|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: క్యాన్సర్‌తో హాలీవుడ్ నటి హఠాన్మరణం! విషాదంలో సినీ పరిశ్రమ!

Published: 04-04-2026, 5:35 AM
షాకింగ్: క్యాన్సర్‌తో హాలీవుడ్ నటి హఠాన్మరణం! విషాదంలో సినీ పరిశ్రమ!
  • ప్రముఖ హాలీవుడ్ నటి డీ ఫ్రీమాన్ క్యాన్సర్‌తో కన్నుమూశారు.
  • డీ ఫ్రీమాన్ వయస్సు 66 సంవత్సరాలు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
  • నటిగా రాకముందు ఆమె అమెరికా మెరైన్ కార్ప్స్‌లో ఆరు సంవత్సరాలు పనిచేశారు.
  • సీన్ ఫెల్ట్, డెక్స్టర్ వంటి వెబ్ సిరీస్‌లలో డీ ఫ్రీమాన్ నటించారు.

హాలీవుడ్ నటి డీ ఫ్రీమాన్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆమె మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

క్యాన్సర్‌తో పోరాడి ఓడిన డీ ఫ్రీమాన్

Film industry:గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో ఒకవైపు శుభవార్తలు.. మరొకవైపు అశుభ వార్తలు అభిమానులను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తుంటే.. మరికొంతమంది వివిధ అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడుస్తూ ఇండస్ట్రీకి తీరని లోటును మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలను వెంటాడుతున్న మహమ్మారి క్యాన్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెరపై అందంతో, నటనతో ఉర్రూతలూగించే ఈ సెలబ్రిటీలు తెర వెనుక ఇలాంటి మహమ్మారి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. అయితే ఈ క్యాన్సర్ బారిన పడిన చాలామంది ఈ మహమ్మారిని జయించి మళ్లీ తెరపై సందడి చేస్తుంటే.. మరికొంతమంది పోరాడలేక తుది శ్వాస విడుస్తున్నారు. ఈ క్రమంలోనే మరొక నటి క్యాన్సర్ తో పోరాడి చివరికి తుదిశ్వాస విడిచింది.

ఆమె ఎవరో కాదు ప్రముఖ హాలీవుడ్ నటి డీ ఫ్రీమాన్. ప్రస్తుతం ఈమె వయసు 66 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడిన ఈమె ఎట్టకేలకు చికిత్స పొందుతూ ఈ మహమ్మారిని జయించలేక తుదిశ్వాస విడిచింది. స్టేజ్ ఫోర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాడుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. డీ ఫ్రీమాన్ మహమ్మారి బారినపడి మరణించడంతో అభిమానులు, సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది . ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అలాగే ఈమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

డీ ఫ్రీమాన్ సినీ ప్రస్థానం

ఇకపోతే డీ ఫ్రీమాన్ సినిమా ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెట్టకు ముందు అమెరికా మెరైన్ కార్ప్స్ లో దాదాపు ఆరు సంవత్సరాల పాటు పనిచేసింది. అలా సైన్యంలో పనిచేసే తనకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని కూడా అనుభవించారు.

సినీ పరిశ్రమలో విషాద ఛాయలు

ఆ తరువాత ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఈమె మొదట జపాన్లో రేడియో డీజే గా కూడా రాణించారు. ఆ తర్వాత సీన్ ఫెల్ట్ , డెక్స్టర్ వంటి పాపులర్ వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అంతేకాదు ది యంగ్ అండ్ ది రెస్ట్ లెస్, సిస్టాస్ వంటి సుదీర్ సీరియల్స్ ఈమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. ఇకపోతే అటు టెలివిజన్ రంగంలో ఈమె చేసిన కృషికి గాను పలువురు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అలాంటి ఈమె నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.

డీ ఫ్రీమాన్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఆమె చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాము.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.