|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నోకియా ఫ్యాన్స్‌కు షాక్! 14 ఏళ్ల తర్వాత ఆశా 305 తిరిగి వస్తోంది.. HMD సర్‌ప్రైజ్ మామూలుగా లేదు!

Published: 08-07-2026, 4:52 AM
నోకియా ఫ్యాన్స్‌కు షాక్! 14 ఏళ్ల తర్వాత ఆశా 305 తిరిగి వస్తోంది.. HMD సర్‌ప్రైజ్ మామూలుగా లేదు!

నోకియా అభిమానులకు శుభవార్త! 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఐకానిక్ ఆశా 305 ఫోన్ సరికొత్త అవతార్‌లో తిరిగి రానుంది. హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్ ఈ ఫోన్‌ను ఆధునిక ఫీచర్లతో, సరసమైన ధరలో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని లీకైన వివరాలు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

HMD ఆశా 305 ఫోన్ 14 ఏళ్ల తర్వాత కొత్త అవతార్‌లో మార్కెట్లోకి రానుంది.

2

ఇది ఆండ్రాయిడ్ కాదు, ఫీచర్ ఫోన్ కాదు, మిక్స్‌డ్ ఫీచర్ ఫోన్‌గా వస్తోంది.

3

3-అంగుళాల టచ్ డిస్‌ప్లే, 5MP మెయిన్ కెమెరా, 2MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి.

4

HMD టచ్ 4జీ టెక్నాలజీతో సరసమైన ధరలో లభ్యం కానుంది.

ఆశా 305 రీఎంట్రీ: కొత్త అవతార్‌లో

HMD Asha 305 Leak : నోకియా పేరు గుర్తుందా? అప్పట్లో ఈ నోకియా క్రేజే వేరు.. కానీ, ఆ తర్వాత నోకియా కనుమరుగైపోయింది. చాలా ఏళ్ల తర్వాత నోకియా లవర్స్ కోసం మళ్లీ మార్కెట్లోకి సరికొత్తగా రాబోతుంది. ఈసారి కొత్త అవతార్ లుక్‌తో నోకియా ఆశా 305 రీఎంట్రీ ఇవ్వనుంది. హెచ్‌ఎమ్‌డీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే, లాంచ్‌కు ముందే కీలక సమాచారం లీక్ అయింది.

హెచ్‌ఎమ్‌డీ ఆశా 305గా లాంచ్ కానుంది. ఈ ఫోన్ 14 ఏళ్ల తర్వాత మార్కెట్‌లోకి రానుంది. గతంలో మాదిరిగా కంపెనీ పేరును, క్వాలిటీతో నిలబెట్టుకుంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ కాంపాక్ట్‌గా, స్ట్రాంగ్, సరసమైన ధరలో లభించనుంది. హెచ్‌ఎమ్‌డీ ఆశా 305 ఇతర ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..

సరికొత్త అవతార్‌లో రీఎంట్రీ : హెచ్‌ఎమ్‌డీ పాత నోకియా ఫోన్ ఆశా 305 మళ్లీ మార్కెట్లోకి రాబోతుంది. గతంలో నోకియా ఆశా 305 పేరుతో లాంచ్ అయింది. కంపెనీ జూలై 2012లో ఈ ఫోన్ రిలీజ్ చేసింది. కానీ, ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత అంటే 2026లో సరికొత్త అవతార్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.

ఫీచర్లు, కెమెరా వివరాలు

Read Also : Vivo Y6a Launch : వావ్.. మిడిల్ క్లాసు వాళ్లకు పర్ఫెక్ట్ ఫోన్ మావా.. వివో Y6a ఫీచర్లు చూస్తే నమ్మలేరు!

ఈ ఫోన్‌లో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయని అంటున్నారు. హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్ లాంచ్ చేయనున్న ఈ ఫోన్ మోడల్ నంబర్ హెచ్‌ఎమ్‌డీ టీఎ-1779గా అంచనా. నోకియా ఆశాలో S40 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఆండ్రాయిడ్‌కు బదులుగా కంపెనీ సొంత ఓఎస్‌పైనే రన్ అవుతుంది అనమాట.

ధర, లభ్యత అంచనాలు

ఫీచర్లు, కెమెరా అదుర్స్ : హెచ్ఎండీ ఆశా 305లో ఇంటర్నల్ ఎల్టీఈ మోడెమ్ ఉంటుందని అంచనా. ఈ ఫోన్ HMD టచ్ 4జీ టెక్నాలజీతో వస్తుందని భావిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కాదు.. ఫీచర్ ఫోన్ అంతకన్నా కాదు.. మిక్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న సింగిల్ ఫీచర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ టచ్ చాలా అద్భతంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో లిమిటెడ్ యాప్‌లు, సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ సరసమైన ధరలో సబ్-ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

నోకియా ఆశా 305 ఫోన్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఈ కొత్త ఫోన్‌లో 400×240 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 3-అంగుళాల టచ్ డిస్‌ప్లే ఉండవచ్చు. ఈ ఫోన్‌లో 5MP మెయిన్ కెమెరాతో పాటు, 2MP సెల్ఫీ కెమెరా కూడా ఉండొచ్చు. 1GB లేదా 2GB ర్యామ్ కూడా ఉండొచ్చు. ఈ నోకియా ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉండే అవకాశం ఉంది. స్టోరేజ్ పరంగా కంపెనీ మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్‌ను కూడా అందించే ఛాన్స్ ఉంది.

మొత్తంగా, హెచ్‌ఎమ్‌డీ ఆశా 305 రీఎంట్రీ నోకియా పాత రోజులను గుర్తుచేస్తూనే, కొత్త టెక్నాలజీతో మిక్స్డ్ ఫీచర్ ఫోన్ అనుభవాన్ని అందించనుంది. సరసమైన ధరలో మంచి ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ మార్కెట్‌లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.