
హీరోయిన్ శిరీష లెల్ల మరియు హీరో నారా రోహిత్ ప్రేమకథ సోషల్ మీడియాలో హాట్ టాపిక్. తాజాగా వారు ఆస్ట్రేలియాలో గడిపిన సమయం ఫోటోలు వైరల్‌గా మారాయి. వారి ప్రేమను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.
Key Points
నారా రోహిత్‌తో శిరీష లెల్ల నిశ్చితార్థం.
ఆస్ట్రేలియా ట్రిప్‌లో సరదాగా గడుపుతున్న జంట.
నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శిరీష లెల్ల, నారా రోహిత్ ప్రేమకథ
హీరోయిన్ శిరీష లెల్ల(Shirisha Lella) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నారా రోహిత్(Nara Rohit) నటించిన ‘ప్రతినిధి-2’(Prathinidhi-2) సినిమాలో అవకాశం దక్కించుకుంది. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం టైంలోనే హీరో రోహిత్‌తో పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. అలా కొన్నాళ్లు ప్రేమించుకున్న వీరు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక ఎంగేజ్‌మెంట్ అయినప్పటినుంచి వరుస వెకెషన్స్‌కు వెళుతూ ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా ట్రిప్ ఫోటోలు వైరల్
ఈ క్రమంలో సిరిలెల్ల పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో.. ఆస్ట్రెలియాలో రోహిత్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలతో పాటు, అతను ఆమెను హగ్ చేసుకున్న పిక్‌ను కూడా పంచుకుంది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల నుండి ప్రశంసలు
A post shared by Siree Lella (@siree_lella)
శిరీష లెల్ల మరియు నారా రోహిత్ ప్రేమ జంటగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వారి ఆనందకరమైన క్షణాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


