|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని పాన్ ఇండియా మూవీలో హెబ్బా పటేల్ రచ్చ! ఆ ఐటెం సాంగ్ నిజమేనా?

Published: 29-12-2025, 9:05 AM
నాని పాన్ ఇండియా మూవీలో హెబ్బా పటేల్ రచ్చ! ఆ ఐటెం సాంగ్ నిజమేనా?
  • హెబ్బా పటేల్ కు పాన్ ఇండియా హీరో మూవీలో ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు.
  • నాని హీరోగా చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఐటెం సాంగ్ అవకాశం.
  • ఈ ఐటెం సాంగ్ కోసం మొదట తమన్నా, ఆ తర్వాత పూజా హెగ్డే పేర్లు పరిశీలించారు.
  • ప్రస్తుతం హెబ్బా పటేల్ ను సంప్రదించేందుకు చిత్ర బృందం సిద్ధమైందట.

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ కెరీర్ లో ఓ బంపర్ ఆఫర్ వచ్చిందనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ లో ఓ ఐటెం సాంగ్ కోసం హెబ్బాను సంప్రదించారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హెబ్బా పటేల్ కెరీర్ లో కీలక మలుపు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయి, ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అలాంటి హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెరీర్లో అనేక రకాల డిఫరెంట్ కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఓదెల అనే విభిన్న కాన్సెప్ట్ సినిమాతో కూడా ఇరగదీసింది.

అయితే అలాంటి హెబ్బా పటేల్ కు తాజాగా ఓ బంపర్ ఆఫర్ తగిలినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. హీరో నాని చేస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో హెబ్బా పటేల్ కు అవకాశం వచ్చిందట. ఈ మూవీలో ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ వేటలో చిత్ర బృందం పడింది. మొదట తమన్నాను అనుకున్నారు. ఆ తర్వాత పూజా హెగ్డే పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీలో ఐటెం సాంగ్ చేసేందుకు హెబ్బా పటేల్ అను సంప్రదించేందుకు చిత్ర బృందం సిద్ధమైందట. హెబ్బా పటేల్ ఈ ఆఫర్ కు ఓకే చెబితే అధికారిక ప్రకటన రానుందట.

నాని సినిమాలో బంపర్ ఆఫర్ వివరాలు

ఐటెం సాంగ్ కోసం మొదట ఎవరిని అనుకున్నారు?

హెబ్బా పటేల్ ఈ ఆఫర్ కు ఓకే చెబితే, ఆమె కెరీర్ కు పెద్ద మలుపు అవుతుందని చెప్పొచ్చు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. అధికారిక ప్రకటన కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.