|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: సుహాస్ ‘హే బల్వంత్’ ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్! ఇది ఎలా సాధ్యం?

Published: 26-02-2026, 12:05 PM
షాకింగ్: సుహాస్ 'హే బల్వంత్' ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్! ఇది ఎలా సాధ్యం?
  • సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన చిత్రం ‘హే బల్వంత్’.
  • ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందని మేకర్స్ తెలిపారు.
  • నిర్మాత బి. నరేంద్ర రెడ్డి తమ బ్యానర్‌కు ఇది తొలి సక్సెస్ అని అన్నారు.
  • సినిమా అన్ని రైట్స్ కలిపి రూ. 10 కోట్లు రాబట్టినట్లుగా మేకర్స్ తెలిపారు.

సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన చిత్రం ‘హే బల్వంత్’. ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

‘హే బల్వంత్’ మూవీ బ్రేక్ ఈవెన్

Hey Balwanth: సుహాస్‌ (Suhas), శివానీ నాగారం (Shivani Nagaram) జంటగా నటించిన చిత్రం ‘హే బల్వంత్’ (Hey Balwanth). గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్‌, వంశీ నందిపాటిల ద్వయం తమ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20)న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించినట్లుగా తెలుపుతూ మేకర్స్.. వినూత్నంగా థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. సుహాస్, శివానీ నాగారంతో లో బడ్జెట్‌లోనే ఈ సినిమా పూర్తై ఉంటుంది. సినిమా టాక్ అయితే ఏమంత గొప్పగా లేదు కదా.., బ్రేక్ ఈవెన్ ఎలా అయిందా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే,

నిర్మాతల సక్సెస్ మీట్

సంక్రాంతికి వచ్చిన సినిమాలను చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు వచ్చారు. ఆ తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్‌ని పలకరించాయి. కానీ, ఏవీ అంతగా కలెక్షన్స్ రాబట్టలేదు. అలాంటిది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎలా అయిందా? అని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్రేక్ ఈవెన్ అయ్యింది కాబట్టే కదా.. ఖర్చు పెట్టి మరీ ఫంక్షన్ చేశారు అని కొందరు వారికి కౌంటర్స్ ఇస్తున్నారు. ఏదిఏమైతేనేం సుహాస్ పరాజయాలకు ‘హే బల్వంత్’ బ్రేక్ వేశాడనే చెప్పుకోవాలి. మొత్తంగా ఈ సినిమా అన్ని రైట్స్ కలిపి రూ. 10 కోట్లు రాబట్టినట్లుగా మేకర్స్ ఈ వేడుకలో తెలిపారు. ఆ లెక్కన చూస్తే, భారీగా రాబట్టినట్లే భావించాలి. అందుకే, ఇలాంటి వేడుక ఒకటి చేయవచ్చిన మేకర్స్ భావించి ఉంటారని అంతా అనుకుంటున్నారు.

సినిమా కలెక్షన్ల వివరాలు

ఇక ఈ వేడుకలో నిర్మాత బి. నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. మా బ్యానర్‌‌కు వచ్చిన తొలి సక్సెస్‌ ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో సంతృప్తి చెందారు. ఓ మంచి సినిమా తీశానని అభినందిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని థియేటర్స్‌కి వెళ్లి నేను కూడా ఆడియన్స్ మధ్యలో సినిమా చూశాను. సినిమాను అందరూ ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు. నాకు ఈ సినిమా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఓ మంచి సినిమా తీశాననే భావన కలిగింది. తప్పకుండా సినిమా చూడని వాళ్లు అందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సక్సెస్‌కు కారణమైన అందరికీ కృతజ్ఞతలని అన్నారు దర్శకుడు గోపీ అచ్చర. ఇంకా హీరో సుహాస్, హీరోయిన్ శివానీ నాగారం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, నిర్మాతలకు, దర్శకుడికి, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

మొత్తానికి సుహాస్ నటించిన ‘హే బల్వంత్’ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. తక్కువ సమయంలోనే సినిమా మంచి విజయాన్ని అందుకోవడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.