|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Hit 3 Ram Charan: నానికి చరణ్ ఎలివేషన్.. ట్వీట్ వైరల్

Published: 03-05-2025, 10:42 AM
Hit 3 Ram Charan: నానికి చరణ్ ఎలివేషన్.. ట్వీట్ వైరల్

నాని నటించిన ‘హిట్ 3’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై మెగాస్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. చరణ్ తన ట్వీట్ ద్వారా నానికి ప్రశంసలు తెలిపాడు.

Key Points

1

రామ్ చరణ్ 'హిట్ 3' సినిమా గురించి ట్వీట్ చేశాడు.

2

నానికి చరణ్ హ్యాట్సాఫ్ చెప్పాడు.

4

చరణ్ మరియు నాని సినిమాలు వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానున్నాయి.

చరణ్ ట్వీట్ వైరల్

నాని లేటెస్ట్ మూవీ హిట్ 3.. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మరీ సూపర్ అని అనట్లేదు గానీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ కూడా రెండు రోజుల్లో రూ.62 కోట్లకు పైనే వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్.. ఈ సినిమా గురించి ట‍్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. హీరో నానికి హ్యాట్సాఫ్ కూడా చెప్పాడు.

‘హిట్ 3కి అద్భుతమైన రివ్యూలు వచ్చాయని తెలిసింది. మై డియర్ బ్రదర్ నాని.. యూనిక్ స్క్రిప్ట్స్  ఎంపిక చేసి, హిట్స్ కొడుతున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తీసిన శైలేష్ కొలనుకి కూడా హ్యాట్సాఫ్. శ్రీనిధి శెట్టి, ప్రశాంతి త్రిపర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు’ అని చరణ్ రాసుకొచ్చాడు.

హిట్ 3 సినిమా విజయం

అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడీ స్థాయికి చేరిన నాని.. త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఓ సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. నాని కోసం, హిట్ 3 కోసం ట్వీట్ పెట్టినట్లు తెలుస్తోంది.

చరణ్ మరియు నాని సినిమాల రిలీజ్

అలానే వచ్చే ఏడాది మార్చి 26న నాని ‘ద ప్యారడైజ్’, మార్చి 27న చరణ్ ‘పెద్ది’ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని అధికారికంగానే ప్రకటించారు. ఇప్పుడు హిట్ 3 కోసం చరణ్ ట్వీట్ పెట్టడం చూస్తుంటే చరణ్ కి పోటీగా వస్తాడా? తప్పుకొంటాడా అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

చివరగా, రామ్ చరణ్ ట్వీట్ ‘హిట్ 3’ సినిమాకు మరింత ప్రాచుర్యం తెచ్చింది. రెండు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచుతోంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.