
బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్ ఫ్లోరా షైనీ తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 47 ఏళ్ల వయసులో పెళ్లి ఆలోచన లేదని, డేటింగ్‌లో సంతోషంగా ఉన్నానని తెలిపారు. వివాహ వ్యవస్థపై నమ్మకం కోల్పోయినట్లు, లివ్-ఇన్ రిలేషన్ షిప్ మేలని ఆమె స్పష్టం చేశారు.
Key Points
బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్ ఫ్లోరా షైనీ ఇటీవల షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.
47 ఏళ్ల వయసులోనూ వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదని ఫ్లోరా స్పష్టం చేశారు.
విఫల వివాహాలు చూసి పెళ్లి వ్యవస్థపై నమ్మకం కోల్పోయినట్లు తెలిపారు.
ప్రస్తుతం బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉన్నానని, లివ్-ఇన్ బెటర్ అని నమ్ముతానని చెప్పారు.
పెళ్లిపై ఫ్లోరా షైనీ సంచలన వ్యాఖ్యలు
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచితమైన నటి ఫ్లోరా షైనీ ఇటీవల బిగ్ బాస్ 9 తెలుగు షోలో కంటెస్టెంట్‌గా కనిపించారు. చివరి వీకెండ్ లో ఆమె షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. రీసెంట్ గా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
47 ఏళ్ల వయసులో ఇప్పటికీ సింగిల్‌గా ఉన్న ఫ్లోరా, తనకి వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదని స్పష్టంగా వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, “నా పరిచయమున్న వారిలో ఎన్నో విఫలమైన వివాహాలు చూశాను. వివాహం అనే వ్యవస్థపై నాకు నమ్మకం తగ్గిపోయింది. కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేయడం లేదు,” అని తెలిపింది.
లివ్-ఇన్ రిలేషన్ షిప్ పై ఫ్లోరా అభిప్రాయం
తన ప్రస్తుత జీవితం గురించి మాట్లాడుతూ, “నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, మా రిలేషన్‌షిప్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ వివాహం చేసుకోవాలనే ఆలోచన మాత్రం లేదు. ఈ రోజుల్లో చాలా మంది వివాహాలు రెండేళ్లు, మూడేళ్లలోనే విడాకుల దిశగా వెళ్తున్నాయి. కాబట్టి వివాహం కంటే లివ్-ఇన్ రిలేషన్‌లో ఉండటం బెటర్ అని నేను నమ్ముతాను,” అని ఫ్లోరా అన్నారు.
ఫ్లోరా సైనీ మొదట ఆశా సైనీ పేరుతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె తన కెరీర్‌ను తెలుగు సినిమాలతో ప్రారంభించారు. బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ మూవీలో లక్స్ పాప అనే సాంగ్ తో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత కోడుకు దిద్దిన కాపురం, లక్కీ లేడీ, నువ్వు నాకు నచ్చావ్ వంటి అనేక చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఫ్లోరా షైనీ సినీ ప్రస్థానం
ఫ్లోరా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లోనూ పలు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఆమె వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోల ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. బిగ్ బాస్ 9 తెలుగులో తన స్పష్టమైన అభిప్రాయాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తన మనసులోని మాటలను చెప్పి వార్తల్లో నిలిచారు. గతంలో ఫ్లోరా షైనీ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంది. దీనితో ఫ్లోరా షైనీ అతడిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ ఫ్లోరా షైనీ పెళ్లిపై తన ధైర్యవంతమైన అభిప్రాయాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. తన జీవిత అనుభవాల ద్వారా వచ్చిన ఈ నిర్ణయం చాలామందికి ఆలోచన రేకెత్తిస్తోంది. ఆమె వివాహం కంటే ఆనందాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటున్నారు.


