|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: తల్లికి శ్రుతి షాక్! మీనాకు ప్రేమ్ పంగనామం! దుమ్మురేపే ట్విస్ట్!

Published: 20-02-2026, 12:35 AM
గుండె నిండా గుడి గంటలు: తల్లికి శ్రుతి షాక్! మీనాకు ప్రేమ్ పంగనామం! దుమ్మురేపే ట్విస్ట్!
  • రవిని మార్చేస్తారని శ్రుతికి తల్లి శోభన హెచ్చరిక!
  • డాడీ ఫ్రెండ్‌తో నువ్వు షాపింగ్‌కు వెళ్ళలేదా అని శ్రుతి ప్రశ్నించడంతో షాక్ అయిన శోభన!
  • ప్రభావతి ముందు మీనాను ప్రియురాలితో ఇరికించిన ప్రేమ్, అత్త ఆగ్రహం!
  • బొమ్మల కొలువుకు ప్రభావతి ఒప్పుకోవడంతో సంతోషంగా కుటుంబ సభ్యులు!

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అభిమానులకు ఇది ఒక షాకింగ్ న్యూస్! శ్రుతి తన తల్లిని నిలదీయడం, ప్రేమ్ మీనాను ఇరికించడం వంటి అనేక ట్విస్టులతో ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

తల్లిని నిలదీసిన శ్రుతి: షాకింగ్ సీన్!

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 20 ఎపిసోడ్‌లో రవితో నీతూను చూశానని, అలాంటి వాళ్లు రవిని మార్చేస్తారని శ్రుతితో తల్లి శోభన చెబుతుంది. నువ్వు కూడా డాడీ ఫ్రెండ్‌తో షాపింగ్‌కు వెళ్లావుగా అని షాక్ ఇస్తుంది శ్రుతి. ప్రభావతి ముందు మీనాను ప్రియురాలితో ఇరికిస్తాడు ప్రేమ్. దాంతో మీనాను అత్త తిడుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో డబ్బింగ్ స్టూడియోలో శ్రుతి డబ్బింగ్ చెబుతుంది. తనతోపాటు మరొకరు చెబుతారు. ఇద్దరు భర్త, కాపురం, మరో అమ్మాయితో తిరగడం గురించి డబ్బింగ్ ఉంటుంది. ఇంతలో శోభన వస్తుంది. శ్రుతి వెళ్లి మాట్లాడుతుంది.

రవి అలా కాదు. నువ్వు కూడా డాడీ ఫ్రెండ్‌ ఒకాయనతో షాపింగ్‌కు వెళ్లావు కదా దాని గురించి నేను ఎప్పుడైనా ఏమైనా మాట్లాడానా అని రివర్స్‌లో తల్లినే అంటుంది శ్రుతి. దానికి షాక్ అయిన శోభన అతను మన ఫ్యామిలీ ఫ్రెండ్. పైగా నాకంటే చిన్నవాడు అని అంటుంది. తప్పు చేయడానికి వయసుతో సంబంధం లేదు. చేయాలనుంటే చాలు. నేను నిన్ను తప్పు పట్టట్లేదు అని శ్రుతి అంటుంది.

అల్లుడును కంట్రోల్‌లో పెట్టకు. ఆ అమ్మాయి కొత్త బ్రాంచ్‌లు పెడుతుందట. అల్లుడు కొత్త బ్రాంచ్ పెట్టకుండా చూసుకో అని హెచ్చరిస్తుంది శోభన . ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మోసుకెస్తే స్టూడియోలకు రానివ్వొద్దని చెబుతానని వెళ్లిపోతుంది శ్రుతి. మరోవైపు మీనాను వెనుక నుంచి బాలు పట్టుకుంటాడు. వెంటనే బాలును కత్తితో పొడవబోతుంది మీనా.

మీనాకు ప్రేమ్ కుట్ర: అత్త ముందు ఇరికించాడు!

మీనా బొమ్మల కొలువు పెట్టాలనుకుంటుందని, నాన్న నువ్వే ఒప్పించాలని చెబుతాడు బాలు. ఇంతలో అంతా వస్తారు. ప్రభావతితో మీనా బొమ్మల కొలువు గురించి సత్యం చెబుతాడు. ఇంటికి వారసులు వస్తారని సత్యం అంటాడు. అయితే, రోహిణితో ముందు పెట్టిద్దామని ప్రభావతి అంటుంది. ఎవరైనా వారసులేగా అని సత్యం అంటాడు.

పాటలు పాడాలి రోజు అని ప్రభావతి అంటుంది. నువ్వు బాగా పాడుతావుగా పబ్బి, పెళ్లి చూపుల రోజు నాడు పాడావుగా మెచ్చుకుంటాడు సత్యం. దాంతో పొంగిపోయిన ప్రభావతి బొమ్మల కొలువు పెట్టేందుకు ఒప్పుకుంటుంది. తర్వాత అమ్మ వీక్ పాయింట్ పట్టుకుని భలే లాగావు నాన్న అని బాలు అంటాడు. బొమ్మల కొలువు రోజు మీరు ఎవరిని ఏమనొద్దు అని మీనా అంటుంది.

మరోవైపు కామాక్షితో బొమ్మల కొలువు గురించి చెప్పి ఏదైనా స్థలం ఉంటే చెప్పు అని అడుగుతుంది ప్రభావతి . సరేనని కామాక్షి చెబుతుంది. మరోవైపు తన లవర్‌పై చేతులు వేసి రొమాంటిక్‌గా ప్రేమ్ ఉంటాడు. అది మీనా చూసి ఇద్దరిని తిడుతుంది. పవిత్రమైన డ్యాన్స్ స్కూల్‌లో ఏంటిది అని మీనా వార్నింగ్ ఇస్తుంది.

బొమ్మల కొలువుకు గ్రీన్ సిగ్నల్: కుటుంబంలో సందడి!

దాంతో ప్రేమ్ రివర్స్ ప్లాన్ వేస్తాడు. లవర్ ఏడుస్తూ వెళ్లి మీనా అనవసరంగా తిట్టిందని ప్రభాతికి చెబుతుంది. మీనా ఊరికే తిట్టదని కామాక్షి అంటుంది. వీళ్లు చనువుగా ఉన్నారని మీనా అంటుంది. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే తిట్టిందని అమ్మాయి చెబుతుంది. దాంతో మీనాను తిడుతుంది. దానికి ఏదో ఒకరోజు ఇది మీ మెడకే చుట్టుకుంటుంది జాగ్రత్త అని వెళ్లిపోతుంది మీనా.

నా దగ్గర రెండు ఉన్నాయి. ఒక్కటి కొనిస్తే చాలని రోహిణి అంటుంది. క్రెడిట్ కార్డ్‌తో పెట్టుకో అని మనోజ్ చెబుతాడు. మరోవైపు ఇది ఇంట్లో అందరికోసం చేస్తున్నది కాబట్టి అంతా డబ్బులు ఇవ్వాల్సిందే అని బాలు అంటాడు. మనోజ్ దగ్గరికి వెళ్లి ఐదు వేలు ఇవ్వమంటాడు బాలు. సరేనని రోహిణి డబ్బు ఇస్తానంటుంది. మరోవైపు రవి హిందీ పాటలు వింటుంటాడు.

అది శ్రుతి అడుగుతుంది. కారులో ఈ పాట విన్నాను. నచ్చింది మళ్లీ వింటున్నానని రవి చెబుతాడు. ఇద్దరు రవి, శ్రుతి వాదులాడుకుంటుంటే మీనా, బాలు వస్తారు. మేము చాలా బొమ్మలు కొన్నామని బాలు చెబితే.. రవి, శ్రుతి మీకు పిల్లలు పుట్టబోతున్నందుకు కంగ్రాట్స్ చెబుతారు. అది కాదని బొమ్మల కొలువు గురించి చెబుతారు బాలు, మీనా .

గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రాబోయే ఎపిసోడ్‌లలో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.