|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘హరిహర వీరమల్లు’ బడ్జెట్ రివీల్ చేసిన డైరెక్టర్.. ఎన్ని వందల కోట్లో తెలుసా?

Published: 17-07-2025, 6:41 AM
‘హరిహర వీరమల్లు’ బడ్జెట్ రివీల్ చేసిన డైరెక్టర్.. ఎన్ని వందల కోట్లో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం జులై 24న విడుదలవుతోంది. తాజాగా దర్శకుడు సినిమా బడ్జెట్‌ను వెల్లడించారు. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

Key Points

1

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా జులై 24న విడుదలవుతోంది.

2

సినిమా బడ్జెట్ దాదాపు 300 కోట్లు అని దర్శకుడు వెల్లడించారు.

4

సినిమా ట్రైలర్, పాటలు మంచి హైప్‌ను సృష్టించాయి.

హరిహర వీరమల్లు విడుదల తేదీ

పవర్ స్టా్ర్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం(HHVM Movie) జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. పవన్ కెరియర్‌లో తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఓ వైపు హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal), మరోవైపు డైరెక్టర్ జ్యోతికృష్ణ(Jyothikrishna), నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా డైరెక్టర్ జ్యోతికృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా బడ్జెట్‌ను రివీల్ చేశారు. సినిమాను దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు చెప్పారు.

పవన్ స్టార్‌డమ్‌కు ఎంత ఖర్చు చేసినా తక్కువే అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సినిమా విడుదల కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నామని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ పోరాట యోధుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబి డియోల్ విలన్ పాత్ర పోషించారు. సునీల్, నాజర్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్లు మంచి హైప్ తెచ్చాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ ఒక్కసారిగా అందరి అంచనాలను తారుమారు చేసింది. దీంతో అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా బడ్జెట్ వివరాలు

నటీనటులు మరియు సినిమా హైప్

చివరగా, ‘హరిహర వీరమల్లు’ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించగలదని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.