
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా జులై 24న విడుదలైంది. సినిమాపై భారీ అంచనాలు ఉండగా, విడుదలైన తర్వాత నెగెటివ్ టాక్ వచ్చింది. దీనివల్ల కలెక్షన్లపై ప్రభావం పడింది. మొదటి రెండు రోజుల కలెక్షన్లు అనుకున్నంతగా లేవు.
Key Points
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ తో భారీ అంచనాలు
మొదటి రోజు రూ. 47 కోట్లు, రెండవ రోజు రూ. 8.79 కోట్లు నెట్ కలెక్షన్స్
వీకెండ్ కలెక్షన్స్ పై ఆశలు
అంచనాలకు భిన్నంగా కలెక్షన్లు
పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ భారీ అంచనాలతో జులై 24 న విడుదలైంది . క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు . సుమారు రూ . 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు . అయితే , ప్రీమియర్ షోలు పూర్తి అయన తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది . పేలవమైన కథాంశం, విఎఫ్ఎక్స్ కారణంగా ‘ వీరమల్లు ‘ విమర్శల పాలైంది. దీంతో మొదటిరోజు , ప్రీమియర్ షోలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ . 47 కోట్ల నెట్ వరకే పరిమితం అయింది . రెండోరోజులు పూర్తి అయ్యే సరికి రూ . 56.29 కోట్ల నెట్ కలెక్షన్స్ కు చేరుకుంది . అయితే , డే -2 మరింత దారుణమైన కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రముఖ వెబ్‌సైట్ సాక్నిల్క్ పేర్కొంది .
నెగెటివ్ టాక్ ప్రభావం
చిన్న హీరోల సినిమాలు విడుదలైతేనే మొదటిరోజు , రెండోరోజు అంటూ కలెక్షన్స్ మేకర్స్ ప్రకటిస్తారు . కానీ , ‘ హరి హర వీరమల్లు ‘ చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఎక్కడా కూడా ప్రకటించలేదు . అయితే , బాక్సాఫీస్ లెక్కలను మాత్రమే ఎప్పటికప్పుడు ప్రచురించే ‘ సాక్నిల్క్ ‘ మాత్రం ప్రపంచవ్యాప్తంగా వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో పేర్కొంది . రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ . 8.79 కోట్ల నెట్ మాత్రమే రాబట్టినట్లు తెలిపింది .
వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉంటాయి?
బెనిఫిట్ షోల ద్వారా రూ. 12.7 5 కోట్ల నెట్ , మొదటిరోజు రూ. 3 4 . 7 5 కోట్ల నెట్ , రెండో రోజు రూ . 8.79 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి మొత్తంగా ఇప్పటి వరకు రూ . 56.29 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది . గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే రెండురోజులకు గాను రూ . 92 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది . ఇప్పుడు శనివారం, ఆదివారం వీకెండ్ ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.
మొత్తం మీద, ‘హరి హర వీరమల్లు’ సినిమా కలెక్షన్లు అంచనాలకు తగ్గట్లు లేవు. వీకెండ్‌లో కలెక్షన్లు పెరిగితేనే ఈ సినిమాకు లాభాలు రావచ్చు. ఇక ఆ తర్వాత ఏమవుతుందో చూడాలి.


