
📌 Key Points
- అఖండ 2 డిసెంబర్ 5న పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
- ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది.
- ప్రగ్యా జైస్వాల్ పాత్రకు అఖండ 2లో పెద్దగా స్కోప్ లేదని బాలకృష్ణ వెల్లడి.
- ‘ఫోటోకి దండ వేసాం’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2 సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ, అఖండలో హీరోయిన్‌గా నటించిన ప్రగ్యా జైస్వాల్ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రగ్యా పాత్రకు స్కోప్ లేదని బాలయ్య చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
అఖండ 2 పై భారీ అంచనాలు
Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. లేటెస్ట్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తగ్గని లెవల్లో అఖండ 2 టీజర్, ట్రైలర్ ఉంటడంతో రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా డిసెంబర్ 5,న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chinmayi Sripada: ముందే తెలిస్తే ఆ పాట పాడేదాన్ని కాదు.. “ద్రౌపది 2” పాటపై చిన్మయి కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన దర్శకుడు
ప్రగ్యా జైస్వాల్ పాత్రపై బాలకృష్ణ క్లారిటీ
అయితే, ఈ సినిమా టీజర్ విడుదల అయినప్పటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ కనిపించింది. కానీ, అఖండ సినిమాలో బాలకృష్ణ భార్యగా ప్రగ్యా కనిపించింది. అసలు ఈ సినిమాలో ఆమె పాత్ర ఉంటుందా. టీజర్, ట్రైలర్ లో ఎక్కడా కనిపించలేదు అని చాలా మంది అనుకున్నారు. కానీ, తాజాగా ఈ పాత్ర గురించి నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు.
వైరల్ అవుతున్న బాలయ్య సరదా కామెంట్స్
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న బాలయ్య(Balakrishna)ను యాంకర్ ఆడుగుతూ.. అఖండలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ చేసింది. కానీ ఈ సినిమాలో ఆమె కనిపించడం లేదు. అసలు ప్రగ్యా ఈ సినిమాలో ఉన్నారా లేరా అని అడిగారు. దానికి సమాధానంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ 2లో ప్రగ్యా పాత్రలో పెద్దగా స్కోప్ లేదు. ఒక వేళ పెడదాం అనుకున్నా కథకు అడ్డం పడుతోంది ఆ పాత్ర. అందుకే ఆమె ఫోటోకి దండ వేషము అంటూ”చెప్పుకొచ్చాడు. దీంతో బాలకృష్ణ చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అఖండ 2 ప్రమోషన్స్‌లో బాలకృష్ణ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రగ్యా జైస్వాల్ పాత్రపై బాలయ్య ఇచ్చిన ఈ వివరణ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. డిసెంబర్ 5న అఖండ 2 విడుదల కానుంది.


