
హాలీవుడ్ హారర్ ప్రియులకు శుభవార్త. వెన్నులో వణుకు పుట్టించే ‘ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్’ ఓటీటీలోకి రానుంది. రూ.4065 కోట్ల భారీ వసూళ్లు సాధించిన ఈ రియల్ స్టోరీ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తుంది. భయపెట్టే అద్దం కథతో ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది.
Key Points
ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ తొమ్మిదో సినిమా ఓటీటీలోకి రాబోతోంది.
అక్టోబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్.
రూ.4065 కోట్ల భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించిన హారర్ థ్రిల్లర్.
స్మర్ల్ హంటింగ్ కేసు, భయపెట్టే అద్దం ఆధారంగా రూపొందించిన నిజ జీవిత కథ.
ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ ఓటీటీ స్ట్రీమింగ్
హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లు అంటేనే వేరే లెవల్. ఇక అందులోనూ ది కాంజురింగ్ సిరీస్ కు మరింత స్పెషాలిటీ ఉంది. ఈ సినిమాను ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. భయంతో చంపేస్తాయి. ఇప్పుడు ఈ సిరీస్ లోని తొమ్మిదో సినిమా ‘ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్’ ఓటీటీలోకి రాబోతుంది. ఆడియన్స్ ను భయపెట్టేంత థ్రిల్ అందించడానికి డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
ది కాంజురింగ్ ఫ్రాంఛైజీలోని సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. హారర్ థ్రిల్లర్ల కు ఇవి ఒక బెంచ్ మార్క్ లాంటివి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది. అక్టోబర్ 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
రీసెంట్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ మూవీ ఓటీటీలోకి దూసుకొస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. మంగళవారం నుంచి ఈ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. కానీ రెంట్ విధానంలో మాత్రమే ఇప్పుడు ఈ మూవీని చూసేందుకు అవకాశం ఉంటుంది. పే చేసి మాత్రమే చూడొచ్చు.
బాక్సాఫీస్ వద్ద రూ.4065 కోట్ల రికార్డు కలెక్షన్లు
ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ మూవీ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ గా నిలిచింది. సెప్టెంబర్ 5, 2025న ఈ సినిమా రిలీజైంది. ఫస్ట్ డే నుంచి బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఇండియాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన అమెరికన్ హారర్ థ్రిల్లర్ గా నిలిచింది. మొత్తం రూ.4065 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఈ హారర్ ఫ్రాంఛైజీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే.
రూ.488 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన సినిమా ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్. దీనికి మైకెల్ చావ్స్ డైరెక్టర్. స్మర్ల్ హంటింగ్ కేస్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వెర ఫార్మింగా, పాట్రిక్ విల్సన్, మియా, బెన్ తదితరులు నటించారు.
ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ కథ
భయపెట్టే అద్దం వెనుక అసలు కథ ఏమిటి?
ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ మూవీ ఓ సూపర్ నేచురల్ హారర్ సినిమా. 1964లో ఎడ్, వారెన్ ఓ మిర్రర్ తో కూడిన హంటింగ్ కేసును ఎంక్వైరీ చేస్తారు. ఆ మిర్రర్ లో వారెన్ తన భవిష్యత్ ను, బిడ్డ పుట్టకపోవడాన్ని చూస్తుంది. కానీ ఆ బిడ్డ పుడుతుంది. ఆమెకు జ్యూడీ అనే పేరు పెడతారు.
22 ఏళ్ల తర్వాత ఆ అద్దం జ్యూడీని వెంటాడుతూనే ఉంటుంది. ఆ అద్దాన్ని పగలగొట్టేస్తారు. అయినా ఓ పెద్దావిడ, ఓ అమ్మాయి, గొడ్డలితో ఉన్న ఓ పురుషుడు వెంటపడుతూనే ఉంటారు. మరి చివరకు ఏం జరిగిందో మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించి, భారీ కలెక్షన్లు రాబట్టింది. హారర్ ఫ్రాంఛైజీలో రికార్డులు సృష్టించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో చూసి మీరు కూడా థ్రిల్ అవ్వచ్చు.


