|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘హరి హర వీరమల్లు’కు జూనియర్ దెబ్బ

Published: 26-07-2025, 11:51 PM
'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ

పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. మొదటి రోజు నుంచే విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా రెండో రోజున భారీగా కలెక్షన్స్ కోల్పోయింది.

Key Points

1

హరి హర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.

2

రెండో రోజు కలెక్షన్స్ 85% వరకు పడిపోయాయి.

4

'జూనియర్' సినిమా వంటి చిన్న సినిమాలకు థియేటర్లు కేటాయించబడ్డాయి.

బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం

పవన్ ‌ కల్యాణ్ ‌ నటించిన ‘ హరి హర వీరమల్లు ‘ బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే డిజాస్టర్ ‌ గా మిగిలిపోయింది . సినిమా మేకింగ్ ‌, గ్రాఫిక్స్ ‌ పనితీరుపై తీవ్రమైన విమర్శలు రావడంతో వీరమల్లుపై గట్టిదెబ్బ పడింది . రెండో రోజున బాక్సాఫీస్ వద్ద 85 శాతం వరకు కలెక్షన్స్ ‌ పడిపోయాయి. దీంతో చాలా చోట్ల శనివారం నుంచే వీరమల్లును తొలగించి మరో సినిమాను ప్రదర్శించారు . ఈ క్రమంలో వైజాగ్ ‌ లోని లీలామహల్ , వెంకటేశ్వర వంటి గుర్తింపు ఉన్న సింగిల్ ‌ థియేటర్స్ ‌ నుంచి వీరమల్లు చిత్రాన్ని తొలగించేశారు .

‘లీలామహల్’ నుంచి వీరమల్లు ఔట్‌ విశాఖపట్నంలో లీలామహల్ థియేటర్ ‌ కు చాలా ప్రత్యేక స్థానం ఉంది . సుమారు 600 సీట్లతో నిర్మించిబడిన ఈ థియేటర్ ‌ కు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది . రీసెంట్ ‌ గా పెద్ద ఎత్తున అధునీకరణ చేశారు . జనసేన ఎమ్మేల్యేలు కూడా తమ కార్యకర్తలతో జులై 24 న ఇక్కడ సినిమా చూశారు . ప్రీమియర్ ‌ తో పాటు మొదటిరోజున అన్ని షోలు హౌస్ ‌ ఫుల్ ‌ అయ్యాయి . కానీ , రెండోరోజు మొదటి ఆటకు కేవలం 29 టికెట్లు మాత్రమే తెగడంతో శనివారం నుంచే ఈ చిత్రాన్ని తొలగించి ‘ జూనియర్ ‌’ సినిమాను ప్రదర్శించారు . వీకెండ్ ‌ లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో సంచలనంగా మారింది .

థియేటర్ల నుండి తొలగింపు

ఆపై వీరమల్లు సినిమాకు వన్ వీక్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే ఆంశమని చెప్పవచ్చు . ఎలాగూ ఒక వారం అగ్రిమెంట్ వుంది కనుక వీరమల్లును అలా రన్ ‌ చేయవచ్చు . కానీ , మరీ 30 టికెట్ల లోపు మాత్రమే తెగుతుండటం .. ఆపై సోమవారం నుంచి ఇవీ కూడా వుండవేమో అనే అనుమానంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . ఇదిలా వుంటే విశాఖలోనే వెంకటేశ్వర థియేటర్ ‌ తో కూడా వన్ వీక్ అగ్రిమెంట్ ‘ వీరమల్లు ‘ కు వుంది. కానీ , అక్కడ కూడా మహావతార్ నరసింహ సినిమాను వేసుకున్నారు.

జూనియర్ సినిమా ప్రభావం

ఇలా హైదరాబాద్ ‌, విజయవాడ , తిరుపతి వంటి పెద్ద నగరాల్లో వీరమల్లును తొలగించి మహావతార్ , జూనియర్ ‌ చిత్రాలను ప్రదర్శించడం విశేషం . ఒక స్టార్ ‌ హీరో సినిమాను ఇలా పక్కన పెట్టి ఎలాంటి అంచనాలు లేని సినిమాలను ప్రదర్శిస్తుండటం నెట్టింట వైరల్ ‌ అవుతుంది . వీరమల్లు సినిమాను ఎలాగైనా హిట్ ‌ చేయాలని పవన్ ‌ అభిమానులతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు . ఆపై ఏకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి పవన్ ‌ అభిమానులతో కాన్ఫిరెన్స్ ‌ కాల్స్ ‌ మాట్లాడారు . అందుకు సంబంధించిన సంభాషణ వైరల్ ‌ అవుతున్న విషయం తెలిసిందే .

వీరమల్లు సినిమా విడుదల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందింది. చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.