|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సింగర్‌తో హీరో డేటింగ్.. కుట్ర చేసి నా ఇంట్లోంచి నన్ను వెళ్లగొట్టారంటూ భార్య సంచలన పోస్ట్

Published: 09-05-2025, 12:15 PM
సింగర్‌తో హీరో డేటింగ్.. కుట్ర చేసి నా ఇంట్లోంచి నన్ను వెళ్లగొట్టారంటూ భార్య సంచలన పోస్ట్

కోలీవుడ్ నటుడు రవి మోహన్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన భార్య ఆర్తి, రవి మోహన్ సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తో డేటింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ సంచలన పోస్ట్ చేసింది. ఆమె తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని కూడా ఆరోపించింది.

Key Points

1

రవి మోహన్ భార్య ఆర్తి విడాకులపై సంచలన పోస్ట్ చేసింది.

2

రవి మోహన్ మరియు కెనిషా ఫ్రాన్సిస్ డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి.

4

ఈ విషయంపై కోర్టులో కేసు కొనసాగుతోంది.

రవి మోహన్ భార్య ఆరోపణలు

కోలీవుడ్ స్టార్ రవి మోమన్(Ravi mohan) వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ‘థగ్‌లైఫ్’(Thuglife) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక గతంలో ఆయన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. కానీ తన భార్య మాత్రం నాకు తెలియకుండా ఎలా డైవర్స్ ఇస్తారంటూ పలు పోస్టులతో సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వీరి కేసు కోర్ట్‌లో కొనసాగుతోంది. ఈక్రమంలో.. జయంరవి సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో ఓ పెళ్లికి హాజరయ్యాడు. వీరిద్దరు భార్యాభర్తల్లా ఓకే చోట కూర్చోవడంతో డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. ఇక అందులో ఈ జంట ఓకే కలర్ దుస్తుల్లో కనిపించడంతో పాటు చాలా సన్నిహితంగా కనిపించడంతో డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది.ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

కెనిషా ఫ్రాన్సిస్ తో డేటింగ్?

ఈ నేపథ్యంలో.. తాజాగా, రవి మోహన్, కెనిషా(Kenisha Francis) డేటింగ్‌పై హీరో భార్య ఆర్తి(aarti.ravi) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ఈ మేరకు ఓ సంచలన పోస్ట్ పెట్టింది. ‘‘ఏడాది పాటు నేను మౌనంగా ఎంతో బాధను మేశాను. బలహీనంగా ఉన్నానని కాదు.. నా కొడుకులుకు శాంతి అవసరం కాబట్టి ఏ విషయాలు చెప్పలేదు. ఆరోపణలు, క్రూరమైన గుసగుసలను నేను విన్నాను. తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలకు నా పిల్లలు బాధను మోయకూడదని నేను కోరుకున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో ఓ ఫోటో చూశాక వాస్తవం చెప్పాలని అనిపించింది. నా విడాకులు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ నేను ఒకప్పుడు 18సంవత్సరాలపాటు నా పక్కన ఉన్న వ్యక్తి నాకు దూరం అవడంతో పాటు, గౌరవిస్తానని వాగ్దానం చేసి బాధ్యతల నుంచి కూడా దూరంగా ఉన్నాడు.

కోర్టులో కేసు

నెలల తరబడి వారి ప్రపంచపు భారం నా భూజాలపైనే ఉంది. ప్రతి రాత్రి బాధను నేను భరించాను. నన్ను నా ఇంట్లోంచి గెంటేశారు. ఒకప్పుడు నాతో కలిసి ఆ ఇంటిని నిర్మించిన వ్యక్తి సూచనల మేరకు నాపై బంగారు ఆభరణాలు ఉన్నాయి. అది నిజమైతే, నేను చాలా కాలం నా వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకుంటాను. కానీ నేను లెక్కల కంటే ప్రేమను గౌరవిస్తాను. లావాదేవీలపై నమ్మకం నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. నేను నాపై ప్రేమ లేదని చింతించను.. కానీ ఆ ప్రేమ బలహీనత కాదని బలంగా నిలబడగలను. నా పిల్లలు 10, 14 సంవత్సరాలు.. వారు భద్రతకు అర్హులు. వారు చట్టపరమైన నిబంధనలు అర్థం చేసుకోవడానికి చాలా చిన్నవారు’’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

రవి మోహన్ మరియు ఆర్తి మధ్య వివాదం తీవ్రంగా మారుతోంది. కోర్టులో కేసు కొనసాగుతూ, ఈ విషయంపై మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.