|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ఊ అంటావా మావా’ సాంగ్ కాపీ చేసిన హాలీవుడ్.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ రియాక్షన్ ఇదే.. ఐదు నిమిషాల్లో..

Published: 30-06-2025, 7:25 AM
‘ఊ అంటావా మావా’ సాంగ్ కాపీ చేసిన హాలీవుడ్.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ రియాక్షన్ ఇదే.. ఐదు నిమిషాల్లో..

పుష్ప సినిమాలోని సూపర్ హిట్ పాట ‘ఊ అంటావా మావా’ను హాలీవుడ్ గాయని కాపీ చేసిందనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ విషయంపై సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్పందించారు.

Key Points

1

‘ఊ అంటావా మావా’ పాట హాలీవుడ్ గాయనిచే కాపీ చేయబడింది.

2

దేవిశ్రీ ప్రసాద్ ఐదు నిమిషాల్లో ఆ పాటను రచించారని తెలిపారు.

4

డీఎస్పీ అభిమానులు ఆయన సాధనను గర్వంగా జరుపుకుంటున్నారు.

‘ఊ అంటావా మావా’ పాట కాపీరైట్ వివాదం

‘పుష్ప : ది రైజ్’ మూవీలోని బ్లాక్ బస్టర్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా’కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఈవెంట్స్‌, ఫంక్షన్స్‌లో మారుమోగుతూనే ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. సమంత, అల్లు అర్జున్ స్టెప్స్‌తో ఇరగదీశారు. అదిరిపోయే ట్యూన్, ఐకానిక్ కొరియోగ్రఫీతో వైరల్ హిట్ చేశారు. ఈ పాట తెలుగులో 100 మిలియన్లకు పైగా యూట్యూబ్ వ్యూస్, హిందీలో 80 మిలియన్ల వ్యూస్ సాధించింది. ప్రత్యేకంగా చెప్పాలంటే సమంత హుక్ స్టెప్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది.

అయితే ఈ పాటను హాలీవుడ్‌కు చెందిన టర్కిష్ గాయని అటియే కాపీ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. నవంబర్ 2024లో విడుదల చేసిన ‘అన్లయనా’ సాంగ్‌ పాట పూర్తిగా ‘ఊ అంటావా’ పాటను పోలి ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా దీనిపై స్పందించిన దేవి శ్రీ ప్రసాద్.. తాను ఈ పాటను కేవలం ఐదు నిమిషాల్లో క్రియేట్ చేశానని, దాన్ని హాలీవుడ్ కాపీ చేసిందని పోస్ట్ పెట్టారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. దీనిపై స్పందిస్తున్న డీఎస్పీ ఫ్యాన్స్.. మేకర్స్ అంతా హాలీవుడ్‌ నుంచి కాపీ చేస్తున్నారని… కానీ మీ ట్యూన్‌ను హాలీవుడ్ కాపీ చేసిందని.. అది దేవి శ్రీ ప్రసాద్ రేంజ్ అంటూ గర్వంగా ఫీల్ అవుతున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ స్పందన

సోషల్ మీడియాలో చర్చ

దేవి శ్రీ ప్రసాద్ తన పాట కాపీ అయిన విషయంపై తీవ్రంగా స్పందించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించడంతో ఈ ఘటన సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.