|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విలేజ్‌లో పెద్ది యాక్షన్‌

Published: 22-05-2025, 4:55 PM
విలేజ్‌లో పెద్ది యాక్షన్‌

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. భారీ విలేజ్ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతిబాబులు కూడా నటిస్తున్నారు.

Key Points

1

రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది.

2

హైదరాబాద్ శివార్లలో భారీ విలేజ్ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ.

4

వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ సినిమా విడుదల కానుంది.

‘పెద్ది’ చిత్రం షూటింగ్ ప్రారంభం

విలేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పెద్ది. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం‘పెద్ది’. ఈ మల్టీస్పోర్ట్స్‌ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌  కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రోడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా నేతృత్వంలో హైదరాబాద్‌ శివార్లలో ఓ భారీ విలేజ్‌ సెట్‌ని ‘పెద్ది’ సినిమా కోసం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ సెట్‌లోనే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్, కొంత టాకీ పార్ట్‌ చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు మేకర్స్‌. గురువారం హనుమాన్‌ జయంతి సందర్భంగా ఈ  సినిమా వర్కింగ్‌ స్టిల్స్‌ను ‘ఇన్‌ స్టా’లో షేర్‌ చేశారు రామ్‌చరణ్‌. ‘‘ఇప్పటికే 30 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ షెడ్యూల్‌తో కీలక దశకు చేరుకుంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ విడుదల కానుంది.

భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

నటీనటుల వివరాలు మరియు విడుదల తేదీ

‘పెద్ది’ చిత్రం షూటింగ్ కీలక దశకు చేరుకుంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.