
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్లు నిరాశపరుస్తున్నాయి. రిలీజ్ అయిన ఐదు రోజుల్లో సినిమా వసూలు చేసిన మొత్తం మరియు ఇతర సినిమాలతో పోలికను ఈ కథనం వివరిస్తుంది.
Key Points
హరి హర వీరమల్లు 5 రోజుల్లో రూ.77.50 కోట్లు వసూలు చేసింది.
మొదటి వారంలో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.
నాని సినిమా 'హిట్ 3' కలెక్షన్లకు దగ్గరగా ఉంది.
ఇండియాలో రూ.100 కోట్ల మార్క్‌కు ఇంకా దూరంలో ఉంది.
హరి హర వీరమల్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మూవీ కలెక్షన్లు మరింత పడిపోయాయి. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ మండే (జులై 28) ఈ ఫిల్మ్ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. జులై 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. అయిదు రోజుల్లో ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో ఇక్కడ చూద్దాం.
హరి హర వీరమల్లు గత గురువారం థియేటర్లలో రిలీజైంది. అంతకంటే ఒక్క రోజు ముందు బుధవారం ప్రీమియర్లు వేశారు. ఈ మూవీ రిలీజయ్యాక వచ్చిన ఫస్ట్ మండే ఇండియాలో రూ.2.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని సక్నిల్క్ ట్రేడ్ వెబ్ సైట్ వెల్లడించింది. దీంతో కలిసి ఈ పవన్ కల్యాణ్ సినిమా అయిదు రోజుల్లో ఇండియాలో రూ.77.50 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది.
ఐదు రోజుల వసూళ్లు
ఓపెనింగ్ వీకెండ్ తో పోలిస్తే హరి హర వీరమల్లు సినిమా వసూళ్లు తగ్గినప్పటికీ వీక్ డేస్ ను పరిగణనలోకి తీసుకుంటే కలెక్షన్లు ఇంకా డీసెంట్ గానే ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఇండియాలో టోటల్ కలెక్షన్స్ రూ.77.50 కోట్లకు చేరుకోగా, ఫస్ట్ వీకెండ్ లో ఇండియాలో ఈ సినిమా రూ.74.85 కోట్ల నెట్ వసూలు చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా రూ.100 కోట్లు దాటింది. కానీ ఇండియాలో మాత్రం ఆ మైల్ స్టోన్ కు ఇంకా దూరంలోనే ఉంది.
నేచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేసిన హిట్ 3 సినిమా ఇండియా కలెక్షన్లకు హర హర వీరమల్లు చేరువైంది. హిట్ 3 ఇండియాలో రూ.80.97 కోట్లు వసూలు చేసింది. అయితే అబ్బాయి రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ ఇండియా వసూళ్లకు హరి హర వీరమల్లు ఇంకా దూరంలోనే ఉంది. గేమ్ ఛేంజర్ ఇండియాలో రూ .106.15 కోట్ల నెట్ వసూలు చేసింది.
ఇతర సినిమాలతో పోలిక
ఔరంగజేబు (బాబీ డియోల్) నుంచి కోహినూర్ వజ్రాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో బయలుదేరే వీర మల్లు (పవన్) అనే విక్రమార్కుడి కథను హరి హర వీరమల్లు చెబుతుంది. మార్గమధ్యంలో పంచమి (నిధి) అనే దేవదాసిని కలుస్తాడు. క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా చేయాల్సి ఉండగా పలు వాయిదాల కారణంగా ఆయన తప్పుకున్నారు. క్రిష్ ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడు అనుకున్న విధంగా జ్యోతి కృష్ణ కథను తెరకెక్కించాడు. ఈ మూవీలోని కొన్ని వీఎఫ్ఎక్స్ సీన్లను కట్ చేసి, క్లైమాక్స్ ఛేంజ్ చేసి మూవీని రీలోడ్ చేశారు.
చివరిగా, హరి హర వీరమల్లు సినిమా ఇండియాలో 100 కోట్ల మార్క్‌ను అందుకోవడంలో ఇంకా వెనకబడి ఉంది. వసూళ్లలో తగ్గుదల కనిపిస్తుండడం చిత్రబృందాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.


