|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గురి తప్పదు తమ్ముడు

Published: 12-05-2025, 8:32 PM
గురి తప్పదు తమ్ముడు

నితిన్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ చిత్రం జూలై 4న విడుదల కానుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ప్రధాన పాత్రలు పోషించారు. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అనే టీజర్ ఇప్పటికే విడుదలైంది.

Key Points

1

నితిన్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదలవుతోంది.

2

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కింది.

4

'మూడ్ ఆఫ్ తమ్ముడు' వీడియోలో నితిన్ ఎంట్రీ ఆకర్షణీయంగా ఉంది.

‘తమ్ముడు’ సినిమా విడుదల తేదీ

నితిన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్‌ కానుంది. కాగా ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ ‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ అంటూ సోమవారం ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్‌.

రత్న అనేపాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, గుత్తిపాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్‌గా సౌరభ్‌ సచ్‌దేవ్‌ కనిపించబోతున్నారు. ‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ వీడియో చివర్లో నితిన్‌ ఎంట్రీ, బాణం వదిలిన తీరు ఆసక్తిగా ఉంది. ‘‘నితిన్, ‘దిల్‌’ రాజు, శిరీష్‌ కాంబినేషన్‌లో ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్‌ వేణు ‘ఎంసీఏ, వకీల్‌ సాబ్‌’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: కేవీ గుహన్, సంగీతం: అజనీష్‌ లోకనాథ్‌.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ వీడియో

నితిన్, ‘దిల్’ రాజు, శిరీష్ మరియు శ్రీరామ్ వేణు కాంబినేషన్ లో వస్తున్న ‘తమ్ముడు’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. జూలై 4న విడుదలయ్యే ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.