
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ కోసం రెండు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి, కాశీలో ఈ ఈవెంట్స్ జరుగుతాయని తెలుస్తోంది.
Key Points
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు రెండు భారీ ఈవెంట్స్
తిరుపతిలో సౌత్ ఈవెంట్, చిరంజీవి గెస్ట్ గా హాజరు
కాశీలో నార్త్ ఈవెంట్, యోగి ఆదిత్యనాథ్ గెస్ట్ గా రావడం టాక్
బుర్జ్ ఖలీఫాపై ట్రైలర్ లాంచ్ అవకాశం
తిరుపతిలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్
HariHara VeeraMallu : అయిదేళ్లుగా సాగిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తయి రిలీజ్ కాబోతుంది. జూన్ 12న ఈ సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఇటీవలే ఈ సినిమా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.
హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ రెండు భారీ ఈవెంట్స్ ని నిర్వహించబోతున్నాం అని తెలిపారు. అయితే టాలీవుడ్ సమాచారం ప్రకారం నార్త్ లో ఒక భారీ ఈవెంట్, సౌత్ లో ఒక భారీ ఈవెంట్ నిర్వహిస్తారని తెలుస్తుంది. సౌత్ లో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని సమాచారం. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కచ్చితంగా హాజరవుతారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వస్తారని టాక్ నడుస్తుంది.
కాశీలో భారీ ప్రమోషనల్ ఈవెంట్
ఇక నార్త్ లో కాశీలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు అని తెలుస్తుంది. హరిహర వీరమల్లు సినిమా ధర్మం కోసం యుద్ధం అనే కాన్సెప్ట్ కాబట్టి కాశీలో ప్రమోషన్ భారీగా చేద్దామని ప్లాన్ చేసారు. అక్కడ జరిగే ఈవెంట్ కి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గెస్ట్ గా వస్తారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల జనసేన ఎన్నికల్లో గెలిచి బీజేపీకి బలంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం, మోడీ పవన్ ని నేషనల్ మీడియా ముందు పొంగడంతో నార్త్ లో కూడా పవన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది, బీజేపీ నేషనల్ లీడర్స్ తో మంచి అనుబంధం ఏర్పడింది.
బుర్జ్ ఖలీఫా ట్రైలర్ లాంచ్?
దీంతో యోగి ఆదిత్యనాథ్ లాంటి మాస్ లీడర్ ఈవెంట్ కి వస్తే ప్రమోషన్ భారీగా జరగడంతో పాటు ధర్మం గురించి కూడా ప్రజల్లోకి బాగా వెళ్తుందని భావిస్తున్నారు. అలాగే హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ ని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా మీద ప్లే చేస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. అదే నిజమయితే కనక టాలీవుడ్ నుంచి బుర్జ్ ఖలీఫా మీదకు వెళ్లే మొదటి సినిమా హరిహర వీరమల్లునే. ఈ వార్తలతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈవెంట్స్ జరగడం పక్కా కానీ మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి. ఈవెంట్స్ ఖచ్చితమైనా, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.


