|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చరిత్రను వక్రీకరించేలా హరిహర వీరమల్లు.. చూస్తూ ఊరుకోం!

Published: 06-07-2025, 11:23 PM
చరిత్రను వక్రీకరించేలా హరిహర వీరమల్లు.. చూస్తూ ఊరుకోం!

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా చరిత్రను వక్రీకరిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. బీసీ సంఘం నాయకుడు ఈ సినిమాపై హైకోర్టులో పిల్ వేయనున్నట్లు ప్రకటించారు. సినిమా ట్రైలర్‌లోని కొన్ని దృశ్యాలు చరిత్రకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

Key Points

1

హరిహర వీరమల్లు సినిమా చరిత్రను వక్రీకరిస్తుందని ఆరోపణలు.

2

బీసీ సంఘం నాయకుడు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటన.

4

సినిమా యూనిట్ తమ వాదనను సమర్థించుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపణ.

చరిత్ర వక్రీకరణ ఆరోపణలు

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ( Hari Hara Veeramallu )కు చిక్కులు తప్పేలా లేవు. ఈ మూవీ పూర్తి కల్పితమని, ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్రను తీసుకుని చరిత్రలో ఎక్కడాలేని కల్పిత పాత్రలతో ఈ సినిమా తీస్తున్నారని బీసీ సంఘం నాయకుడు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి డాక్టర్‌ శివ ముదిరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చరిత్రను వక్రీకరించే ఈ సినిమాను అడ్డుకుంటామని, త్వరలో ఈ చిత్రంపై హైకోర్టులో పిల్‌ వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పండగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీశారని తాము ఆరోపించగా చిత్రయూనిట్‌ తప్పును సమర్థించుకుకోవాలని చూసింది. ఇది పండగ సాయన్న మూవీ కాదని, 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర బుక్కరాయలు కథ అని చెప్పారు.

హైకోర్టు పిటిషన్ ప్రకటన

కానీ, సినిమా ట్రైలర్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. డబ్బుల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా అడ్డుకుంటాం. త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తాం అని శివ తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో దయాకర్‌ రావు నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ జూలై 24న విడుదల కానుంది.

సినిమా ట్రైలర్ వివాదం

హరిహర వీరమల్లు సినిమా చరిత్ర వక్రీకరణపై తలెత్తిన వివాదం తీవ్రంగా ఉంది. హైకోర్టు పిటిషన్ ద్వారా ఈ వివాదానికి త్వరలోనే తేలిక అవుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.