|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుర్రం పాపిరెడ్డి: డిఫరెంట్‌గా మోషన్ పోస్టర్.. ఆకట్టుకుంటోన్న ‘గుర్రం పాపిరెడ్డి’ లుక్

Published: 02-05-2025, 7:23 PM
గుర్రం పాపిరెడ్డి: డిఫరెంట్‌గా మోషన్ పోస్టర్.. ఆకట్టుకుంటోన్న ‘గుర్రం పాపిరెడ్డి’ లుక్

నరేష్ అగస్త్య మరియు ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది. డార్క్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం భిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Key Points

1

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నారు.

2

డార్క్ కామెడీ కథాంశంతో ఆకట్టుకుంటోంది.

4

బ్రహ్మానందం, యోగి బాబు వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో ఉన్నారు.

గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్ విడుదల

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’ (Gurram Papireddy). డార్క్ కామెడీ కథ (Dark comedy story)తో రాబోతున్న ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తుండగా.. డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘గుర్రం పాపిరెడ్డి’ మూవీ మోషన్ పోస్టర్ పూర్తిగా కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. పర్పెక్ట్ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉండబోతుందో ఈ మోషన్ పోస్టర్ (Motion poster) చూపిస్తోంది. డిఫరెంట్‌గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్‌ను హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్‌లో కాంటెంపరరీగా, స్టైలిష్‌గా ప్రెజెంట్ చేశారు దర్శకుడు మురళీ మనోహర్. మోషన్ పోస్టర్‌లోని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్, కామెడీ హైలైట్‌గా నిలుస్తున్నాయి. కాగా.. చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

డార్క్ కామెడీ ఎలిమెంట్స్ హైలైట్

నటీనటులు మరియు సినిమా వివరాలు

గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొత్తరకమైన ప్రయత్నంతో వచ్చిన ఈ చిత్రం భిన్నమైన అనుభవాన్ని అందిస్తుందని ఆశిద్దాం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.