|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షూటింగ్ కి సిద్ధమైన హ్యాపీడేస్ 2! హీరోలు వీరేనా? శేఖర్ కమ్ముల సంచలన నిర్ణయం!

Published: 06-03-2026, 5:35 AM
షూటింగ్ కి సిద్ధమైన హ్యాపీడేస్ 2! హీరోలు వీరేనా? శేఖర్ కమ్ముల సంచలన నిర్ణయం!
  • శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీ డేస్ 2’ త్వరలో ప్రారంభం!
  • నేటి తరం జెన్ జీ యువత జీవితాల ఆధారంగా కథ సిద్ధం
  • యూత్ లో క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోల ఎంపిక ఉంటుందని సమాచారం
  • ‘కుబేర’ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న మరో సంచలనం!

టాలీవుడ్ లో మరో సంచలనానికి తెరలేపుతూ శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్ 2’ తో మీ ముందుకు రాబోతున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉండండి! మరిన్ని వివరాల కోసం చదవండి.

హ్యాపీ డేస్ సీక్వెల్: శేఖర్ కమ్ముల ప్లాన్స్

కొన్ని సినిమాలు ఆడియన్స్ మనసులపై ప్రభావం చూపిస్తుంటాయి.. ప్రేక్షకుల జీవితాలను ప్రతిభింబిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో కథ, పాత్రలు, భావోద్వేగాలు ప్రేక్షకుల ఆలోచనలను కూడా మార్చేస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్. 2007 సంవత్సరంలో పూర్తిగా కొత్తవాళ్లతో రూపొందిన ఈ సినిమా రఅప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది.

ఈ సినిమా విడుదలైన మొదటి వారం రోజుల వరకు థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులు కనిపించలేదు. కాని ఆ తరువాత ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో.. థియేటర్లకు స్టూడెంట్స్ క్యూ కట్టారు. వారం రోజులు డల్ గా ఉన్న థియేటర్ల పరిస్థితి చెందడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మాటామాటా ప్రచారం పెరగడంతో సినిమా వసూళ్లు ఊహించని స్థాయిలో నమోదయ్యాయి. పూర్తిగా కొత్త నటీనటులతో రూపొందిన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇంతటి విజయాన్ని సాధించగలదా అని ట్రేడ్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు.

జెన్ జీ యూత్ కథతో హ్యాపీ డేస్ 2

ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యువతలో మంచి స్పందన పొందింది. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత చాలా మంది యువకులకు బీటెక్ చదవాలనే ఆసక్తి కలిగిందని అప్పట్లో చెప్పుకునేవారు. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.ఇలాంటి విజయాన్ని మరోసారి తెరపై చూడాలని శేఖర్ కమ్ముల అభిమానులు చాలా కాలంగా ఆశపడుతున్నారు. ఇప్పుడు వారి కోరిక నెరవేరే అవకాశం ఉందని సమాచారం.

రీసెంట్ గా భారీ విజయాన్ని సాధించిన కుబేర సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తదుపరి ప్రాజెక్ట్ ఏమిటన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెరపడినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఆయన హ్యాపీ డేస్ 2 కథపై పని చేస్తున్నారన్న వార్త వైరల్ అవుతోంది. ఈసారి కథ నేటి తరం జెన్ జీ యువతను కేంద్రంగా చేసుకుని ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల్లో యువత జీవన విధానం ఎలా ఉంది, వారి అలవాట్లు, స్నేహాలు, చిన్న చిన్న గొడవలు వంటి అంశాలను దగ్గరుండి పరిశీలించి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

హీరోలు వీరేనా? వైరల్ అవుతున్న న్యూస్

సమాచారం ప్రకారం ఈ స్క్రిప్ట్ ప్రస్తుతం చివరి దశలో ఉందని చెబుతున్నారు. త్వరలోనే కథ పూర్తిచేసి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈఅయితే మొదటి భాగమైన హ్యాపీ డేస్ పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కింది. కానీ ఈసారి మాత్రం యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఇద్దరు హీరోలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే ఆ హీరోలు ఎవరు అన్న విషయం ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంచారు.

శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్ 2’ గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.