|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆరోగ్యమా? ఫిట్‌నెసా? ఈ రెండింటి మధ్య అసలు రహస్యం ఏమిటి? వైద్య నిపుణుల సంచలన విషయాలు!

Published: 11-04-2026, 8:05 AM
ఆరోగ్యమా? ఫిట్‌నెసా? ఈ రెండింటి మధ్య అసలు రహస్యం ఏమిటి? వైద్య నిపుణుల సంచలన విషయాలు!
  • ఆరోగ్యంగా ఉండటం అంటే కేవలం రోగాలు లేకపోవడం మాత్రమే కాదు.
  • ఫిట్‌నెస్ అనేది శారీరక సామర్థ్యం, బలం, ఓర్పుపై ఆధారపడి ఉంటుంది.
  • అతిగా వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
  • శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా ఉంటే ఫిట్‌గా కనిపించకపోయినా ఆరోగ్యవంతులే.

చాలామంది ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నామని చెబుతుంటారు. అయితే, ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఒకటేనా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను ప్రముఖ వైద్యుడు సీమా ధీర్ వివరించారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆరోగ్యం అంటే ఏమిటి?

నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను…ఫిట్ గా ఉంటాను అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండటం, ఫిట్‌గా ఉండటం ఒకటే కాదంట..! చాలామంది ఈ తేడాను గుర్తించకుండా ఒకేలా వాడుతుంటారు. చాలామందికి ఆరోగ్యంగా ఉండటం, ఫిట్‌గా ఉండటం ఒకటే అనిపిస్తుంది.. కానీ అది నిజం కాదని ప్రముఖ్య వైద్యుడు డాక్టర్ సీమా ధీర్ చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో అందం, శరీరాకృతిపై ఉన్న శ్రద్ధ ఆరోగ్యంపై ఉండటం లేదనేది నిపుణుల మాట. ఒక వ్యక్తి జిమ్‌కు వెళ్లి కండలు పెంచినంత మాత్రాన వారు పూర్తి ఆరోగ్యవంతులు అని చెప్పలేం. అలాగే ఒక వ్యక్తి సన్నగా ఉన్నంత మాత్రాన వారు అన్-ఫిట్ అని కూడా అనలేం. అసలు ‘ హెల్త్ ‘ అంటే ఏమిటి,,,? ‘ఫిట్‌నెస్’ అంటే ఏమిటి…? ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్గావ్‌లోని ఆర్టెమిస్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సీమా ధీర్ వివరించారు.

డాక్టర్ సీమా ధీర్ ప్రకారం …. “ఆరోగ్యం” అనేది ఒక స్థితి, ఫిట్‌నెస్ అనేది మనం చేసే పనిని సూచిస్తుంది. ఆరోగ్యం అంటే కేవలం రోగాలు లేకపోవడం మాత్రమే కాదు. ఇది శరీరం, మనస్సు, సామాజికంగా మనం ఎంత హాయిగా ఉన్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారంటే.. వారి శరీర అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయని అర్థం. రోగనిరోధక శక్తి బలంగా ఉందని, హార్మోన్లు సమతుల్యంగా ఉన్నాయని భావిస్తాం. మానసిక ప్రశాంతతతో పాటు మంచి నిద్ర పడుతుందని అర్థం. ఉదాహరణకు.. ఒక వ్యక్తి భారీ వ్యాయామాలు చేయకపోయినా, సరైన ఆహారం తీసుకుంటూ, ఒత్తిడిని జయిస్తూ, హాయిగా నిద్రపోతుంటే వారు కూడా ఆరోగ్యవంతులే అవుతారు.

ఫిట్‌నెస్ అంటే ఏమిటి?

ఫిట్‌నెస్ అనేది శారీరక పనులను ఎంత సమర్థవంతంగా చేయగలరు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో బలం, ఓర్పు, ఫ్లెక్సిబిల్టీ,సామర్థ్యం వంటివి ఉంటాయి. అథ్లెట్లు లేదా బాడీబిల్డర్లు చాలా ఫిట్‌గా ఉండవచ్చు. ఎందుకంటే వారు కఠినమైన శారీరక పనులను సులభంగా చేయగలరు. కానీ వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది వారి అంతర్గత వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది.

ఖచ్చితంగా కాదు… ఫిట్‌నెస్ కోసం చాలామంది అతిగా వ్యాయామాలు చేయడం , కఠినమైన డైట్లు పాటించడంతో పాటు కొన్ని రకాల సప్లిమెంట్లు వాడటం చేస్తుంటారు. ఇది బయటకి ఫిట్‌గా కనిపించేలా చేసినా…. లోపల అవయవాలపై ఒత్తిడి పెంచి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక వ్యక్తి బయటకి ఫిట్‌గా కనిపించకపోయినా…. వారి శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా ఉంటే వారు ఆరోగ్యవంతులే అవుతారు.

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు మధ్య వ్యత్యాసం

“ఆరోగ్యంలో ఫిట్‌నెస్ అనేది ఒక భాగం మాత్రమే. అదే సర్వస్వం కాదు. నిజమైన ఆరోగ్యం కావాలంటే శరీరాన్ని లోపలి నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి” అని డాక్టర్ ధీర్ సూచించారు. అందుకే కేవలం ఫిట్‌నెస్ వెనుక పరుగులు తీయకుండా… దీర్ఘకాలిక శ్రేయస్సును ఇచ్చే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

కాబట్టి, ఆరోగ్యం, ఫిట్‌నెస్ రెండింటికీ ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. సరైన జీవనశైలితో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటం ఉత్తమం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.