|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య మాటల యుద్ధం! ఇండస్ట్రీలో పెరిగిన ఉద్రిక్తత!

Published: 12-07-2026, 11:16 AM
జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య మాటల యుద్ధం! ఇండస్ట్రీలో పెరిగిన ఉద్రిక్తత!

తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్‌లో తీవ్ర కలకలం రేగింది. అధ్యక్షురాలు సుమలత ఏకపక్ష నిర్ణయాలపై డాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేశారు. ఈ వివాదం మధ్యే ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Key Points

1

తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్‌లో తీవ్ర వివాదం చెలరేగింది.

2

జానీ మాస్టర్ భార్య సుమలత ఏకపక్ష నిర్ణయాలపై డాన్సర్లు ఆగ్రహం.

4

ఎన్నికల సభ్యత్వ అంశాలపై జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య వాగ్వాదం.

డాన్సర్స్ అసోసియేషన్‌లో రచ్చ

Tollywood: అసలు తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్లో ఏం జరుగుతోంది? ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు.. అక్కడ చెలరేగిన తీవ్ర వివాదం.. అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. అసోసియేషన్ అధ్యక్షురాలు , ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలతపై డాన్సర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఏకపక్షంగా ప్రతి విషయంలో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అసోసియేషన్ కి చెందిన పదిమంది డాన్సర్లు తమ పదవులకు రాజీనామా చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్లో ఈమెపై కంప్లైంట్ కూడా చేశారు. తమకు అన్యాయం జరుగుతోందని, అసోసియేషన్ లో రూల్స్ అతిక్రమిస్తున్నారని డాన్సర్లు పోలీసులను ఆశ్రయించారు.

మరొకవైపు అసోసియేషన్లో జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య వాగ్వాదం చెలరేగింది. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన ఇద్దరు ప్రముఖ కొరియోగ్రాఫర్ల మధ్య విభేదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇకపోతే ఉన్నట్టుండి ఇద్దరి మధ్య ఇలా విభేదాలు రావడానికి కారణం తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్ లో ఎన్నికల సభ్యత్వ అంశాలపై ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే డాన్సర్స్ అసోసియేషన్ లో పరిస్థితి కాస్త వేడెక్కిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. ఫెడరేషన్ అనుమతి లేకుండానే డాన్సర్స్ అసోసియేషన్ లో బై ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం మీద వివాదం మొదలైనట్లు సమాచారం. ఇక ఆ విషయంలోనే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య అభ్యంతరాలు వ్యక్తం అవడంతో ఈ వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. పైగా ఎన్నికల నిర్వహణ విధానం, సభ్యత్వానికి సంబంధించిన పలు అంశాలపై కూడా ఇరువర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, అదే సమయంలో సుమలత ఏకపక్షంగా వ్యవహరించారని, ఈ వివాదానికి నిరసనగా ఏకంగా 10 మంది డాన్సర్లు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు సమాచారం.

జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు

ఇకపోతే డాన్సర్స్ అసోసియేషన్లో పదిమంది డాన్సర్లు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై అసోసియేషన్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ నుంచి కూడా ఎటువంటి బహిరంగ ప్రకటన వెలువడలేదు. కానీ ఇందుకు సంబంధించిన వీడియోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్ లో నెలకొన్న ఈ వివాదంపై పెద్దలు స్పందిస్తారా ? స్పందించి ఈ సమస్యను సాల్వ్ చేస్తారా? ముఖ్యంగా ఎన్నికల వ్యవహారంపై అసోసియేషన్ లేదా సంబంధిత ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇక మొత్తానికైతే సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారగా.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో మాత్రం తెగ హల్చల్ చేస్తోంది.

సుమలతపై డాన్సర్ల ఆగ్రహం, రాజీనామాలు

Verbal war took place between #Jani Master and #Sekhar Master pic.twitter.com/Z9buopAws6

— Movies4u Official (@Movies4u_Officl) July 12, 2026

తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న ఈ వివాదం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డాన్సర్ల రాజీనామాలు, కొరియోగ్రాఫర్ల మధ్య విభేదాలపై అసోసియేషన్ అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.