
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో ఉత్కంఠభరితమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. పూలగంప స్కూటీ స్వాధీనం, బాలు యొక్క ప్రతీకారం, మీనా టిఫిన్ బండి విజయం వంటివి ప్రధాన ఆకర్షణలు.
Key Points
పూలగంప స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
బాలు పూరిలతో ప్రభావతిపై ప్రతీకారం తీసుకుంటాడు
మౌనిక సంజుకు సర్‌ప్రైజ్ పార్టీ ఇస్తుంది
పోలీసులతో పూలగంప స్కూటీ
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాను వద్దని రోహిణితో ముగ్గు వేయించాలని ప్రభావతి చూస్తుంది. నాకు ముగ్గు వేయడం రాదని రోహిణి అంటుంది. దీక్షలో ఉన్నప్పుడు ఇలా చేయాల్సిందే అని ప్రభావతి అంటుంది. ఏదోటి వేసేయమ్మా. మీ అత్తయ్య వదిలేలా లేదని సత్యం అంటాడు. మనోజ్ కూడా మీ నాన్న కోసమేగా అని మనోజ్ అంటాడు.
బాలు సెటైర్లు వేస్తాడు. మీనాను మనోజ్ హెల్ప్ చేయమంటాడు. నేను వేసే పిచ్చిగీతలు ఎందుకు, అత్తయ్య రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలిచారుగా అని కౌంటర్స్ వేస్తుంది. ఏంటే ఎగతాళిగా ఉందా అని ప్రభావతి కోప్పడుతుంది. తర్వాత రోహిణి ఏదోలా ముగ్గు వేస్తే బాలు కౌంటర్స్ వేస్తూ వెళ్లిపోతాడు. తర్వాత మీనా చేసిన టిఫిన్‌ను రవి, శ్రుతి మెచ్చుకుంటారు.
రవి కంటే నువ్వే బెటర్. హోటల్ పెడితే బాగా ఫేమస్ అవుతావ్ అని శ్రుతి అంటుంది. అలాంటి ఐడియాలు ఇవ్వకమ్మా. బాలు గాడు వింటే మళ్లీ ఇంటి ముందు టిఫిన్ బండి పెడతాడు అని ప్రభావతి అంటుంది. గుడి ముందు అడుక్కోవడం కంటే ఇది బెటరే కదా అని మీనా సెటైర్లు వేస్తుంది. సత్యం వచ్చి కూడా మీనా వంటను మెచ్చుకుంటాడు. బాలుకు మీనా పూరీలు వేస్తే ఒక్కటి చాలు అని పూరీలు తీస్తుంది ప్రభావతి.
బాలు యొక్క పూరి ప్రతీకారం
ఇంకా తినేవాళ్లు ఉన్నారు అని మనోజ్, రోహిణిల గురించి చెబుతుంది ప్రభావతి. వాళ్లకోసం నా పూరీలు తీస్తావా చెబుతాను అని బాలు మనసులో అనుకుంటాడు. మనోజ్ , రోహిణి వచ్చి వడ్డించుకుంటారు. కానీ, బాలు ఆగమంటాడు. అపచారం జరుగుతుంది ఇక్కడ. మలేషియా మావయ్య గారు రావాలని దీక్ష చేయిస్తుంటే ఉప్పు కారంతో చేసిన వంట తినకూడదుగా అని ఫిటింగ్ పెడతాడు బాలు.
దాంతో ప్రభావతి అవునుగా, స్వయంపాకం చేసుకోవాలిగా అని అంటుంది. వండే ఓపిక లేదు. మంచినీళ్లు తాగుతాను అని రోహిణి అంటుంది. పూరీలు వేస్ట్ అయిపోతాయే అని బాలు తీసుకుంటాడు. మనోజ్ తింటుంటే ఏదోటి చెప్పి మనోజ్ కూడా తినకుండా చేస్తాడు బాలు. ప్రభావతి అన్నందుకు ఇలా బాలు పూరీలతో రివేంజ్ తీర్చుకుంటాడు.
ఇంతలో బాలుకు కల్పన కాల్ చేసి రమ్మంటుంది. అలాగే ఫారెనమ్మా అని చెబుతాడు బాలు. మరోవైపు సంజు వస్తే ఫ్లవర్ షాట్ కొట్టి హ్యాపీ బర్త్ డే చెప్పి సర్‌ప్రైజ్ ఇస్తుంది మౌనిక. సంజు కోప్పడుతున్న పట్టించుకోకుండా చేయి పట్టుకుని తీసుకెళ్లి హారతి ఇస్తుంది. మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని పూజ చేశానని బొట్టు పెడుతుంది. ఎంత క్యూట్‌గా ఉన్నారో అని మురిసిపోతుంది మౌనిక.
మీనా టిఫిన్ బండి విజయం
శ్రీవారు అని రాసి ఉన్న కేక్ కట్ చేయమంటుంది మౌనిక. ఇది ఏం చేసిన నా మీద ప్రేమ చూపిస్తూనే ఉంది. ఏదోటి చేయాలి అని సంజు అనుకుంటాడు. సంజు కేక్ కట్ చేస్తాడు. ఇద్దరు కేక్ తినిపించుకుంటారు. ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని మౌనిక అంటుంది. బయట ఫ్రెండ్స్‌కు పార్టీ ఇస్తున్నా. నువ్వు కూడా రా రెడీగా ఉండు అని సంజు చెబుతాడు. దాంతో తెగ సంబరపడిపోతుంది మౌనిక.
రోహిణి వెళ్లిన ట్రావెల్ ఏజెన్సీకే కల్పన వెళ్తుంది. రిటర్న్ టికెట్ కోసం వచ్చానని బాలుకు చెబుతుంది. ఏజెన్సీలో మీ గురించి ఇద్దరు వచ్చి అడిగారు. హస్బండ్ అండ్ వైఫ్ వచ్చారు. అతని పేరు మనోజ్ అన్నారు అని రిసెప్షనిస్ట్ చెబుతుంది. హో పెళ్లి అయిపోయిందా అనుకున్న కల్పన వాళ్లు నాకు తెలియదు. నా గురించి ఏం చెప్పకండి అని కల్పన అంటుంది. సరే అని రిసెప్షనిస్ట్ అంటుంది.
ఏంటీ మేడమ్ టికెట్ దొరికిందా అని బాలు అంటే అవును అని కల్పన అంటుంది. సో కెనడా వెళ్లిపోతున్నారన్నమాట. మంచి కస్టమర్ వెళ్లిపోతున్నారు అని బాలు అంటాడు. మరోవైపు నో పార్కింగ్ బోర్డ్ దగ్గర మీనా బండి పెడుతుంది. దాంతో ట్రాఫిక్ పోలీసులు మీనా స్కూటీ అయిన పూలగంపను తీసుకెళ్లిపోతారు. ఆ విషయం బాలుకు చెబుతుంది మీనా. పోలీస్ స్టేషన్‌కు బాలు, మీనా వెళ్తారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈరోజు ఎపిసోడ్‌లోని ట్విస్టులు, టర్న్స్ ప్రేక్షకులను అలరించాయి. బాలు, మీనా, మరియు ఇతర పాత్రల మధ్య సంఘర్షణలు, కామెడీతో కూడిన ఈ ఎపిసోడ్ చూడటానికి వినోదాత్మకంగా ఉంటుంది.

