
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే రెండో రోజు కలెక్షన్స్‌లో భారీగా తగ్గుదల కనిపించింది. మూడు రోజులలో సినిమా 91 కోట్ల గ్రాస్ వసూలు చేసినా, తెలుగులో కలెక్షన్స్ తక్కువగానే ఉన్నాయి.
Key Points
హరి హర వీరమల్లు మూడు రోజుల్లో ₹65.88 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.
రెండో రోజు కలెక్షన్స్ 85% వరకు పడిపోయాయి.
మూడో రోజు కలెక్షన్స్‌లో కొంత పెరుగుదల కనిపించినప్పటికీ, మొదటి రోజు స్థాయికి చేరలేదు.
ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో సినిమా ₹91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.
హరి హర వీరమల్లు బాక్స్ ఆఫీస్ వసూళ్లు
పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు జూలై 24న థియేటర్లలో విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. కానీ, ఆ రెండో రోజు మాత్రం సుమారుగా 85 శాతం మేర కలెక్షన్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు 3 రోజుల కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం హరి హర వీరమల్లు సినిమాకు మూడో రోజు అయిన శనివారం ఇండియాలో రూ.9.86 కోట్ల నెట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఇది రెండో రోజుతో పోల్చుకుంటే 23.25 శాతం పెరిగినట్లే. ఇండియాలో రెండో రోజున హరి హర వీరమల్లు సినిమాకు రూ. 8 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.
ఆ లెక్కన రెండో రోజుతో చూసుకుంటే మూడో రోజు హరి హర వీరమల్లు కలెక్షన్స్ పెరిగాయి. కానీ, ఓపెనింగ్స్ రోజుతో చూస్తే మాత్రం వసూళ్లు ఇంకా కోలుకోలేనట్లే కనిపిస్తోంది. అంటే, మొదటి రోజు గణాంకాలకు, 3వ రోజు గణాంకాలకు చాలా వ్యత్యాసం ఉంది.
రెండవ రోజు కలెక్షన్స్‌లో భారీ క్షీణత
ఇక మూడు రోజుల్లో ఇండియాలో హరి హర వీరమల్లు సినిమా రూ. 65.88 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, అందులో ఎక్కువ భాగం మొదటి రోజు (గురువారం) రూ .34 కోట్లు, బుధవారం ప్రీమియర్ షోల నుంచి రూ .12 కోట్లు ఉన్నాయి.
హరి హర వీరమల్లు సినిమాకు రెండో రోజు బ్యాడ్ రివ్యూ లు, పేలవమైన టాక్‌తో రూ. 8 కోట్లకు పడిపోయిన విషయం తెలిసిందే. శనివారం కాస్తా మోస్తరుగా లేచిన తక్కవగానే ఉంది. ఆదివారం కూడా ఇదే తరహా ట్రెండ్‌ను నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తక్కువ కలెక్షన్స్
ఇక రెండో రోజు నాటికి వరల్డ్ వైడ్‌గా హరి హర వీరమల్లు సినిమా రూ. 80 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 60.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువగా రూ. 7.5 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు రూ. 11 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉందట.
ఇకపోతే 3 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా హరి హర వీరమల్లు సినిమా రూ. 91 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అంటే, ఈ గ్రాస్‌ను పవన్ కల్యాణ్ సినిమా రాబడితే.. నాలుగు రోజుల్లో వంద కోట్ల వైపుగా హరి హర వీరమల్లు నడిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మొత్తం మీద, హరి హర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.


