
📌 Key Points
- షాకింగ్: షష్టిపూర్తి వేడుకలో తల్లిదండ్రులకు అన్నం పెట్టని రాజేష్!
- జైలు నుంచి వచ్చిన దినేష్, చింటుతో సెల్ఫీ దిగి రోహిణికి షాక్!
- బయటపడిన రాజేష్ నిజ స్వరూపం: లక్ష రూపాయల కోసం ఇంత దిగజారాలా?
- మందు, బిర్యానీతో రాజేష్ హంగామా.. షాక్‌లో బాలు, మీనా!
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఊహించని ట్విస్ట్! రాజేష్ అసలు రూపం బయటపడటంతో కథనం ఆసక్తికరంగా మారింది. దినేష్ జైలు నుంచి తిరిగి రావడంతో ఏం జరుగుతుందో చూడాలి.
రాజేష్ నిజ స్వరూపం బయటపడింది!
గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 12 ఎపిసోడ్‌లో షష్టిపూర్తి నాడు రాజేష్ తన తల్లిదండ్రులకు అన్నం కూడా పెట్టలేదని బాలుకు తెలుస్తుంది. పూలుగు బొక్క కోసం పెద్ద గొడవతోపాటు బాలుకు అవమానం జరుగుతుంది. జైలు నుంచి వచ్చిన దినేష్ చింటుతో సెల్ఫీ తీసుకుని రోహిణికి పంపిస్తాడు. రోహిణి వణికిపోతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో షష్టిపూర్తి దంపతులను ఇలా మూలకు పెట్టేశారేంటీ అని బాలు అంటాడు. అది మీ ఫ్రెండ్‌నే అడగండి అని రాజేష్ భార్య అంటుంది. ముందు బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుందామని మీనా అనడంతో బట్టలు పెడతారు. బయట కూర్చోబెడదాం రండని బాలు అంటాడు.
అక్కడ ఫ్రెండ్స్ అందరికి మందు, బిర్యానీతో పార్టీ ఇచ్చి ఫుల్‌గా తాగి తందనాలు ఆడుతాడు రాజేష్ . అదంతా చూసిన బాలు, మీనా షాక్ అవుతారు. అన్నయ్య మీరు ఇచ్చిన లక్ష రూపాయలు ఇలా పొద్దున్నుంచి ఏరులై పారుతోంది అని రాజేష్ భార్య అంటుంది. అమ్మనాన్నలకు అన్నం పెట్టకుండా ఏంటీ దరిద్రం. ముందు రెండు ప్లేట్లలో భోజనం తీసుకురండి అని మీనా అంటుంది.
జైలు నుంచి వచ్చిన దినేష్ సంచలనం
దాంతో బాలు తీసుకొస్తాడు. మీనా తీసుకెళ్లి రాజేష్ తల్లిదండ్రులకు భోజనం పెడుతుంది. బాలును తీసుకెళ్తాడు రాజేష్. బాలును తాగమని రాజేష్ ఫోర్స్ చేస్తే తాగనంటాడు బాలు. ఇందుకే కదా నీ దగ్గర లక్ష తీసుకుంది. ఇదేరా నా బలగం, నేను ఎంత మందు పోయించాను, ఎంత మటన్ పెట్టించానని అంతా గుర్తు చేసుకోవాలి అని రాజేష్ అంటాడు.
రాజేష్ కంగారు పడతాడు. నేను చూసుకుంటాను అని వాళ్లందరికి వడ్డిస్తానని బాలు తీసుకెళ్తాడు. బాలు వడ్డించినా పూలుగు బొక్కలు ఏవి. నీ బాబుగాడి సొమ్ము వడ్డిస్తున్నావా అని అంటాడు. బాలు ఆపిన రాజేష్ మీదకు వెళ్తాడు. దాంతో అంతా కొట్టుకుంటూ రచ్చ రచ్చ చేస్తారు. మధ్యలో బాలు నలిగిపోతాడు. దాంతో అందరిని తోసేసి బాలును తీసుకొస్తుంది మీనా.
మీరిచ్చిన లక్ష ఎంత బాగా ఉపయోగపడుతుందో చూశారా అని అంటుంది మీనా. పాప స్కూల్ ఫీజ్ కట్టాలంటే పెళ్లి చేసుకుని వెళ్లిపోయేదానికి ఖర్చు అవసరమా అన్నాడను అని రాజేష్ నిజ స్వరూపం ఏంటో చెబుతుంది భార్య. మా అత్త మామలకు ఒరిగింది ఏం లేదు. ఇతన్నీ నమ్మి లక్ష ఎలా ఇచ్చారని అని రాజేష్ భార్య అంటుంది. వెళ్దామని బాలు, మీనా వెళ్లిపోతారు.
చింటుతో సెల్ఫీ.. రోహిణికి షాక్!
మరోవైపు చింటు దగ్గరికి దినేష్ వస్తాడు. క్రికెట్ ఆడుతుంటే బాగా ఆడుతున్నావని మచ్చిక చేసుకుంటాడు. నువ్వు చాలా పెద్ద క్రికెటర్ అవుతావు. అందుకు ముందే సెల్ఫీ తీసుకుంటాను అని దినేష్ సెల్ఫీ తీసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు మనోజ్ బాడీగార్డ్ 20 ఎగ్స్ క్షణాల్లో తింటాడు. అదంతా చూసిన మనోజ్ నేనే ఇప్పటివరకు తినలేదని బాడీగార్డ్ తినేదంతా లెక్కలు వేస్తాడు.
నాకు వచ్చిన సమస్యల నుంచి కాపాడుతాడని వాడిని పెట్టుకుంటే వాడే పెద్ద సమస్య అయ్యేలా ఉన్నాడని మనోజ్ అంటాడు. నేను కూడా వీడిలాగే తింటే నాకు ఇలాగే బాడీ వస్తుందా అని మనోజ్ అంటాడు. నువ్వు కూడా బాడీగార్డ్‌లా వెళ్తావా. ముందు పని చూడు అని రోహిణి అంటుంది. ఇంతలో చింటుతో దినేష్ దిగిన సెల్ఫీ పంపిస్తాడు. అది చూసి రోహిణి వణికిపోయి కాల్ చేస్తుంది.
మరోవైపు రాత్రి బాలు మందు తాగేందుకు బాటిల్ ఓపెన్ చేస్తాడు. ఇంతలో బాలు అంతరాత్మ వచ్చి బాలుపై తిట్లదండకం మొదలుపెడతాడు. లక్ష గోవిందా అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. రాజేష్, దినేష్ ల ప్లాన్స్ ఏమిటో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


