
నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ‘సారంగదరియా’ పాటకు వేసిన ఊరమాస్ స్టెప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె డ్యాన్స్ సాయి పల్లవికి గట్టి పోటీ ఇస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అభిమానులు ఆమెను సినిమాల్లోకి రావాలని కోరుతున్నారు.
Key Points
బాలయ్య చిన్న కూతురు తేజస్విని 'సారంగదరియా' పాటకు ఊరమాస్ స్టెప్పులు వేసింది.
ఆమె డ్యాన్స్ సాయి పల్లవికి గట్టి పోటీ ఇస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తో కలిసి తేజస్విని మరోసారి తన టాలెంట్ ని బయటపెట్టింది.
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నందమూరి లెగసీని కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు.
తేజస్విని డ్యాన్స్ తో అభిమానులకి పూనకాలు
Tejaswini Dance: నందమూరి ఫ్యామిలీ నుండి బాలయ్య, తారక్,కళ్యాణ్ రామ్ అంటూ హీరోలే తప్ప హీరోయిన్స్ కాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాని ఎవరూ వచ్చింది లేదు. వెండి తెరపై ఎంట్రీ ఇవ్వకున్నా అడపాదడపా తమ టాలెంట్ ని ప్రైవేట్ ఫంక్షన్స్ లోనో, సింగిల్ గా వీడియోలో బయటపెడుతూనే ఉంటారు.అలా వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలయ్య చిన్న కూతురు తేజస్విని గురించి.తమ్ముడు మోక్షు ఎంట్రీ గురించి అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే ఆ గ్యాప్ ని ఇదిగో ఇలా భర్తీ చేస్తానంటూ తనదైన డాన్సింగ్ టాలెంట్ ని బయటపెడుతుంది.
అభిమానులకి పూనకాలు తెప్పిస్తున్న తేజస్విని
ఇలా రెండు నెల్ల కిందటే కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తో కలిసి సాలిడ్ స్టెప్పులతో అదరగొట్టిన ఈ నందమూరి చిన్నది తాజగా మరోసారి తనలోని డాన్స్ ని బయటపెట్టింది. ఇక ఈ సారి తను ఎంచుకున్న పాట లవ్ స్టోరీలో మంగ్లీ పాడిన ‘సారంగదరియా’ అనే ఫోక్ టచ్ ఉన్న సాంగ్ ని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ఈ పాట అప్పట్లో ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు.ఒక రకంగా సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఈ పాట కూడా తన వంతు పాత్ర పోషించిందని చెప్పక్కర్లేదు.ఇపుడు ఆ పాటకే మరోసారి భాను మాస్టర్ కంపోజిషన్ లో స్టెప్పులు వేసి అభిమానులకి పూనకాలు తెప్పిస్తుంది.
సాయి పల్లవికి గట్టి పోటీ ఇస్తుందా?
సాయి పల్లవి డ్యాన్స్ రికార్డులకు గట్టి కాంపిటీషన్
మాములుగా రెగ్యులర్ గా డాన్స్ లు చేసే హీరోయిన్స్, ప్రొఫెషనల్ డాన్సర్స్ కి మాత్రమే సొంతమైన గ్రేస్ అండ్ ని మిక్స్ తేజస్విని తన డాన్స్ లో చూపడం ఇక్కడ విశేషం. ఇక ఈ డాన్స్ ని చూసిన నెటిజన్లు హీరోయిన్లకి కాంపిటీషన్ ఇస్తున్నారుగా..మీరు గనుక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే చాలా మంది తట్టా బుట్టా సర్డుకోవాలసిందే అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు .ఇంకొంతమంది సాయి పల్లవి డ్యాన్స్ రికార్డులకు గట్టి కాంపిటీషన్ వచ్చేలా ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే” అంటుంటే మరికొంతమంది మోక్షు ఎలాగూ హీరో గా ఎంట్రీ ఇచ్చేలా కనిపించట్లేదు .కనీసం మీరైనా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాలయ్య లెగసీని కంటిన్యూ చేయండి అంటూ కామెంట్స్ వదులుతున్నారు.
ఏమైనా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా
ఇక తేజస్విని విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ, వసుంధరలకి రెండో సంతానమైన ఈ అమ్మడు విశాఖపట్నంలోని ప్రసిద్ధ గీతం (GITAM) యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీభరత్ (మతుకుమిల్లి శ్రీభరత్) ని 2013 ఆగస్టు 21న హైటెక్స్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. ఇక ఈ శ్రీభరత్ ఎవరో కాదు మాజీ ఎంపీ అయిన స్వర్గీయ డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి గారి మనవడని చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా ఇంతటి టాలెంట్ ని తనలో దాచుకున్న ఈ నందమూరి భామ ముందు ముందు ఏమైనా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా చూడాలి !
సినిమాల్లోకి తేజస్విని ఎంట్రీపై చర్చ
Balayya Daughter Tejaswini Dance Video 💃 #NandamuriTejaswini pic.twitter.com/tCkTtKISB4
— Praneeth (@praneethballa) July 12, 2026
తేజస్విని తన డ్యాన్స్ టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె సినిమాల్లోకి వస్తే నందమూరి లెగసీని కొనసాగించగలదని అభిమానులు ఆశిస్తున్నారు. భవిష్యత్తులో ఆమె నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.


