|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ వాయిదా.. మూవీ టీమ్ పవన్ భరోసా

Published: 10-06-2025, 12:20 PM
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ వాయిదా.. మూవీ టీమ్ పవన్ భరోసా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం మళ్లీ వాయిదా పడింది. కానీ, పవన్ కల్యాణ్ నిర్మాతకు భరోసా ఇస్తూ ప్రమోషన్లలో పాల్గొంటానని చెప్పడం చిత్రబృందానికి ఊరటనిచ్చింది.

Key Points

1

హరిహర వీరమల్లు చిత్రం వాయిదా పడింది.

2

పవన్ కల్యాణ్ నిర్మాతకు భరోసా ఇచ్చారు.

4

త్వరలోనే రిలీజ్ డేట్ క్లారిటీ వస్తుంది.

హరిహర వీరమల్లు వాయిదా

డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి భాగం ఈ జూన్ 12న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చెయ్యగా.. ఫ్యాన్స్ ఊహించని విధంగా మరోసారి ఈ మూవీ వాయిదా పడి షాక్ ఇచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ చిత్రం వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఎన్నో సార్లు వాయిదా పడగా.. మళ్లీ ఈ చిత్రం పట్టాలెక్కదు అనుకున్నారు అంతా. కానీ, పవన్ కల్యాణ్ సపోర్ట్, నిర్మాత ఏ.ఎం. రత్నం ఓపికతో సినిమాను పూర్తి చేయగలిగారు. ఇప్పుడు వాయిదా నేపథ్యంలో నిర్మాతకు మరింత ఉపశమనం కల్పిస్తూ పవన్ కల్యాణ్ ఓ భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరమల్లు ప్రమోషన్స్‌లో పాల్గొంటానని నిర్మాత రత్నంకు మాటిచ్చారట పవన్ కల్యాణ్. ఇది నిజంగా బిగ్ రిలీఫ్. పవన్ సహజంగా ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటారు. ఆయన ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ చేసే సినిమాకైనా సరే, ఒక్క ప్రీరిలీజ్ ఈవెంట్‌కి తప్ప మరో ఈవెంట్‌లో కనిపించరు. కానీ ఇప్పుడు వీరమల్లు ప్రమోషన్స్‌లో ఆయన కూడా పాల్గొంటా అని చెప్పడంతో మూవీ టీమ్ మరింత ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా.. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్ భరోసా

రిలీజ్ డేట్ అప్డేట్

పవన్ కల్యాణ్ సహకారంతో హరిహర వీరమల్లు చిత్రం పూర్తి అయింది. ప్రమోషన్లలో ఆయన పాల్గొనడం చిత్ర బృందానికి ఊరటనిచ్చింది. త్వరలోనే రిలీజ్ డేట్ ఖరారవుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.