
📌 Key Points
- బాలకృష్ణతో కలిసి పనిచేయడం అదృష్టమన్న ఇంద్రజ.
- బాలకృష్ణ హైలీ ఎనర్జిటిక్ అని తెలిపిన నటి.
- 1999 తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదన్న ఇంద్రజ.
- మలయాళంలో స్టార్ హీరోలందరితో నటించే అవకాశం వచ్చిందన్న ఇంద్రజ.
హీరో బాలకృష్ణ గురించి నటి ఇంద్రజ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె బాలకృష్ణతో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
బాలకృష్ణ గురించి ఇంద్రజ ఏం చెప్పారంటే?
టాలీవుడ్ నటి ఇంద్రజ తన కెరీర్‌లో ఎదుర్కున్న సవాళ్లు, ఆర్ధిక ఇబ్బందులను గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే హీరో బాలకృష్ణతో కలిసి పని చేసిన అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. బాలకృష్ణ హైలీ ఎనర్జిటిక్, జోవియల్, ఫ్రెండ్లీ పర్సన్ అని ఆమె తెలిపింది. ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టమని.. పెద్ద స్టార్ అయినప్పటికీ.. డౌన్ టూ ఎర్త్‌గా ఉంటారని ఇంద్రజ తెలిపింది.
కమిట్మెంట్స్ లాంటివి కేవలం ఇండస్ట్రీలో మాత్రమే ఉండదని.. ప్రతీ చోటా జరుగుతాయని నటి ఇంద్రజ తెలిపింది. ‘ఎక్కడ పని చేసినా ఒక మహిళకు.. ముఖ్యంగా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నవారికి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవి మరీ ఇబ్బందికరంగా మారినప్పుడు తప్ప’ అని ఆమె స్పష్టం చేసింది.
కెరీర్ తొలినాళ్లలో ఇంద్రజ ఎదుర్కొన్న సవాళ్లు
1999 తర్వాత తెలుగులో తనకు మంచి ఆఫర్లు రాలేదని.. చిన్న బడ్జెట్ సినిమాలకే పరిమితం కావాల్సి వచ్చిందని ఇంద్రజ గుర్తు చేసుకుంది. అప్పట్లో మంచి సినిమాలు రాకపోయినా.. తాను రిగ్రెట్ అవ్వలేదని, ఎందుకంటే తాను ఎవరినీ అప్రోచ్ కాలేదని.. పెద్దగా కాంటాక్ట్స్ కూడా లేవని ఆమె చెప్పింది.
అయితే 1999-2000 మధ్య కాలంలో వ్యక్తిగతంగా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇంద్రజ వెల్లడించింది. తన తల్లి ఓ కార్డియాక్ పేషెంట్, హార్ట్‌లో వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది. కుటుంబం మొత్తం ఆర్థికంగా తనపై ఆధారపడటంతో, తాను బాధపడుతూ కూర్చోలేదని, ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నానని వివరించింది. అదే సమయంలో, ‘సొగసు చూడతరమా’ చిత్రాన్ని పనామా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చూసిన మలయాళ దర్శకుడు సిబి మలయిల్ తనను సంప్రదించారని తెలిపింది.
మలయాళంలో స్టార్ హీరోయిన్ గా ఇంద్రజ
మలయాళ ఇండస్ట్రీకి వెళ్లాలని తాను ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదని.. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని ఇంద్రజ తెలిపింది. మొదట మమ్ముట్టితో ‘గాడ్ మ్యాన్’ చిత్రంలో, ఆ తర్వాత మోహన్‌లాల్‌తో ‘ఉస్తాద్’లో, సురేష్ గోపితో షాజీ కైలాష్ దర్శకత్వంలో ‘ఎఫ్.ఐ.ఆర్’ చిత్రంలో నటించినట్లు చెప్పింది. మలయాళంలోని స్టార్ హీరోలందరితో కలిసి పనిచేసే అవకాశం లభించిందని, ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంది.
ఇంద్రజ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

