|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

HariHara VeeraMallu : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలి..?

Published: 22-07-2025, 6:13 AM
HariHara VeeraMallu : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలి..?

జులై 24న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ విశేషాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సినిమా హిట్ అవ్వాలంటే ఎంత కలెక్షన్స్ రావాలి అనేది ఇప్పుడు చర్చనీయాంశం.

Key Points

1

హరిహర వీరమల్లు సినిమాకు 126 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

2

సినిమా హిట్ అవ్వాలంటే 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావాలి.

4

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతిపెద్ద థియేట్రికల్ బిజినెస్.

హరిహర వీరమల్లు థియేట్రికల్ బిజినెస్

HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు జులై 24న రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. స్పెషల్ షోలకు కూడా పర్మిషన్ వచ్చేసింది. అసలు హైప్ లేదన్నారు, సినిమా లేట్ అయింది అన్నారు, థియేటర్ బిజినెస్ అవ్వలేదు అన్నారు.. కానీ వీటన్నిటిని దాటి పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకు.

టాలీవుడ్ సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్..

హిట్ టార్గెట్: ఎన్ని కోట్లు?

నైజాం – 37 కోట్లు సీడెడ్ – 16.50 కోట్లు ఉత్తరాంధ్ర – 12 కోట్లు ఈస్ట్ గోదావరి – 9.50 కోట్లు వెస్ట్ గోదావరి – 7.00 కోట్లు గుంటూరు – 9.50 కోట్లు కృష్ణ – 7.60 కోట్లు నెల్లూరు – 4.40 కోట్లు ఓవర్సీస్ – 10 కోట్లు రెస్టాఫ్ ఇండియా – 12.50 కోట్లు

ప్రేక్షకుల అంచనాలు

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 103 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమాకు 126 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఈ లెక్కన హరిహర వీరమల్లు సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 130 కోట్ల షేర్ రావాలి. అంటే ఆల్మోస్ట్ 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావాలి. అయితే సినిమాకు ఉన్నా హైప్ తో, పెంచిన రేట్లతో హరిహర వీరమల్లు సినిమాకు ఈజీగా 250 కోట్లు మొదటి నాలుగు రోజుల్లోనే వచ్చేస్తాయని అంటున్నారు. చూడాలి మరి హరిహర వీరమల్లు సినిమా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో.

మొత్తంమీద, హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించగలదని భావిస్తున్నారు. చివరి నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.