|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాక్సిక్‌లో యశ్-కియారా రొమాన్స్ వైరల్! ‘తబాహీ’ పాటపై ట్రోల్స్ మంటలు

Published: 08-07-2026, 6:36 PM
టాక్సిక్‌లో యశ్-కియారా రొమాన్స్ వైరల్! 'తబాహీ' పాటపై ట్రోల్స్ మంటలు

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ నుంచి రెండో పాట ‘తబాహీ’ రిలీజైంది. ఈ పాటలో యశ్-కియారా రొమాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రోల్స్ కూడా మంట పెడుతున్నాయి.

Key Points

1

యశ్-కియారా రొమాన్స్ వైరల్, 'తబాహీ' సాంగ్ రిలీజ్

2

సోషల్ మీడియాలో ట్రోల్స్, కండోమ్ యాడ్ అంటూ సెటైర్లు

4

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పాన్-ఇండియా మూవీ

యశ్-కియారా కెమిస్ట్రీ ఫుల్ రొమాంటిక్

కన్నడ పాన్-ఇండియా స్టార్, రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌తో సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా ‘తబాహీ’ సాంగ్ రిలీజైంది. ఇది ‘టాక్సిక్’ ఫీవర్‌ను మరింత పెంచేయడం ఖాయం. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వస్తున్న ‘టాక్సిక్’ సినిమా లోని రెండో పాట  ‘తబాహీ’  ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. యశ్‌ అభిమానులకు ట్రీట్‌నిచ్చింది.

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది. విశాల్ మిశ్రా సంగీతం అందించిన ఈ కొత్త పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘తబాహీ’ సాంగ్ రేపు ఉదయం 11.33 గంటలకు వస్తుందని నిన్ననే హీరోయిన్ కియారా అద్వానీ ‘X’లో పోస్ట్ చేశారు. చెప్పినట్టుగానే, ఈ రోజు రిలీజైన ఈ పాట అంచనాలకు మించి సంచలనం సృష్టిస్తోంది. ప్రస్దుతం ఈ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది.

‘తబాహీ’ సాంగ్‌పై నెటిజన్ల సెటైర్లు

విశాల్ మిశ్రా మ్యూజిక్ డైరెక్షన్‌లో, ఆయన గొంతుతోనే వచ్చిన ఈ పాట చాలా డిఫరెంట్‌గా, స్పెషల్‌గా ఉంది. యోగరాజ్ భట్ రాసిన కన్నడ సాహిత్యంలాగే తెలుగులో కూడా లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. యశ్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ సూపర్ రొమాంటిక్‌గా ఉంది. ఈ జనరేషన్ వాళ్ల భాషలో చెప్పాలంటే ఈ పాట ఒక ‘నిప్పు’లా ఉంది. పాటలోని విజువల్స్, మేకింగ్ రిచ్‌నెస్, హై టెక్నాలజీ అన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయి. చూసేవాళ్లను మంత్రము గ్ధుల్ని చేస్తున్నాయి. ‘తబాహీ’ సాంగ్ రిలీజ్‌తో, ఇప్పటికే ఉన్న అంచనాల నిప్పుకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. అయితే ఇది ట్రోల్స్ కి గురవుతుంది. ఈ పాటని చూసిన కొందరు నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. శ్రుతి మించిన రొమాన్స్ ఉందని, ఇంతలా ఇటీవల చూడలేదని అంటున్నారు. ఈ పాటని చూస్తుంటే కండోమ్‌ యాడ్‌లా ఉందని, యశ్‌, కియారా రెచ్చిపోయి చేశారని అంటున్నారు. దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. సినిమాలో రొమాన్స్ ఉందా? రొమాన్స్ కోసం సినిమా చేశారా? అని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ఇటీవల రిలీజైన ‘టాక్సిక్’ సినిమా ‘లేడీస్ & లేడీస్’ టీజర్ కూడా పెద్ద సంచలనం సృష్టించింది. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా.. ఈ ఐదుగురు హీరోయిన్లతో ఈ స్పెషల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఐదుగురు బ్యూటీస్‌తో యశ్ స్వాగ్ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది.

‘టాక్సిక్’ అంచనాలకు మరింత ఆజ్యం

ఈ రోజు (జులై 8, 2026) రిలీజైన ఈ పాటతో యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వస్తున్న ‘టాక్సిక్’ సినిమాపై క్రేజ్ పీక్స్‌కు చేరింది. వచ్చే నెల, అంటే ఆగస్ట్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ పాన్-ఇండియాను మించిన ‘పాన్-వరల్డ్’ సినిమా కోసం అభిమానుల కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

‘టాక్సిక్’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ‘తబాహీ’ సాంగ్ ఫీవర్ ఇప్పుడు అందరినీ కవర్ చేస్తోంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.