|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

HHVM: తెలంగాణ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్

Published: 30-06-2025, 12:51 PM
HHVM: తెలంగాణ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్ర బృందం తెలంగాణలోని అభిమానులకు శుభవార్త చెప్పింది. ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించి, థియేటర్ల జాబితాను విడుదల చేసింది.

Key Points

1

హరిహర వీరమల్లు ట్రైలర్ జులై 3న విడుదల.

2

తెలంగాణలోని అనేక థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శన.

4

పవన్ కల్యాణ్ చారిత్రక యోధుడిగా నటన.

ట్రైలర్ విడుదల తేదీ ప్రకటన

తెలంగాణ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రబృందం శుభవార్త చెప్పింది. ట్రైలర్ విడుదల చేయబోయే నైజాం థియేటర్ల లిస్టును విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టింది. ఇందులో ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సంధ్య థియేటర్, దిల్‌సుఖ్‌నగర్‌లోని మెగా, కూకట్‌పల్లిలోని అర్జున్, జీడిమెట్లలోని రంగా, బాలా నగర్‌లోని మైత్రీ విమల్, వనస్థలిపురంలోని సుష్మ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల థియేటర్లలో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జులై 3వ తేదీన ఉదయం 11:10 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హరిహర వీరమల్లు పార్ట్‌-1ను జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇందులో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌(Nidhi Agarwal). బాబీ డియోల్, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు.

తెలంగాణ థియేటర్ లిస్ట్

సినిమా విడుదల వివరాలు

హరిహర వీరమల్లు చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.