|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అదే జరిగింది, హరిత హరీష్ అవుట్.. ఆమెలో నన్ను నేను చూసుకున్నా, హౌస్ లో నటించేది అతడే

Published: 05-10-2025, 7:24 PM
అదే జరిగింది, హరిత హరీష్ అవుట్.. ఆమెలో నన్ను నేను చూసుకున్నా, హౌస్ లో నటించేది అతడే

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుండి హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ తర్వాత హరీష్ తన అనుభవాలను పంచుకుంటూ, హౌస్ లో కొందరు సభ్యులు నటిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతని నిష్క్రమణ, ఆసక్తికర వ్యాఖ్యల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుండి హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు.

2

నాగార్జున నిర్వహించిన ఫన్నీ గేమ్స్, ఎలిమినేషన్ ప్రక్రియ సందడిగా సాగింది.

4

ఒక సభ్యురాలిలో తనను తాను చూసుకున్నట్లు హరిత హరీష్ వెల్లడించారు.

ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది?

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో సండే ఎపిసోడ్ సందడిగా సాగింది. ఏసియా నెట్ ముందే చెప్పినట్లుగా హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయ్యాక హరిత హరీష్ ఏం మాట్లాడారో వివరాల్లో తెలుసుకుందాం. సండే కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్స్ ఆడించారు. కొందరి సభ్యులని జంటలుగా పిలిచి గేమ్స్ ఆడించారు. వినోదం తక్కువగా అందిస్తున్న వారితో వినోదభరిత గేమ్స్ ఆడించారు. టాస్క్ లలో స్మార్ట్ గా ఆలోచించని వారితో మెదడుకు మేత పెట్టే గేమ్స్ ఆడించారు.

ఈవారం నామినేషన్స్ లో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజన, శ్రీజ, దివ్య, హరిత హరీష్ ఉన్నారు. వారందరికీ నాగార్జున స్లేట్ లు ఇచ్చి సేఫ్ అని రాయించారు. డస్టర్ తో చెరిపివేయమని చెప్పారు. సేఫ్ అనేది చెరిగిపోకుండా ఉంటే వాళ్ళు సేఫ్. ఆ విధంగా ఫ్లోరా షైనీ, సంజన సేఫ్ అయ్యారు. ఒక్కొక్క రౌండ్ లో కొందరు సేఫ్ అవుతూ వచ్చారు. చివరికి శ్రీజ, హరిత హరీష్, దివ్య మిగిలారు. ఇంతలో నాగార్జున మరికొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించారు.

హరిత హరీష్ సంచలన వ్యాఖ్యలు

కొందరు నటీనటుల కళ్ళు మాత్రమే చూపించారు. కళ్ళు చూసి వాళ్లెవరో గుర్తు పట్టాలి. తప్పు చెబితే షర్ట్ లోపల ఐస్ వేయించుకోవాలి. ఆ విధంగా భరణి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, సుమన్ శెట్టి పాల్గొన్నారు. ఈ గేమ్ లో ఇమ్మాన్యుయేల్ బాగా నవ్వించాడు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ మళ్ళీ ప్రారంభం అయింది. హరిత హరీష్, శ్రీజ, దివ్య లకు పోప్ డబ్బాలు ఇచ్చారు. అందరూ ఆ బాక్స్ లు ఓపెన్ చేయగా శ్రీజకి సేఫ్ అని వచ్చింది. దీనితో ఆమె సేవ్ అయింది.

ఇక మిగిలింది దివ్య, హరిత హరీష్ మాత్రమే. నాగార్జున వారిద్దరినీ యాక్టివిటీ ఏరియాకి పిలిచారు. వారి వెనుక కొన్ని బాక్స్ లు ఉన్నాయి. వాటి లోపల సేఫ్, ఎలిమినేట్ అని రాసి ఉంటుంది. ఆ బాక్స్ లని బ్రేక్ చేయగా దివ్యకి సేఫ్ అని వచ్చింది. దీనితో హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు.

హౌస్ లో నటిస్తున్నది ఎవరు?

నాగార్జున హరిత హరీష్ ని వేదికపైకి పిలిచారు. అతడి బిగ్ బాస్ జర్నీ చూపించారు. నాగార్జున హరీష్ కి ఒక టాస్క్ ఇచ్చారు. వేదికపై బ్లాక్ మాస్క్, వైట్ మాస్క్ ఉంటాయి. హౌస్ లో ముసుగు పెట్టుకుని నటిస్తున్న ముగ్గురి ఫోటోలు బ్లాక్ మాస్క్ దగ్గర పెట్టాలి. జెన్యూన్ గా ఉన్న ముగ్గురి ఫోటోలు వైట్ మాస్క్ దగ్గర పెట్టాలి అని నాగార్జున తెలిపారు. దీనితో హరీష్.. భరణి, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్ ఫోటోలని బ్లాక్ మాస్క్ దగ్గర పెట్టారు. భరణి హౌస్ లో రేలంగి మావయ్య లాగా నటిస్తున్నారు అని ఆయన నిజస్వరూపం తనకి మాత్రమే తెలుసు అని హరీష్ తెలిపారు. ఇమ్మాన్యుయేల్ అందరితూ మంచిగా ఉంటున్నట్లు నటిస్తున్నారు. కానీ అది ఆయన అసలు రూపం కాదు. ఇక డిమాన్ పవన్ విషయానికి వస్తే అతడికి మంచి పొటెన్షియల్ ఉంది.. కానీ దానిని దాచిపెట్టి హౌస్ లో ఉంటున్నాడు అని అన్నారు. ఇక హౌస్ లో శ్రీజ, కళ్యాణ్, తనూజ జెన్యూన్ గా ఉంటున్నారని హరీష్ ప్రశంసించారు. తనూజలో తనని తాను చూసుకుంటున్నానని హరీష్ అన్నారు. మా ఇద్దరికీ వెంటనే కోపం వస్తుంది, కానీ ఆ కోపానికి కారణం ఉంటుంది అని హరీష్ తెలిపారు.

హరిత హరీష్ నిష్క్రమణ బిగ్ బాస్ హౌస్ లో చర్చనీయాంశంగా మారింది. అతను చేసిన వ్యాఖ్యలు బయట కూడా అభిమానులలో ఉత్సుకతను రేకెత్తించాయి. అతని ఎలిమినేషన్ తో ఆట మరింత రసవత్తరంగా మారనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.