
టాలీవుడ్ లో హీరో నాని ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అసిస్టెంట్ దర్శకుడు నుంచి స్టార్ హీరోగా ఎదిగిన నాని, గత ఐదు చిత్రాలతో అద్భుతమైన రూ.458 కోట్లు రాబట్టాడు. ఈ గణాంకాలతో విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రామ్ పోతినేనిలను వెనక్కి నెట్టి, ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
Key Points
హీరో నాని గత 5 చిత్రాలతో రూ.458 కోట్లు వసూలు చేశాడు.
నాని ఒక్కో సినిమాకు సగటున రూ.91 కోట్లు రాబట్టాడు.
నాని విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రామ్ పోతినేనిలను అధిగమించాడు.
నాని మినిమం గ్యారెంటీ హీరోగా నిర్మాతలకు లాభాలు తెస్తున్నాడు.
నాని కెరీర్: అసిస్టెంట్ డైరెక్టర్ నుండి స్టార్ హీరో వరకు
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అసిస్టెంట్ దర్శకుడు నుంచి స్టార్ హీరోగా ఎదిగిపోయారు నాని. హీరో నాని ఏ సినిమా చేసిన మినిమం గ్యారెంటీ ఉంటుంది. నానితో సినిమా చేసిన నిర్మాతలు గుండెలపై చేయి వేసుకొని హాయిగా నిద్రపోతారు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు హీరోల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాపడుతున్న హీరోగా నాని చరిత్ర సృష్టించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రామ్ పోతినేని సినిమాలతో పోలిస్తే హీరో నానినే పై చేయి సాధించాడట. నాని గత ఐదు సినిమాలలో మొత్తం రూ.458 కోట్లు రాబట్టినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అంటే యావరేజ్ గా ఒక్కో సినిమాకు రూ.91 కోట్లు హీరో నాని తీసుకువచ్చాడట. అదే విజయ్ దేవరకొండ తన గడిచిన ఐదు సినిమాల్లో చిత్ర బృందానికి రూ.264 కోట్లు తీసుకువచ్చాడట. నాగచైతన్య రూ.231 కోట్లు, రామ్ పోతినేని రూ.220 కోట్లు మాత్రమే తెచ్చి పెట్టాడట. అంటే ఈ లెక్కన చూస్తే అందరికంటే నానినే టాప్ లో ఉన్నాడు. దీంతో నాని పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
రూ.458 కోట్ల వసూళ్లు: ఇతర హీరోలతో పోలిస్తే
నాని టాప్: ప్రశంసల వర్షం
నాని తన గత ఐదు చిత్రాలతో రూ.458 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీలో ఆధిపత్యాన్ని చాటాడు. ఇది అతని అంకితభావం, నటనకు నిదర్శనం. భవిష్యత్తులోనూ నాని మరిన్ని విజయాలతో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని ఆశిద్దాం.


