|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్‌లో హారిస్ జయరాజ్ మ్యూజిక్ సునామీ! ఎప్పుడంటే?

Published: 11-04-2026, 7:05 AM
హైదరాబాద్‌లో హారిస్ జయరాజ్ మ్యూజిక్ సునామీ! ఎప్పుడంటే?
  • హైదరాబాద్‌లో ఏప్రిల్ 26న హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్.
  • 25 ఏళ్ల సంగీత ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా కాన్సర్ట్.
  • కార్తీక్, సైంధవి, విజయ్ ప్రకాష్ వంటి 13 మంది గాయకులు పాల్గొననున్నారు.
  • ఆరెంజ్, ఘర్షణ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ తన 25 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎందరో ప్రముఖ గాయకులు పాల్గొననున్నారు. ఏప్రిల్ 26న ఈ వేడుక జరగనుంది.

హారిస్ జయరాజ్ కాన్సర్ట్ వివరాలు

Harris Jayaraj:సినిమాల ద్వారా అద్భుతమైన మ్యూజిక్ ను అందిస్తూ.. తమలోని టాలెంట్ ను పరిచయం చేస్తూ.. సంగీత శ్రోతలను అలరిస్తున్న ఎంతోమంది సంగీత దర్శకులు ఇప్పుడు నేరుగా ప్రజలలోకి వచ్చేస్తున్నారు. లైవ్ కాన్సర్ట్ పేరిట షో నిర్వహిస్తూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నా.. వీరు ఆలపించే పాటలతో సంగీత ప్రియులు హోరెత్తిపోతున్నారు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎం.ఎం.కీరవాణి, ఎస్. ఎస్. తమన్, ఏ.ఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులు ఇలా లైవ్ కాన్సర్ట్ నిర్వహించి మంచి పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు మరొకసారి సంగీతప్రియులను అలరించడానికి మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రంగంలోకి దిగిపోయారు. ఆయన ఎవరో కాదు హారిస్ జయరాజ్.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ లైవ్ కాన్సర్ట్ ఆయన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నేతృత్వంలో జరగనున్న ఈ భారీ లైవ్ కాన్సర్ట్ హైదరాబాద్ వేదికగా బౌల్డర్ హిల్స్ లో ఏప్రిల్ 26వ తేదీన సాయంత్రం 5:00 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హారిస్ జయరాజ్ అలాగే సింగర్ కారుణ్య ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రత్యేక ఆకర్షణలు

ఈ సందర్భంగా హైదరాబాదులో చాలా కాలం తర్వాత లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తుండడంపై సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మాట్లాడుతూ.. “రామ్ చరణ్ , జెనీలియా కాంబినేషన్లో వచ్చిన ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ సమయంలో తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరణ, అపారమైన ప్రేమ, స్పందన చూసి ఆశ్చర్యపోయాను. అదే ఉత్సాహంతో ఈ ప్రత్యేక ప్రదర్శనను కూడా ప్లాన్ చేశాను. దీనికి మీరందరూ మద్దతు పలుకుతారని భావిస్తున్నాను” అంటూ తెలిపారు. ముఖ్యంగా ఆరెంజ్ , ఘర్షణ, వాసు చిత్రాలలోని ఎవర్ గ్రీన్ పాటలు ఈ లైవ్ కాన్సర్ట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే సుమారుగా 13 మందికి పైగా గాయని గాయకులు ఇందులో పాల్గొంటున్నారు. ఇక ఆ 13 మందిలో ప్రముఖ సింగర్ సైంధవి, కార్తీక్, నరేష్ అయ్యర్, విజయ్ ప్రకాష్, క్రిష్, కారుణ్య, హరిప్రియ, నికోలస్ హారిస్, రంజిత్ వంటి దిగ్గజ గాయని గాయకులు పాల్గొనబోతున్నారు. అలాగే లైవ్ ఆర్కెస్ట్రా నిర్వహించనున్నారు. వీరంతా తాము పాడిన ఒరిజినల్ సాంగ్స్ ని ఈ వేదికపై ప్రత్యక్షంగా పాడబోతున్నారు. ఇంతమంది దిగ్గజ గాయనీ గాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడం అలాగే వేల పాటల నుంచి కొన్నిటిని ఎంపిక చేయడం సవాలుతో కూడుకున్న పని అంటూ ఆయన తెలిపారు..

సంగీత ప్రియులకు పండుగ

Xora Club ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సంగీత కార్యక్రమం హైదరాబాదు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నిర్వాహకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జయరాజ్ లైవ్ కాన్సర్ట్ మరింత సక్సెస్ అవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ లైవ్ కాన్సర్ట్ టికెట్లు District.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి

హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌తో హైదరాబాద్ సంగీత ప్రియులకు ఒక మరపురాని అనుభూతి కలగనుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన ఇక్కడ ప్రదర్శన ఇవ్వనుండడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.