|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన హోంబలే ఫిల్మ్స్.. ఒకేసారి ఏడు సినిమాలు

Published: 25-06-2025, 4:19 AM
బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన హోంబలే ఫిల్మ్స్.. ఒకేసారి ఏడు సినిమాలు

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్, ఏకంగా ఏడు సినిమాలను ఒకేసారి ప్రకటించి సినీ ప్రపంచాన్ని షాక్ చేసింది. ‘మహావతార్’ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఈ సినిమాలు విడుదల కానున్నాయి.

Key Points

1

హోంబలే ఫిల్మ్స్ ఏకంగా ఏడు సినిమాలను ఒకేసారి ప్రకటించింది!

2

మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాలు రిలీజ్ అవుతాయి.

4

ప్రతి రెండేళ్లకు ఒక సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు.

హోంబలే ఫిల్మ్స్ యొక్క భారీ ప్రకటన

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్(Hombale Films) అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఇప్పటికే కేజీఎఫ్, కాంతార(Kantara), సలార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ సంస్థ స్టార్ హీరోలతో పలు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టింది. ఇటీవల బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, హోంబలే ఫిల్మ్స్ వారు ఓకే సారి ఏడు చిత్రాలను ప్రకటించిన ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేస్తూ 7 సినిమాల పేర్లు, విడుదల తేదీలను ప్రకటించారు.

ఈ పోస్ట్‌కు ‘‘అవకాశాలు అంతులేనివి. మా కథలను తెరపై సజీవంగా గర్జిస్తూ చూడటానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఒక ఎపిక్ సినిమాటిక్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి! హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ ద్వారా ఉత్కంఠభరితమైన యానిమేషన్ ద్వారా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌ని ప్రదర్శిస్తుంది. విష్ణువు యొక్క పది దివ్య అవతారాలను కలిగి ఉన్న ఒక దశాబ్దానికి పైగా విస్తరించి ఉన్న మా లైనప్‌ను ఆవిష్కరించడానికి మేము సంతోషిస్తున్నాము’’ అనే క్యాప్షన్ జత చేసి హైప్ పెంచారు. అయితే ఈ సినిమాలన్నింటినీ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రెండేళ్లకు ఒకటి చొప్పున విడుదల చేయనున్నారు.

ఇందులో మొదటిది అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘నరసింహా’ (Narasimha)సినిమాను త్రీడిలో ఏకంగా ఐదు బాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇక హోంబలే ఫిల్మ్స్ ప్రకటన చూసిన నెటిజన్లు సడెన్‌గా చూసి షాక్ అవుతుండగా.. సినీ ప్రియులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, నటీనటులకు సంబంధించిన వివరాలు ఎప్పుడెప్పుడు వెల్లడిస్తారా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాలతో పాటు సలార్-2, కాంతార-2 వంటి ప్రాజెక్ట్స్‌ను కూడా నిర్మిస్తోంది. మొత్తానికి హోంబలే ఫిల్మ్స్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. అసలు ఆ సినిమా పేర్లు, రిలీజ్ తేదీలెంటో ఇక్కడ తెలుసుకుందాం..

*మహావతార్: నరసింహ (25 జూలై 2025)

మహావతార్ సినిమాటిక్ యూనివర్స్

* మహావతార్: పరుశురామ్(2027)

*మహావతార్: రఘునందన్ (2029)

* మహావతార్: ద్వారకాధీశ్ (2031)

సినిమాల విడుదల తేదీలు

* మహావతార్: గోకులానంద (2033)

* మహావతార్: కల్కి-1 (2035)

* మహావతార్: కల్కి-2 (2037)

మొత్తంగా, హోంబలే ఫిల్మ్స్ తమ ప్రకటనతో సినీ ప్రేమికులను ఉత్సాహపరిచింది. ఈ సినిమాల విజయం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.