
తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ సినిమా సెప్టెంబర్ 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తన సినిమా అనుభవం, హనుమాన్ సినిమాతో పోలికలు, తన పాత్ర గురించి తేజ సజ్జా వివరించారు.
Key Points
హనుమాన్ కంటే మిరాయ్‌కు ఎక్కువ కష్టపడ్డాను
మిరాయ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కాదు, తెలుగు ప్రేక్షకుల కోసం
సక్సెస్ కోసం ఆపాదించుకోను, ప్రతి సినిమాకీ 100% ప్రయత్నం చేస్తాను
మిరాయ్ సినిమాపై తేజ సజ్జా అభిప్రాయాలు
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ సినిమా ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. తేజ సజ్జాకు జోడీగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో మిరాయ్ సినిమాను నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న అంటే ఇవాళ మిరాయ్ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హీరో తేజ సజ్జా విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నాడు.
హనుమాన్ మరియు మిరాయ్ సినిమాల మధ్య తేడా
-మార్పు ఏమీ లేదండి. సినిమాకి పడే కష్టంలో ఎలాంటి తేడా లేదు. ఇంతకుముందు ఎలాగైతే కొత్తరకం సినిమాలు చేయాలని అనుకున్నానో ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. హనుమాన్‌కి ఎంత ఎఫర్ట్ పెట్టానో దాని కంటే ఎక్కువ మిరాయ్‌కి పెట్టాను.
-ఎలాంటి ఒత్తిడి లేదండి. నిజానికి హనుమాన్ విషయంలోనే చాలా ఒత్తిడి ఉండేది. నేను సక్సెస్‌ని ఆపాదించుకోను. ఒక సినిమాకి మించి ఇంకో సినిమా చేయాలనే అంచనాలు ఏమీ ఉండవు. ఏ సినిమాకి ఆ సినిమానే ప్రత్యేకము. ఒక సినిమాకి 100% ఎఫర్ట్ పెడుతున్నానా లేదా చూసుకుంటాను. ఒక్క గొప్ప వర్క్ చేయాలనే ఒత్తిడి తప్పితే హనుమాన్ వల్ల వచ్చిన ఒత్తిడి ఏమీ లేదు.
తెలుగు ప్రేక్షకులపై తేజ సజ్జా దృష్టి
-లేదండి. ముందు ఈ సినిమాని ఏ స్కేల్‌లో అనుకున్నామో ఆ స్కేల్‌లోనే తీశాం. పాన్ ఇండియన్ అని స్క్రిప్ట్‌లో మార్పులు చేసేద్దాం అని ఆలోచన ఎప్పుడూ లేదు. నా మెయిన్ గ్రౌండ్ తెలుగు ఆడియన్స్. మనకోసం తీసిన సినిమా ఇది. ఇతర భాషల్లో ఆడితే ఆనందం. నేను మాత్రం తెలుగు ప్రేక్షకుల కోసమే సినిమాలు చేస్తాను.
-ఒక మామూలు కుర్రాడు తన ధర్మాన్ని తెలుసుకొని, తనకి యోధులకి ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని, ఒక పెద్ద ఆపదని ఆపడానికి తను ఎంత దూరం వెళ్తాడు? తన తల్లి ఆశయం కోసం ఎంత దూరం వెళ్తాడు? ఇతిహాసాల్లో ఉన్న సమాధానం కోసం జర్నీ చేసే క్యారెక్టర్‌లో కనిపిస్తాను.
తెలుగు ప్రేక్షకుల కోసం తాను సినిమాలు చేస్తున్నానని, మిరాయ్ సినిమాపై తనకు ఎలాంటి ఒత్తిడి లేదని తేజ సజ్జా తెలిపారు. సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నారు.


