
హీరో నాని తన వరుస విజయాలతో సందడి చేస్తున్నాడు. తాజా చిత్రం ‘హిట్ 3’ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
Key Points
హిట్ 3 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది.
నెట్‌ఫ్లిక్స్ రూ. 54 కోట్లకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేసింది.
మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఓటీటీలో విడుదల అవకాశం.
నానికి వరుస విజయాలు, నిర్మాతగా కూడా సూపర్ హిట్
హిట్ 3: విజయవంతమైన ప్రారంభం
హీరో నాని ( Nani ) స్పీడుమీదున్నాడు. హీరోగా, నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హిట్లు అందుకుంటున్న ఈ హీరో.. నిర్మాతగా కోర్ట్ చిత్రంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్: ద థర్డ్ కేస్ మూవీ ( HIT: The Third Case ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
హిట్ 3కి పాజిటివ్ టాక్ మే1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హిట్ 1, 2 కంటే కూడా ఈ మూవీలో వయొలెన్స్ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి హిట్ 3 బాగా ఎక్కేసిందట! ఈ టాక్ చూస్తుంటే నాని బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. హిట్ 3 సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కుల కొనుగోలు
ఏ ఓటీటీలో అంటే? ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఏకంగా రూ.54 కోట్లు పెట్టి ఈ హక్కుల్ని సొంతం చేసుకుందని టాక్. థియేటర్‌లో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన మే చివరి వారం, లేదా జూన్ మొదటివారంలో హిట్ 3 ఓటీటీలో వచ్చే అవకాశాలున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రవాహం వారాల తరబడి కొనసాగితే మాత్రం ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది.
ఓటీటీ విడుదల తేదీ
హిట్ 3 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మొత్తంమీద, హిట్ 3 సినిమా నానికి మరో విజయం అనిపిస్తోంది. భారీ ధరకు ఓటీటీ హక్కులు అమ్ముడవడం దీనికి నిదర్శనం. ప్రేక్షకుల స్పందన ఆధారంగా ఓటీటీ రిలీజ్ తేదీ ఖరారు అవుతుంది.


