|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thursday Remedies: అప్పుల బాధలు తీరాలన్నా, జాతకంలో గురువు బలహీనంగా ఉన్నా.. గురువారం నాడు ఈ 4 పాటించండి, జీవితమే మారచ్చు!

Published: 16-04-2025, 10:43 PM
Thursday Remedies: అప్పుల బాధలు తీరాలన్నా, జాతకంలో గురువు బలహీనంగా ఉన్నా.. గురువారం నాడు ఈ 4 పాటించండి, జీవితమే మారచ్చు!

గురువారం విష్ణుమూర్తి, బృహస్పతికి అంకితం. అప్పుల బాధలు, జాతకంలో గురువు బలహీనత వంటి సమస్యలకు ఈ రోజున కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

గురువారం గోవులకు శనగపప్పు, బెల్లం, మినప్పప్పు దానం చేయండి.

2

వైవాహిక సమస్యలకు ఉపవాసం చేసి, విష్ణువు, గురువులను పూజించండి.

4

'ఓం బృం బృహస్పతే నమః' మంత్రాన్ని జపించండి.

అప్పుల బాధల నుండి విముక్తి

ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమస్యల నుంచి బయటపడడానికి, సంతోషంగా ఉండడానికి కొన్ని పరిహారాలని పాటించడం, పూజలు చేయడం మంచిది. గురువారం నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం కూడా ప్రత్యేక ఫలితాన్ని అందిస్తుంది.

గురువారం నాడు విష్ణుమూర్తిని పూజిస్తే పాపాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. గురువారం నాడు అప్పుల బాధల నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలని పాటించడం మంచిది. గురువారం నాడు ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలని పాటించాలి? వంటి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి రోజుకి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేసారు. గురువారం విష్ణుమూర్తికి , బృహస్పతికి అంకితం చేశారు. ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విష్ణుమూర్తి ప్రసన్నమవుతారు. అలాగే గురువు అనుగ్రహం కూడా కలుగుతుంది. గురువు అనుగ్రహంతో పెళ్లి ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి తొలగిపోతాయి, కనుక గురువారం నాడు బృహస్పతిని సరిగ్గా పూజిస్తే మంచిది,

గురువారం నాడు గోవులకు శనగపప్పు, బెల్లం పెట్టాలి. అలాగే మినప్పప్పు, అరటి పండ్లు కూడా పేదవారికి దానం చేయొచ్చు. పసుపు రంగు వస్త్రాలను కూడా ఈరోజు దానం చేయడం మంచిది.

వైవాహిక జీవితంలో సామరస్యం

2.వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవాలంటే

వైవాహిక సమస్యలు తొలగిపోయి, భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే గురువారం నాడు ఉపవాసం చేయాలి. అలాగే ఈ రోజు విష్ణువుని, గురువుని పూజించాలి. ఈ పరిహారంతో అదృష్టాన్ని పొందవచ్చు. జీవితంలో సంతోషం కూడా ఉంటుంది.

3.పసుపు రంగులో ఉండే తిలకం

జాతకంలో గురు గ్రహ బలం

పసుపు రంగులో ఉండే తిలకాన్ని జాతకంలో బృహస్పతిని బలోపేతం చేయడానికి గురువారం పెట్టుకుంటే మంచిది. మణికట్టు లేదా మెడపై పసుపుతో చిన్న తిలకాన్ని పెట్టాలి. ఇలా చేయడం వలన విజయాన్ని అందుకోవచ్చు. అలాగే జాతకంలో గురు గ్రహం కూడా బలంగా మారుతుంది.

గురువారం నాడు బృహస్పతిని ఆరాధించాలి. తర్వాత ‘ఓం బృం బృహస్పతే నమః’ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వలన ఆనందం , శ్రేయస్సు కలుగుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ పరిహారాలతో మీ జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయని ఆశిద్దాం. అయితే, ఇవి సలహాలు మాత్రమే, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.