|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హే బలవంత్ మూవీ కలెక్షన్ల విధ్వంసం! సుహాస్‌కు బ్లాక్ బస్టర్ హిట్ పక్కా!

Published: 21-02-2026, 7:35 AM
హే బలవంత్ మూవీ కలెక్షన్ల విధ్వంసం! సుహాస్‌కు బ్లాక్ బస్టర్ హిట్ పక్కా!
  • సుహాస్‌, శివానీ జంటగా `హే బలవంత్‌` మూవీ విడుదల, ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్!
  • తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 2.14 కోట్ల అదిరిపోయే వసూళ్లు సాధించిన ‘హే బలవంత్’!
  • కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ జీ5 సొంతం చేసుకుంది.
  • ప్రాస్టిట్యూషన్ పై అవగాహన కల్పిస్తూ, నవ్విస్తూ, ఆలోచింపజేసే చిత్రమిది!

సుహాస్ హీరోగా నటించిన `హే బలవంత్‌` మూవీ విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు కలెక్షన్ల రిపోర్ట్ చూస్తే షాక్ అవుతారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా?

ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ

సుహాస్‌ హీరోగా, శివానీ నగరం హీరోయిన్‌గా నటించిన చిత్రం `హే బలవంత్‌`. గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీకే నరేష్‌, సుదర్శన్‌, వెన్నెల కిశోర్‌, అజయ్‌ ఘోష్‌, యాంకర్‌ స్రవంతి, హర్షవర్థన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. బీ నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని వంశీ నందిపాటి రిలీజ్‌ చేశారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. మంచి రివ్యూస్‌ వచ్చాయి.

ఇక థియేట్రికల్‌గానూ ఈ మూవీ సత్తా చాటుతోంది. ఫస్ట్ డే మంచి వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రానికి మొదటి రోజు కలెక్షన్ల రిపోర్ట్‌ వచ్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.2.14కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ విషయాన్ని టీమ్‌ వెల్లడించింది. చిత్ర బృందం ఈ స్థాయిలో వసూళ్లని అంచనా వేయలేదు. వారు ఊహించిన దానికంటే ఎక్కువగానే వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి ఈ వసూళ్లు వచ్చాయి.

డిజిటల్ రైట్స్ కొన్న జీ5

మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఈ వసూళ్లు పెరిగే అవకాశం ఉందట. టీమ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. రెండో రోజు మరింత స్ట్రాంగ్‌గా ఉందని తెలిపింది. ఇదే జరిగితే ఈ మూవీకి నెమ్మదిగా పుంజుకోబోతుందని చెప్పొచ్చు. శనివారం, ఆదివారం కలెక్షన్లు పెరిగితే మొదటి వీకెండ్‌లోనే బ్రేక్‌ ఈవెన్‌లో సగం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి ఎనిమిది కోట్ల బిజినెస్‌ అయ్యిందని సమాచారం. అంటే సుమారు రూ.15-16కోట్ల గ్రాస్‌ వస్తే సినిమా సేఫ్‌ అని చెప్పొచ్చు. ఆ టార్గెట్‌ పెద్దదే, కానీ ఇదే జోరు చూస్తుంటే, దాన్ని రీచ్‌ కావడం పెద్ద కష్టమేమీ కాదని టాక్‌.

కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా

కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం డిజిటల్‌ రైట్స్ కూడా బాగానే అమ్ముడుపోయినట్టు సమాచారం. జీ5 ఈ రైట్స్ ని దక్కించుకుంది. శాటిలైట్‌ రైట్స్ కూడా అదే సొంతం చేసుకుంది. ఈ మూవీని వంశీనందిపాటి విడుదల చేసిన విషయం తెలిసిందే. కంటెంట్‌పై నమ్మకంతో దీన్ని ఆయన విడుదల చేసేందుకు ముందుకు వచ్చినట్టు టాక్‌. ఇక ఈ మూవీ ఆద్యంతం కామెడీగా సాగుతూనే చివర్లో ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. ప్రాస్టిట్యూషన్‌ తప్పు కాదని, అలా చేసేవారి జీవితంలోని పెయిన్‌ని, వారి గొప్పతనాన్ని తెలియజేసే మూవీ ఇది.. నవ్విస్తూ, గుండెని బరువెక్కించింది.

`హే బలవంత్` మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. సుహాస్ కెరీర్లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.