభావతి వెళ్లి టేబుల్ కింద దాక్కొంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకి మలుపులు తిరుగుతోంది. మీనా పగ ఎలా తీర్చుకుంటుందో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


