
📌 Key Points
- సుడిగాలి సుధీర్ ‘గోట్’ సినిమాపై వివాదం కొనసాగుతోంది.
- హీరోయిన్ దివ్య భారతిని సుధీర్ అవమానించారని ఆమె ఆరోపణ.
- చిలుకా అని దర్శకుడు సంబోధించినా సుధీర్ స్పందించకపోవడమే కారణం.
- తన ఆత్మాభిమానం దెబ్బతిందని, అందుకే బహిరంగంగా స్పందించాల్సి వచ్చిందని దివ్య భారతి.
సుడిగాలి సుధీర్ నటిస్తున్న ‘గోట్’ సినిమా ప్రారంభం నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ దివ్య భారతి షాకింగ్ కామెంట్స్ చేసింది. సుధీర్ తనను అవమానించారని, చాలా బాధపడ్డానని ఆమె వెల్లడించింది.
‘గోట్’ సినిమా చుట్టూ వివాదాలు
ఓ వైపు యాంకర్‌గా వ్యవహరిస్తూనే సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) ‘గోట్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో తమిళ నటి దివ్య భారతి(Divya Bharati) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ మొదలైన కానుంచి వివాదాలు చుట్టుముట్టాయి. దక్శకుడు, హీరోయిన్ మధ్య వివాదం తలెత్తడంతో మధ్యలో ఈ సినిమాకు పలు అడ్డంకులు వచ్చాయి. హీరోయిన్‌ను పట్టుకుని చిలుకా అనడంతో అసలు విషయం మొదలైంది. దీంతో ఆ దర్శకుడిని ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించినప్పటికీ సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయినప్పటికీ మూవీ మేకర్స్ షూట్ పూర్తి చేసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, ‘గోట్’ టీజర్ లాంచ్ చేయగా.. సుధీర్, దర్శకుడు మాత్రం డుమ్మా కొట్టారు. ఇక ఇందులో పాల్గొన్న దివ్యభారతి.. సుధీర్ తనను అవమానించాడని ఆవేదన వ్యక్తం చేసింది.
దివ్య భారతి ఆవేదన: సుధీర్ టార్గెట్ చేశారా?
‘‘నన్ను ఇర్రిటేట్ చేయడానికి సుధీర్ చేయబోయే సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందని ఓ డైరెక్టర్ ద్వారా సంప్రదించారు. అలా అడగడం తప్పు కాదు. కానీ సమస్య ఉన్నప్పుడు మాట్లాడకుండా కావాలనే నన్ను టార్గెట్ చేశారు. డైరెక్టర్ నన్ను చిలుకా అని అసభ్యంగా మాట్లాడినప్పటికీ ఈ విషయం సుధీర్ స్పందించకపోవడంతోనే ఆయన పేరును మెన్షన్ చేశాను. ఇది సుధీర్ గారి సినిమా. ఆయన కూడా ఇందులో పని చేశారు. ఆయన మీ ఫ్రెండ్ అని కొందరు.. ట్విట్టర్‌లో నాపై పోస్టులు చేస్తే కూడా స్పందించలేదు. ప్రొడ్యూసర్ తో ఇబ్బంది ఉంటే.. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ, నన్ను ఇన్వాల్ చేయడం సరికాదు. అందుకే నేను ఆయన పేరును ప్రస్తావించాను.
దర్శకుడి వ్యాఖ్యలు, హీరోయిన్ స్పందన
అంతే కానీ, ఆయన నాకు హెల్ప్ చేస్తాడనో, లేదా ఆయనతో నాకు వ్యక్తిగత సమస్య ఉందనో కాదు. అందరూ కలిసి నన్ను అవమానించారు. చిలుకా అంటూ నెగిటివ్‌గా మాట్లాడారు. నాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. నన్ను అవమానకరంగా చిత్రీకరించారు. దీంతో నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం స్పందించి పోస్ట్ పెట్టాల్సి వచ్చింది. ఆ ట్వీట్ గురించి టీమ్ మొత్తంలో ఎవరూ కూడా అడగలేదు. చాలా బాధపడ్డాను. దర్శకుడు నరేష్ కుప్పిలి.. నన్ను ఎంత అందంగా చూపిద్దాం అనుకున్నా అందంగా కనిపించడం లేదని అన్నారు. అది అతని అభిప్రాయం కావచ్చు కానీ అందరి ముందు ఆయన అలా అనడం నాకు నచ్చలేదు’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా విడుదల వరకూ ఈ వివాదం కొనసాగేలా కనిపిస్తోంది.
సుడిగాలి సుధీర్, దివ్య భారతి మధ్య కొనసాగుతున్న ఈ వివాదం ‘గోట్’ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఘర్షణ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, వివాదం ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.


